బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కోసం లెహంగా ఆప్షన్స్ సెర్చ్ చేస్తున్నారా? అయితే కొత్త పెళ్లి కూతురు రకుల్‌ను ఫాలో అవ్వండి. ఫ్రెండ్ పెళ్లి కదా! బార్బీ థీమ్‌లో సర్‌ప్రైజ్ చేయాలంటే ఇటువంటి పింక్ లెహంగా బెస్ట్ ఆప్షన్. స్లీవ్ లెస్ బ్లౌజ్‌కి తోడు మెడలో ఒక సిల్వర్ నెక్లెస్, బాటమ్ మీద బెల్ట్ యాడ్ చేస్తే లెహంగా మరింత కొత్తగా ఉంటుంది. సిల్వర్ కలర్ మెటీరియల్ మీద మిర్రర్ వర్క్ చేయిస్తే లైట్స్ వెలుగులు జిలుగులు మీ మీదే పెళ్లిలో హల్దీ వేడుకకు ఇటువంటి లెహంగా అయితే మోడ్రన్ టచ్ ఇచ్చినట్లు ఉంటుంది. అవుటాఫ్ ది బాక్స్ లెహంగా కావాలా? బ్లౌజ్‌కి వర్క్ చేయించండి. ప్రింటెడ్ క్లాత్ బాటమ్ కుట్టించండి. పార్క్ అండ్ అవుట్ డోర్ వెడ్డింగ్ అయితే... లైటింగ్‌లో బ్రైట్‌గా మెరవడానికి ఈ తరహా లెహంగాలు బెస్ట్. ఫ్రెండ్ పెళ్లిలో బంగారంలా మెరిసిపోవాలంటే... గోల్డెన్ టచ్ ఉన్న ఇటువంటి లెహంగాలు బావుంటాయి. సమ్మర్ సీజన్ వెడ్డింగ్ అయితే... వైట్ కలర్ లెహంగా, టాప్ డిజైన్ అయితే సూపర్. స్టైల్‌గా ఉంటుంది. హీట్ తెలియదు. అటు ట్రెడిషన్, ఇటు స్టైల్... రెండు ఉండాలంటే స్లీవ్ లెస్ బ్లౌజ్ & ఈ తరహా లెహంగా అయితే బాగుంటుంది. బ్లూ కలర్ లెహంగా... ఈవెనింగ్ టైం పెళ్లిలకు పెర్ఫెక్ ఛాయస్ బ్లాక్ కలర్ మెటీరియల్ మీద ఎంబ్రాయిడరీ చేయిస్తే... పెళ్లికి మాత్రమే కాదు, పార్టీలకు ఉపయోగపడుతుంది. లెహంగాల్లో రకుల్ ప్రీత్ సింగ్ (All Images Courtesy: rakulpreet/Instagram)