అన్వేషించండి

Adah Sharma: ఒళ్లంతా దారుణమై దద్దుర్లు - సినిమాలకు బ్రేక్ ప్రకటించిన ఆదా శర్మ, కేరళాలో చికిత్స?

ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన అదా శర్మ.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆయుర్వేద చికిత్స కోసం కేరళకు వెళ్తున్నట్లు సమాచారం.

‘కేరళ స్టోరీ’ సినిమాతో హిట్ కొట్టిన అదా శర్మ.. త్వరలో ‘కమాండో’ వెబ్ సీరిస్ ద్వారా ముందుకొస్తోంది. అయితే, ఈ వెబ్ సీరిస్ ప్రమోషన్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అదా శర్మ అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. డయేరియా వల్లే ఆమె ఆరోగ్యం క్షీణించిందని, పూర్తి కోలుకోడానికి విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అదా శర్మ సినిమాలకు బ్రేక్ చెప్పింది. ఈ సందర్భంగా తన ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను షేర్ చేసింది. దద్దుర్లతో దారుణంగా మారిపోయిన ఆమె శరీరాన్ని చూసి.. అభిమానులు షాకయ్యారు. 

అదాకు ఏమైంది?

అదా తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్ది రోజులుగా ఆమె శరీరంపై అక్కడక్కడా దద్దుర్లు వచ్చాయి. అయితే, చిన్న సమస్యే అనుకుని ఆమె వాటిని పెద్దగా పట్టించుకోలేదు. చేతులపై ఉన్న దద్దర్లను ఫుల్ స్లీవ్స్‌తో కవర్ చేస్తూ షూటింగ్స్‌లో పాల్గొంది. ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురైంది. చివరికి దద్దర్లు ఆమె ముఖంపై కూడా వచ్చాయి. దీంతో ఆమె మందులు వాడటం మొదలుపెట్టింది. ఆ మెడిసిన్ వికటించడంతో మరింత అలెర్జీ ఏర్పడింది. ప్రమోషన్స్‌కు వెళ్తుండగా వాంతులతో అస్వస్థతకు గురైంది. డయేరియా వల్లే ఆమె అనారోగ్యానికి గురైందని వైద్యులు తెలిపారు.  

ఎంతకీ పరిస్థితి మెరుగుకాకపోవడంతో అదా ఆయుర్వేద చికిత్సను ఆశ్రయించింది. ఈ సందర్భంగా కొద్ది రోజులు సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్‌కు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. అదా పరిస్థితి చూసి ఆందోళనకు గురైన ఆమె తల్లి కూడా గట్టిగా హెచ్చరించినట్లు తెలిసింది. ఇంటర్వ్యూలు, షూట్‌లకు బ్రేక్ ఇచ్చి, విశ్రాంతి తీసుకోవాలని అమ్మ చెప్పిందని అదా పేర్కొంది. ‘‘నేను త్వరలోనే తిరిగి వస్తా. అప్పటి వరకు నేను ‘కమాండో’ సీరిస్‌లోని సన్నివేశాలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్ చేస్తూనే ఉంటాను’’ అని తెలిపింది. అయితే, ట్రోలర్స్ మాత్రం.. ఆమెకు పంచ్‌లు వేస్తున్నారు. ఆయుర్వేద వైద్యం కోసం కేరళ వెళ్తున్నావా? అని అంటున్నారు. కేరళ ప్రజలు నీ మీద కోపంగా ఉన్నారు జాగ్రత్త అని కొందరు అంటున్నారు. చివరికి నీకు కేరళనే దిక్కయ్యిందని మరికొందరు తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం అదాకు మద్దతు తెలుపుతున్నారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే అలా ఎలా ట్రోల్ చేస్తారని కామెంట్లు చేస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

2013లో కమాండో సినీ ఫ్రాంచైజ్ మొదలయ్యింది. కమాండ్ వన్ మ్యాన్ ఆర్మీ టైటిల్‌తో ఈ ఫ్రాంచైజ్‌లో మొదటి చిత్రం తెరకెక్కింది. ఇందులో విద్యుత్ జమ్వాల్, పూజా చోప్రా లీడ్ రోల్స్‌లో నటించారు. ఇక 2017లో కమాండో సీక్వెల్ విడుదలయ్యింది. దాని పేరే ది బ్లాక్ మనీ ట్రయల్. ఇందులో పూజా చోప్రా స్థానంలోకి అదా శర్మ వచ్చి చేరింది. 2019లో వచ్చిన కమాండో 3లో కూడా అదా శర్మనే హీరోయిన్‌గా నటించింది. ఇక కేరళ స్టోరీ లాంటి హిట్‌ను ఖాతాలో వేసుకున్న అదా శర్మ.. తను అస్వస్థతకు గురికాకముందు కమాండో వెబ్ సిరీస్‌లో నటించడంపై తన స్పందన బయటపెట్టింది. ‘కమాండో 2,3లో నేను భావన రెడ్డి పాత్రను పోషించారు. కమాండో ఎక్కడ ఉంటే భావన రెడ్డి అక్కడ ఉంటుంది. అది కాసేపు అయినా సరే ఉంటుంది. ఓటీటీలో విడుదల కానున్న కమాండోకు, సినిమాకు భావన ఒక కనెక్షన్‌లాగా ఉంటుంది’ అని తెలిపింది అదా.

Also Read: తమిళనాట అన్ని థియేటర్లలోనూ 'జైలర్' - రజనీకి ఎగ్జిబిటర్స్ రిక్వెస్ట్

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget