అన్వేషించండి

Amala Akkineni - Konda Surekha: మిస్టర్ రాహుల్ గాంధీ... మీ నాయకుల్ని కంట్రోల్‌లో పెట్టుకోండి - కొండా సురేఖ కామెంట్స్‌పై అమల అక్కినేని ఫైర్

సమంత విడాకుల వ్యవహారంలో నాగార్జున, నాగ చైతన్య మీద కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల అక్కినేని అమల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేఖను రాక్షసిగా పేర్కొన్నారు. ఇంకా ఆవిడ ఏమన్నారంటే?

Amala Akkineni asks Rahul Gandhi to control his party leaders and demands an apology from Konda Surekha: అక్కినేని నాగ చైతన్య, సమంత (Samantha) విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగు ప్రజలు మాత్రమే కాదు... ఆ మాటలు తెలిసిన ఇతరుల సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళగా అటువంటి నిరాధారమైన ఆరోపణలు ఎలా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున, సమంత ఖండించిన విషయం తెలిసిందే. నాగార్జున సతీమణి, సీనియర్ కథానాయిక అక్కినేని అమల అయితే సురేఖ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కొండా సురేఖను రాక్షసిగా పేర్కొన్న అమల!
ఓ మహిళా మంత్రి రాక్షసిగా మారి... దురుద్దేశంతో కట్టు కథలు అల్లి కల్పిత ఆరోపణలు చేయడం, రాజకీయ యుద్ధం కోసం మంచి మనుషులను పావులుగా వాడుకోవడం విని నేను షాక్ అయ్యానని అక్కినేని అమల సోషల్ మీడియా వేదికగా ఒక లేఖ విడుదల చేశారు. కొండా సురేఖను ఆమె రాక్షసిగా వర్ణించారు. 

తన భర్త మీద కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటు అని అమలా అక్కినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ''మేడం మినిస్టర్... ఎటువంటి సిగ్గు ఎగ్గు లేకుండా నా భర్త గురించి మంచి మర్యాద లేని వ్యక్తులు చెప్పిన కట్టు కథలను మీరు ఎలా నమ్మారు? ఇది నిజంగా సిగ్గు చేటు'' అని అమల ప్రశ్నించారు. నాయకులు తమ స్థాయి మరిచి దిగజారి నేరస్తుల తరహాలో ప్రవర్తిస్తే దేశం ఏమవుతుందని ఆవిడ ఆవేదనతో కూడిన ప్రశ్నను వ్యక్తం చేశారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amala Akkineni (@akkineniamala)

మిస్టర్ రాహుల్ గాంధీ... అదుపులో పెట్టుకోండి!
''మిస్టర్ రాహుల్ గాంధీజీ.. మీరు గనక మానవత్వాన్ని, మర్యాదను విశ్వసించేటట్లు అయితే మీ నాయకులను అదుపులో ఉంచుకోండి. మీ మంత్రితో నా కుటుంబానికి క్షమాపణ చెప్పించండి. ఈ దేశ పౌరులను రక్షించండి'' అని అక్కినేని అమల తన లేఖను ముగించారు.

Also Read: నా విడాకులకు, రాజకీయాలకు సంబంధం లేదు - కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత


తన విడాకులకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని సమంత సైతం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కినేని ఫ్యామిలీకి కొండా సురేఖ బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. అక్కినేని నాగార్జున ఏమన్నారో తెలుసుకోవడం కోసం ఈ కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.

Also Readమంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని ఖండించిన నాగార్జున... ఆయన ఏం చెప్పారంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana CM Revanth Reddy : ఫామ్‌ హౌస్‌లను కాపాడుకోవడానికే బీఆర్‌ఎస్ హడావుడి- కూల్చివేతలపై డ్రామాలంటూ రేవంత్ ఘాటు విమర్శలు  
ఫామ్‌ హౌస్‌లను కాపాడుకోవడానికే బీఆర్‌ఎస్ హడావుడి- కూల్చివేతలపై డ్రామాలంటూ రేవంత్ ఘాటు విమర్శలు  
Telangana High Court: ఎమ్మెల్యే అనర్హత వేటు కేసులో తెలంగాణ హైకోర్టు మరో కీలక నిర్ణయం
ఎమ్మెల్యే అనర్హత వేటు కేసులో తెలంగాణ హైకోర్టు మరో కీలక నిర్ణయం
Jani Master Bail: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు ఊరట... బెయిల్ మంజూరు చేసిన కోర్టు
లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు ఊరట... బెయిల్ మంజూరు చేసిన కోర్టు
Devara: ఆరు రోజుల్లో రూ.396 కోట్లు - దుమ్మురేపుతున్న ‘దేవర’!
ఆరు రోజుల్లో రూ.396 కోట్లు - దుమ్మురేపుతున్న ‘దేవర’!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana CM Revanth Reddy : ఫామ్‌ హౌస్‌లను కాపాడుకోవడానికే బీఆర్‌ఎస్ హడావుడి- కూల్చివేతలపై డ్రామాలంటూ రేవంత్ ఘాటు విమర్శలు  
ఫామ్‌ హౌస్‌లను కాపాడుకోవడానికే బీఆర్‌ఎస్ హడావుడి- కూల్చివేతలపై డ్రామాలంటూ రేవంత్ ఘాటు విమర్శలు  
Telangana High Court: ఎమ్మెల్యే అనర్హత వేటు కేసులో తెలంగాణ హైకోర్టు మరో కీలక నిర్ణయం
ఎమ్మెల్యే అనర్హత వేటు కేసులో తెలంగాణ హైకోర్టు మరో కీలక నిర్ణయం
Jani Master Bail: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు ఊరట... బెయిల్ మంజూరు చేసిన కోర్టు
లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు ఊరట... బెయిల్ మంజూరు చేసిన కోర్టు
Devara: ఆరు రోజుల్లో రూ.396 కోట్లు - దుమ్మురేపుతున్న ‘దేవర’!
ఆరు రోజుల్లో రూ.396 కోట్లు - దుమ్మురేపుతున్న ‘దేవర’!
Ram Gopal Varma: చైతన్య, నాగార్జునను అవమానించి సమంతకు సారీ చెప్పడం ఏమిటి? - లాజిక్ బయటకు తీసిన వర్మ
చైతన్య, నాగార్జునను అవమానించి సమంతకు సారీ చెప్పడం ఏమిటి? - లాజిక్ బయటకు తీసిన వర్మ
Adani Congress : హైదరాబాద్‌లో అదానీతో పొంగులేటి, సునీల్ కనుగోలు భేటీ - రహస్య ఒప్పందాలేమిటో చెప్పాలన్న కేటీఆర్
హైదరాబాద్‌లో అదానీతో పొంగులేటి, సునీల్ కనుగోలు భేటీ - రహస్య ఒప్పందాలేమిటో చెప్పాలన్న కేటీఆర్
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయమేంటీ? కేంద్రం ఏం చెబుతుంది?
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయమేంటీ? కేంద్రం ఏం చెబుతుంది?
Devara Success Meet: దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్ చేయడానికి కారణాలు... అసలు విషయం చెప్పిన నాగవంశీ
దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్ చేయడానికి కారణాలు... అసలు విషయం చెప్పిన నాగవంశీ
Embed widget