అన్వేషించండి

Pushpa 2 The Rule: బాలీవుడ్ వందేళ్ల చరిత్ర కోటను బద్దలుకొట్టిన ఐకాన్ స్టార్... రికార్డులతో తాండవమాడేస్తోన్న పుష్పరాజ్

పుష్పగాడి ప్రభంజనానికి హద్దే లేకుండా పోతుంది. ఆడా, ఈడా అని లేకుండా యాడబడితే ఆడా రికార్డులను నమోదు చేసుకుంటూ పుష్పరాజ్ గాడు తన హ్యాండ్ వేసేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే రికార్డులతో తాండవమాడేస్తున్నాడు.. 

‘పుష్ప’ అంటే ఫైర్ కాదు... వైల్డ్ ఫైర్ అని నిరూపిస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా టైటిల్‌కి తగ్గట్టే బాక్సాఫీస్‌ని రూల్ చేస్తోంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా... అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడబడితే అక్కడ రికార్డులు నమోదు చేసుకుంటూ వెళుతోంది. విడుదలైన రెండే వారాల్లో దాదాపు అన్ని రికార్డులకు చరమగీతం పాడేసింది. మరీ ముఖ్యంగా వందేళ్ల హిందీ సినిమా హిస్టరీని.. ఇప్పుడొచ్చిన ఒక తెలుగు సినిమా బద్దలకొట్టడమంటే... అదీ పుష్పరాజ్‌‌కి ఉన్న క్యాలిబర్. ఒక్క హిందీ బెల్ట్ అనే కాదు.. విడుదలైన అన్ని చోట్లా దాదాపు పుష్ప గాడి హ్యాండ్ గుర్తు పడుతూనే ఉంది. రెండు వారాలు పూర్తయినా.. పుష్పగాడి హవా కొనసాగుతూనే ఉంది.

‘పుష్ప’గాడి కలెక్షన్స్‌ని కౌంట్ చేసుకోవాల్సిన మేకర్స్.. బాక్సాఫీస్ వద్ద వాడు క్రియేట్ చేస్తున్న రికార్డులను నమోదు చేసుకుంటూ.. వాటిని అధికారికంగా ప్రకటిస్తున్నారు. అవును.. పుష్ప ఇంత కలెక్ట్ చేసిందని చెప్పాల్సిన వారే.. అక్కడ రికార్డ్, ఇక్కడ హిస్టరీ అంటూ అధికారిక ప్రకటనలు విడుదల చేస్తున్నారంటే.. పుష్పరాజ్ ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వారు చెబుతున్న లెక్కలు కాదు కాదు.. రికార్డులను ఒక్కసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకు బాలీవుడ్ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్‌ చేయని కలెక్షన్స్‌ని.. కేవలం 15 రోజుల్లోనే పుష్పరాజ్ రాబట్టాడు. మేకర్స్ చెబుతున్న లెక్కల ప్రకారం హిందీ బెల్ట్‌లో ఈ సినిమా 632 కోట్ల 50 లక్షల రూపాయాల వసూళ్లను సాధించిన తొలి భారతీయ చిత్రంగా హిస్టరీని క్రియేట్ చేసిందని ప్రకటించారు. అంతేకాదు, ఇప్పటి వరకు బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఉన్న ‘స్త్రీ2’ చిత్ర లైఫ్‌ టైమ్‌ రన్‌ను కేవలం 15 అంటే 15 రోజుల్లోనే ‘పుష్ప 2’ చిత్రం అధిగమించడం విశేషం. 

Also Read: బాలీవుడ్‌లో ఈ ఐదుగురు హీరోలు డిజప్పాయింట్ చేశారబ్బా... ఒక్కటంటే ఒక్కటి కూడా రాలే

ఇవేనా.. ఇంకా చెప్పాలంటే, అత్యంత వేగంగా కేవలం 14 రోజుల్లోనే రూ.1500 కోట్ల రూపాయలు సాధించిన తొలి ఇండియన్ సినిమాగానూ, అలాగే ఒక్క ముంబైలోనే రూ. 200 కోట్ల నెట్‌ను వసూలు చేసిన తొలి చిత్రంగా ‘పుష్ప-2’ సరికొత్త రికార్డులను బాక్సాఫీస్ వద్ద లిఖించింది. అంతేకాదు, 2024 సంవత్సరంలో హయ్యెస్ట్‌ గ్రాస్‌ను సాధించిన తొలి భారతీయ సినిమాగా ‘పుష్పరాజ్’ రికార్డును క్రియేట్ చేశాడు. వీటితో పాటు మరో రికార్డ్ కూడా అల్లు అర్జున్ వశమైంది.

‘పుష్ప ది రైజ్’ (2021), ‘పుష్ప 2 ది రూల్’ (2024) చిత్రాలతో వరుసగా బ్యాక్ టు బ్యాక్ హయ్యెస్ట్ గ్రాసర్స్ వసూలు చేసిన ఇండియన్ సినిమా హీరోగా అల్లు అర్జున్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇవి తెలిసిన రికార్డులే.. తెలియకుండా ఇంకెన్ని రికార్డులున్నాయో అని ‘పుష్పరాజ్’ రికార్డుల తాండవం గురించి ఫ్యాన్స్ సైతం మాట్లాడుకుంటుండటం విశేషం. మరి 15 రోజులకే ఇలా ఉంటే.. ఫుల్ రన్‌లో ‘పుష్ప రాజ్’గాడిని ఆపడం ఎవరితరం కాదేమో. మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్ పతాకంపై క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Read Also : Best Christmas Movies : క్రిస్మస్​ను మరింత స్పెషల్​గా చేసే బెస్ట్ మూవీస్... ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget