అన్వేషించండి

Akshay Kumar: రాజ్.. నువ్ యాక్టింగ్ క్లాసులు షురూ చెయ్!- ‘శ్రీకాంత్‘ మూవీపై అక్షయ్ కుమార్ ప్రశంసల జల్లు

బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన ‘శ్రీకాంత్’ సినిమాపై నటుడు అక్షయ్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. శ్రీకాంత్ పాత్రలో నటుడు రాజ్ కుమార్ రావు అద్భుతంగా నటించారని మెచ్చుకున్నారు.

Akshay Kumar About Rajkummar Rao: తాజాగా విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బాలీవుడ్ చిత్రం ‘శ్రీకాంత్‘. రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో  తెరకెక్కిన ఈ బయోపిక్ పై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ దివ్యాంగ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ అధినేత శ్రీకాంత్‌ బొల్లా జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తుషార్ హీరానందానీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జ్యోతిక, శ‌రద్ కేల్క‌ర్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు.

‘శ్రీకాంత్’ సినిమా అద్భుతం, రాజ్ కుమార్ నటన బ్రిలియంట్- అక్షయ్ 

తాజాగా ఈ చిత్రాన్ని చూసిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. శ్రీకాంత్ పాత్రలో రాజ్ కుమార్ అద్భుతంగా నటంచాడని అభినందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ‘శ్రీకాంత్‘ సినిమాకు సంబంధించి రివ్యూ ఇచ్చారు. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు నటన సింప్లీ బ్రిలియంట్ అంటూ కామెంట్ చేశారు. ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడాలని చెప్పారు. ఆయన నటనకు మెస్మరైజ్ అయ్యానని చెప్పిన అక్షయ్, వెంటనే తను యాక్టింగ్ క్లాసులు ప్రారంభిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. “అసాధ్యం అనేది ఏదీ లేదు. ‘శ్రీకాంత్’ తప్పకుండా చూడాల్సిన మూవీ. రాజ్ కుమార్ యాక్టింగ్ సింప్లీ బ్రిలియంట్. ఈ సినిమా చూస్తుంటే ఎంతో మజా వస్తుంది. రాజ్ కుమార్ రాజ్ భాయ్ వెంటనే యాక్టింగ్ క్లాసులు షురూ చెయ్” అంటూ రాసుకొచ్చారు.

బొల్లాంట్ శ్రీకాంత్ బయోపిక్ గా తెరకెక్కిన ‘శ్రీకాంత్’

హైదరాబాద్ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో దృష్టి లోపంతో జన్మించిన శ్రీకాంత్, తన జీవితంలో ఎటువంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాడు? ఎలా చదువుకున్నాడు? సమస్యలను అధిగమిస్తూ పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు? బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను ఎలా స్థాపించాడు.? అనే కథాశంతో ‘శ్రీకాంత్’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ ఇందులో టైటిల్ రోల్ ను రాజ్ కుమార్ రావు పోషించారు. దివ్యాంగుడిగా అద్భుతంగా నటించారు. టీ సిరీస్, ఛాక్‌ అండ్‌ ఛీస్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, నిధి పర్మార్‌ హీరానందానీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. మే 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఎంతో మందికి ఈ సినిమా స్పూర్తిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

వరుస సినిమాలతో అక్షయ్ కుమార్ బిజీ బిజీ

ఇక అక్షయ్ కుమార్ చివరగా 'బడే మియా చోటే మియా' చిత్రంలో నటించారు. ఇందులో టైగర ఫ్రాఫ్ కూడా నటించారు. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్  'స్కై ఫోర్స్', 'సింగమ్ ఎగైన్', 'హౌస్‌ఫుల్ 5', 'వెల్‌కమ్ టు ది జంగిల్', 'హేరా ఫేరి 3’, 'వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్'  సహా పలు సినిమాలు చేస్తున్నారు.  

Read Also: సామాన్యులు అటల్ సేతుపై ప్రయాణిస్తున్నారా? రష్మికాకు కాంగ్రెస్ కౌంటర్ - ట్విస్ట్ ఏమిటంటే?

టాప్ హెడ్ లైన్స్

Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Rajamouli Reaction : రాజమౌళి మూవీలో పీవీ సింధు? - ఫన్‌ రిప్లై... సోషల్ మీడియాలో కొత్త చర్చ
రాజమౌళి మూవీలో పీవీ సింధు? - ఫన్‌ రిప్లై... సోషల్ మీడియాలో కొత్త చర్చ
Niharika Konidela : పింక్ ఎలిఫెంట్ గోత్రం... నిహారిక నక్షత్రం - నేషనల్ అవార్డ్ విన్నింగ్ హ్యాపీ మూమెంట్స్
పింక్ ఎలిఫెంట్ గోత్రం... నిహారిక నక్షత్రం - నేషనల్ అవార్డ్ విన్నింగ్ హ్యాపీ మూమెంట్స్
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!
అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
Embed widget