అన్వేషించండి

Allu Arjun : మెగాస్టార్​లో ఆ యాంగిల్ కూడా ఉంది.. చిరు గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టిన అల్లు అర్జున్

unstoppable season 4 : చిరంజీవిలో ఆ యాంగిల్ కూడా ఉంది అంటూ అల్లు అర్జున్ చిరు గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు. ఆ ఆసక్తికర సంఘటన అన్ స్టాపబుల్-4లో జరిగింది.

Allu Arjun Speaks about Chiranjeevi : మరికొన్ని రోజుల్లో మోస్ట్ అవైటింగ్ మూవీ "పుష్ప 2" థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు "అన్ స్టాపబుల్ సీజన్ 4" టాక్ షోలో అల్లు అర్జున్ ఎపిసోడ్ కు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ కూడా తెగ సందడి చేస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ ఈ టాక్ షోలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు. 

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న "అన్ స్టాపబుల్ సీజన్ 4" టాక్ షో ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తాజాగా అల్లు అర్జున్ పాల్గొన్న ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్ కు సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాగా, మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ఆహా "అన్ స్టాపబుల్ -4"లో అల్లు అర్జున్ కు సంబంధించిన మరో ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో అల్లు అర్జున్ తన పిల్లలు పిల్లలు అల్లు అయాన్, అర్హతో కలిసి సందడి చేశారు. ఇక షోలో భాగంగా బాలయ్యతో అల్లు అర్జున్ చెప్పిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి. అందులోనూ ఆయన మెగాస్టార్ చిరంజీవితో తన బంధం గురించి మాట్లాడిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 

Read Also : Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్

బాలయ్య మాట్లాడుతూ "అల్లు అరవింద్, చిరంజీవి... ఇలా మీ ఫ్యామిలీలో అందరూ గొప్పవాళ్లే. వాళ్లతో మీ బంధం ఎలా ఉంటుంది ?" అని అల్లు అర్జున్ ని ప్రశ్నించారు. దానికి అల్లు అర్జున్ స్పందిస్తూ "చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవి గారు చాలా ఇష్టమని అందరికీ తెలుసు. కానీ 20 ఏళ్ల వరకు నేను ఆయనతో ఎలా ఉన్నానో ఎవరికీ తెలియదు. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ పెరిగాను. కాబట్టి ఒక హీరోగా కంటే ఒక వ్యక్తిగా ఆయనంటే అభిమానం ఎక్కువ. నా చిన్నప్పుడే మమ్మల్ని అందరినీ అమెరికాకు తీసుకెళ్లిన మొట్టమొదటి వ్యక్తి చిరంజీవి గారు. ఆయన అనుకుంటే తన కుటుంబం వరకే తీసుకుని వెళ్లి ఉండొచ్చు. కానీ అలా కాకుండా మమ్మల్ని అందరినీ వెంట తీసుకెళ్లారు. అప్పట్లో అంత మంది పిల్లల్ని తీసుకెళ్లడం అనేది నిజానికి అసాధ్యమని చెప్పాలి. అలాంటిది ఆయన మమ్మల్ని తీసుకెళ్లారు" అంటూ చిరంజీవి గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు.  

మెగాస్టార్ చిరంజీవికి చిన్నపిల్లలు అంటే బాగా ఇష్టమన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇలా తన ఫ్యామిలీతో పాటు, మొత్తం మెగా ఫ్యామిలీకి సంబంధించిన పిల్లల్ని తీసుకుని వెళ్లారన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఇక అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్స్ తో ఇప్పటిదాకా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కి మధ్య గొడవలు జరుగుతున్నాయి అనే విషయం నిజం కాదని స్పష్టమైంది. ముఖ్యంగా అల్లు అర్జున్ తనకు చిరంజీవి అంటే ఎంత ఇష్టమో స్వయంగా ఆయన మాటల్లోనే చెప్పడంతో, రీసెంట్ గా జరిగిన గత కొన్ని సంఘటనల వల్ల అల్లు అర్జున్ పై గుర్రుగా ఉన్న మెగా అభిమానులు... అదంతా పక్కన పెట్టేసి ఖుషి అవుతున్నారు.

Also Read'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget