బుల్లితెర పార్వతి దేవి సోనారిక.. తన ప్రియుడు వికాస్‌ను పెళ్లి చేసుకుంది. 2022లో ప్రియుడు, వ్యాపారవేత్త వికాస్‌తో సోనారిక నిశ్చితార్థం అయ్యింది. రాజస్థాన్ లోని రణతంబోర్ సవాయ్ మాధోపూర్‌లో పెళ్లి వేడుకని ఘనంగా నిర్వహించారు. చూడచక్కని పూలపందిరిలో సోనారిక నుదిటి మీద సింధూరం దిద్దారు వికాస్. తెల్లటి పూలపందిరిలో ఎర్రటి దుస్తుల్లో సోనారిక మెరిసిపోయింది. ఆనందంతో మురిసిపోయింది. అంతకముందు జరిగిన హల్దీ వేడుకలో పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయింది సోనారిక. సోనారిక ‘మహాదేవ్’ సీరియల్‌లో పార్వతి దేవి పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో నాగశౌర్య నటించిన ‘జాదుగాడు’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బెల్లంకొండ శ్రీనివాసుతో కలిసి ‘స్పీడున్నోడు’ సినిమాలో నటించింది. చివరిగా మంచు విష్ణు, రాజ్ తరుణ్ నటించిన ‘ఈడో రకం - ఆడోరకం’ మూవీలోని నటించింది.