News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మిల్కీ బ్యూటీ, ఇంతకీ ఆ హీరో ఎవరంటే..!

ఈ మధ్యే జైలర్ లో రజినీ కాంత్ పక్కన నటించిన తమన్నా.. మరో స్టార్ హీరోతో సినిమాకు రెడీ అయినట్టు తెలుస్తోంది. అజిత్ తో కలిసి గతంలో వీరం చిత్రంతో కనిపించిన తమన్నా.. మరోసారి ఆయనతో స్ర్కీన్ షేర్ చేసుకోనుంది.

FOLLOW US: 
Share:

Tamannaah Bhatia : ఇటీవలే 'లస్ట్ స్టోరీస్ 2(Lust Stories)' అనే వెబ్ సిరీస్ తో బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించి, హాట్ డోస్ ను మరింత పెంచేసిన మిల్కీ బ్యూటీ తమన్నాకు.. మరోసారి ఓ స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకున్నారా.. ఆయనే అజిత్(Ajith). గతంలో ఆయనతో 'వీరం' చిత్రంలో తమన్నా కనిపించగా.. ఈ మూవీ ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉండగా తాజాగా తమన్నా, అజిత్ సినిమాలో నటించనున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకూ సెట్స్ మీదకు వెళ్లని ఈ మూవీకి 'విడాముయిర్చి(vidamuyarchi)' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 

లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న 'విడాముయిర్చి' సినిమాకు ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తారని ప్రారంభంలో వార్తలు వినిపించినా.. ఆ తర్వాత మాత్రం కొన్ని కారణాల వల్ల మగిల్ తిరుమేణిని ఎంపిక చేశారు. ఇక ఈ సినిమా మే నెలలో స్టార్ట్ అవుతుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అది కూడా కొన్ని రీజన్స్ వల్ల ఎక్స్టెండ్ అయింది. రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆగస్టులో లో సెట్స్ పైకి రానున్నట్టు తెలుస్తోంది. 

అయితే ఈ సినిమాలో అజిత్ సరసన హీరోయిన్ త్రిషను తీసుకుందామనుకున్నారు. కానీ ఈ సమయంలోనే ఆమె విజయ్ దళపతి హీరోగా వస్తోన్న 'లియో'లో ఛాన్స్ రావడం, ఆ తర్వాత ఆమె తెలుగుతో పాటు మళయాళ భాషల్లోనూ అవకాశాలు రావడం.. ఆ తర్వాత నటుడు టోవినో థామస్ కు జంటగా 'ఐడెంటీ' సినిమా ఒప్పుకోవడం.. ఇలా అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. దీంతో ఈ లెక్కన చూస్కుంటే త్రిష డేట్స్ ఇప్పట్లో ఖాళీగా లేవని తెలుస్తోంది. అంటే ఈ సినిమాలో త్రిష నటించకపోవచ్చని స్పష్టమవుతోంది. దీంతో తాజాగా తమన్నా పేరు వినిపిస్తోంది. అదే గనక నిజమైతే అజిత్ తో తమన్నా మరోసారి రొమాన్స్ చేయనుందని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఇక ఇటీవలే సూపర్ స్టార్ రజినీ కాంత్ లేటెస్ట్ సినిమా 'జైలర్' లో నటించిన తమన్నా.. ఈ మధ్య విడుదలైన 'కావాలయా' అనే సాంగ్ తో అందర్నీ అలరించింది. ఇక ఈ సినిమాను ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఈ సినిమాతో సరికొత్తగా చూపించబోతున్న నెల్సన్.. ఈ మూవీతో ఆయనకు బ్లాక్ బస్టర్ అందిస్తారని రజినీ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక 'లియో' సినిమా విషయానికొస్తే ఈ మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం.. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read Also : BRO Movie: ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు‘బ్రో’- క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 20 Jul 2023 12:23 PM (IST) Tags: Leo Tamannaah Tamannaah Bhatia Trisha Ajith Jailer Vijay Dalapathy vidamuyarchi

ఇవి కూడా చూడండి

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

టాప్ స్టోరీస్

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్