Mukhya Gamanika Movie: శుక్రవారమే థియేటర్లలోకి అల్లు అర్జున్ బావమరిది సినిమా - విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మేనమామ కుమారుడు విరాన్ ముత్తంశెట్టి హీరోగా నటించిన 'ముఖ్య గమనిక' సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మేనమామ కుమారుడు, వరుసకు ఆయనకు బావమరిది అయ్యే విరాన్ ముత్తంశెట్టి (Viran Muttamsetty) కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'ముఖ్య గమనిక' (Mukhya Gamanika Movie). ఇందులో లావణ్య హీరోయిన్. శివిన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజశేఖర్, సాయి కృష్ణ ప్రొడ్యూస్ చేశారు. వేణు మురళీధర్. వి దర్శకుడు. ఈ నెల 23న... అంటే శుక్రవారం థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
విరాన్, నేను జిమ్ ఫ్రెండ్స్! - విశ్వక్ సేన్
'ముఖ్య గమనిక' ప్రీ రిలీజ్ వేడుకలో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ... ''విరాన్, నేను జిమ్ ఫ్రెండ్స్. అతను చాలా మంచి వ్యక్తి. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా... తన సొంత కష్టం మీద పైకి రావాలని అనుకుంటున్నాడు. విరాన్ నన్ను 'అన్నా' అంటాడు. కానీ, నేను విరాన్‌ను అన్నా అని పిలవాలి. ఫిబ్రవరి 23న ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, అతనితో పాటు టీమ్ అందరికీ పెద్ద విజయం రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా'' అని అన్నారు.
నన్ను సపోర్ట్ చేసే అల్లు అర్జున్, శిరీష్‌లకు థాంక్స్ - విరాన్
హీరో విరాన్ ముత్తంశెట్టి మాట్లాడుతూ... ''మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గారికి స్పెషల్ థాంక్స్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు గారికి, నా నిర్మాతలకు థ్యాంక్స్. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ... అన్ని చాలా బాగుంటాయి. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయి. చిత్రీకరణలో బిజీగా ఉన్నా విశ్వక్ అన్న నా కోసం వచ్చారు. ఆయనకు చాలా థాంక్స్. అలాగే... నా వెనకే ఉండి నన్ను సపోర్ట్ చేసే అల్లు అర్జున్ గారికి, నా కజిన్ శిరీష్ గారికి స్పెషల్ థాంక్స్. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా'' అని అన్నారు.
నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అల్లు అర్జున్ గారు
దర్శకుడు వేణు మురళీధర్ మాట్లాడుతూ... ''ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అల్లు అర్జున్ గారు. విరాన్ ముత్తంశెట్టి ఈ సినిమా ఒప్పుకోవడం నా అదృష్టం. ఆయన సమయపాలన, క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. హీరోయిన్ లావణ్య చాలా బాగా చేసింది. కిరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్'' అని అన్నారు. ''లవ్, డ్రామా, సస్పెన్స్, మంచి మ్యూజిక్... ప్రేక్షకులు కోరుకునే అంశాలు అన్నీ ఉన్న సినిమా ఇది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. విరాన్ చాలా మంచి వ్యక్తి. ఎంతో సపోర్టివ్ పర్సన్'' అని హీరోయిన్ లావణ్య చెప్పారు.
Also Read: బ్రహ్మానందం కమెడియన్ కాదు... అంతకు మించి - ఆయనకు నవ్వించడమే కాదు... కంటతడి పెట్టించడమూ వచ్చు!