Adipurush - Fans War : ఆదిపురుష్ బాలేదని చెబుతావా - ప్రేక్షకుడిపై దాడి చేసిన ప్రభాస్ ఫ్యాన్స్
'ఆదిపురుష్' సినిమా బాలేదని చెప్పినందుకు ఓ ప్రేక్షకుడి మీద ప్రభాస్ అభిమానులు దాడి చేశారు. కెమెరాల సాక్షిగా అతడిని కొట్టారు.
'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చింది. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే... ఫ్యాన్స్ బావుందని చెబుతున్నారు. విమర్శల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రేక్షకులే కాదు, సగటు సినిమా అభిమానులు సోసోగా ఉందని చెబుతుంటే... మరికొందరు అసలు బాలేదని చెబుతున్నారు. ఓ పబ్లిక్ రివ్యూ ప్రేక్షకుల మధ్య గొడవకు దారి తీసింది.
ప్రేక్షకుడిపై దాడి చేసిన ప్రభాస్ ఫ్యాన్స్!
ప్రతి శుక్రవారం ప్రసాద్స్ మల్టీప్లెక్స్ దగ్గర ప్రేక్షకుల అభిప్రాయాన్ని మీడియా సంస్థలు తీసుకుంటాయి. పబ్లిక్ వీడియో రివ్యూలపై ప్రేక్షకులు సైతం కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. పబ్లిక్ రివ్యూలతో సెలబ్రిటీలు అయిన వ్యక్తులు కూడా ఉన్నారనుకోండి. 'ఆదిపురుష్' విషయానికి వస్తే... శుక్రవారం ప్రసాద్స్ దగ్గర ఓ ప్రేక్షకుడు సినిమా బాలేదని చెప్పారు. అది రెబల్ స్టార్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
'ఆదిపురుష్' బాలేదని చెప్పిన ప్రేక్షకుడిపై ప్రభాస్ అభిమానులు దాడి చేశారు. ఆ ప్రేక్షకుడికి మొదట ఒకరు వార్నింగ్ ఇచ్చారు... అక్కడి నుంచి వెళ్లిపొమ్మని! ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా బాలేదని చెప్పినందుకు, సినిమాకు 1.5 రేటింగ్ ఇచ్చినందుకు అతడిని కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#Adipurush - #Prabhas fans beating the public for giving genuine review 🙄
— VCD (@VCDtweets) June 16, 2023
Worst behavior 👍#AdipurushTickets #AdipurushOnJune16pic.twitter.com/zV8waEWm4z
సంగారెడ్డిలో ఆలస్యంగా షో వేశారని...
సంగారెడ్డిలో ఓ థియేటర్ దగ్గర ప్రభాస్ అభిమానుల ప్రవర్తన కూడా డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఆలస్యంగా షో వేశారని మొదట థియేటర్ యాజమాన్యంతో గొడవ పడ్డారు. తర్వాత సౌండ్ సిస్టమ్ బాలేదని మరోసారి గొడవకు దిగారు. అప్పుడు థియేటర్ అద్దాలు పగలగొట్టారు. తిరుపతిలో జరిగిన 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుకలో సైతం గొడవ జరిగింది. ప్రభాస్ అభిమానులు కొట్టుకున్నారని ఓ వెర్షన్. వేడుకకు వచ్చిన వేరే హీరో అభిమాని ప్రభాస్ గురించి తప్పుగా మాట్లాడటంతో కొట్టారని మరో వెర్షన్.
లక్ష్మణుడి పేరు శేషు...
హనుమంతుని పేరు భజరంగ్!
'ఆదిపురుష్' థియేటర్లకు వెళ్లిన సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు సినిమాలో పాత్రల పేర్లు కొంత ఆశ్చర్యానికి గురి చేశాయి. రాముడి వెంట లక్ష్మణుడు అడవులకు వెళ్ళిన సంగతి మన అందరికీ తెలుసు. అయితే... సినిమాలో లక్ష్మణుడిని శేషు అని రాముడు సంభోదిస్తారు. హనుమంతుని పేరును భజరంగ్ అని పెట్టారు. జై భజరంగ్ బలి అనేది అందరికీ తెలుసు కనుక ఆ పేరుతో పెద్ద సమస్య లేదు.
Also Read : 'ఆదిపురుష్' రివ్యూ : రామాయణానికి మోడ్రన్ టచ్ - ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే?
'ఆదిపురుష్'లో రాఘవ / శ్రీ రామ చంద్ర మూర్తి పాత్రలో ప్రభాస్ నటించగా... ఆ రామ పత్ని జానకి / సీతా దేవి పాత్రలో కృతి సనన్ కనిపించారు. శేషు పాత్రలో సన్నీ సింగ్, లంకాధిపతి రావణ బ్రహ్మ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. హనుమాన్ పాత్రను మరాఠీ నటుడు దేవదత్తా నాగే పోషించారు. ఆయన నటనకు సర్వత్రా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
రికార్డు వసూళ్ళు ఖాయమే!
బాక్సాఫీస్ బరిలో 'ఆదిపురుష్' సినిమా రికార్డు వసూళ్లు సాధించడం ఖాయంగా కనబడుతోంది. మొదటి రోజు హిందీలో 'ఆర్ఆర్ఆర్' వసూళ్ళ రికార్డు చెరిపేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 125 కోట్ల గ్రాస్ రావచ్చని ట్రేడ్ వర్గాల అంచనా.
Also Read : 'ఆదిపురుష్'కు ఫ్లాప్ టాక్ వెనుక టాప్ 5 రీజన్స్ - ఏంటిది ఓం రౌత్?