అన్వేషించండి

Pushpa 2: కళ్లు చెదిరే యాక్షన్ సీక్వెన్స్ తో క్లైమాక్స్- ‘పుష్స 2‘ నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చిన మేకర్స్!

‘పుష్ప 2’ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం క్లైమాక్స్ సీన్స్ షూట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు.

Pushpa 2 Climax Shooting: గత కొంతకాలంగా ‘పుష్ప 2’ సినిమాకు సంబంధించి  వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు మేకర్స్ చెక్ పెట్టారు. అల్లు అర్జున్, సుకుమార్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. బన్నీ గడ్డం తీసేసి, విదేశాలకు వెళ్లిపోయారంటూ ఊహాగానాలు వినిపించాయి.  ఒకానొక సమయంలో ‘పుష్ప 2’ షూటింగ్ నిలిచిపోయిందంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితులలో సినిమా విడుదల వాయిదా పడటం ఖాయమనే టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. సినిమా షూటింగ్ కు సంబంధించి అదిరిపోయే విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ చేస్తున్నట్లు వివరించారు.  

క్లైమాక్స్ షూటింగ్ గురించి చిత్ర నిర్మాణ సంస్థ కీలక అప్ డేట్

తాజాగా ‘పుష్ప 2: ది రూల్’ షూటింగ్ గురించి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కీలక విషయాన్ని వెల్లడించింది. క్లైమాక్స్ కోసం యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతున్నట్లు తెలిపింది. డిసెంబర్ 6న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోందని స్పష్టం చేసింది. ఈ మేరకు జాతర ఫైట్ కు సంబంధించి చిన్న క్లిప్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pushpa (@pushpamovie)

బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

‘పుష్ప 2’ గురించి రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా ప్రకటన విని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు, ఇన్ని రోజులు వచ్చిన వార్తలు నిజం కాదని తెలియడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుందని తెలియడంతో కచ్చితంగా ముందుగా అనుకున్నట్లుగానే డిసెంబర్ 6న సినిమా విడుదల కావడం పక్కా అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘పుష్ప’ సినిమాకు మించి ఈ చిత్రం సక్సెస్ కావడం ఖాయమని భావిస్తున్నారు.  

డిసెంబర్ 6న ‘పుష్ప 2’ విడుదల

వాస్తవానికి ‘పుష్ప 2’ సినిమా ఆగష్టు 15న విడుదలకావాల్సి ఉంది. కానీ, షూటింగ్ ఆలస్యం కావడం, నిర్మాణాంతర పనులలో జాప్యం కారణంగా వాయిదా పడింది. డిసెంబర్ 6న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దర్శకుడు సుకుమార్ కారణంగానే సినిమా షూటింగ్ ఆలస్యం అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. 

2021లో వచ్చిన అద్భుత విజయాన్ని అందుకున్న ‘పుష్ప’ సినిమాను మించి ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ప్రతి సీన్ విషయంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ అనుకున్న సమయానికంటే ఆలస్యం అవుతున్నట్లు తెలిసింది. సినిమా షూటింగ్ ఆలస్యం కావడం పట్ల బన్నీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఊహాగానాలు వినిపించాయి.

మొత్తంగా సినిమా క్లైమాక్స్ కు చేరడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన రెండు పాటలు బాగా పాపులర్ కావడంతో పాటు మూవీపై అంచనాలు పెంచాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Read Also: కన్నప్పలో ప్రముఖ నటుడు దేవరాజ్‌  - ఆయన పాత్ర ఏంటో తెలుసా? పోస్టర్‌లోనే రివీల్‌

టాప్ హెడ్ లైన్స్

Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget