అన్వేషించండి

Tamannaah: అభిమాని పనికి తమన్నా ఎమోషనల్ - థ్యాంక్స్ చెబుతూ హగ్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ

ఓ అభిమాని చేసిన పనికి హీరోయిన్ తమన్నా ఎమోషనల్ అయింది. వెంటనే అతనికి హగ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పింది. ఇప్పుడు నెట్టింట ఆ వీడియో వైరల్ అవుతోంది.

Tamannaah: సినిమా ఇండస్ట్రీలో తారలను అభిమానులు ఎంతలా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్ల కోసం ఏమైనా చేయడానికి సిద్దపడతారు. కొంత మంది వాళ్ల పేర్లను పచ్చబొట్టు కూడా వేయించుకుంటారు. టాలీవుడ్ లో హీరోలకే కాదు హీరోయిన్లకు కూడా అలాంటి అభిమానులు ఉంటారు. అలాంటి డైహార్డ్ ఫ్యాన్స్ ఎదురైతే ఆ స్టార్స్ కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారు. సరిగ్గా నటి తమన్నాకు కూడా అలాంటి అనుభూతే ఎదురైంది. ఓ అభిమాని చేసిన పనికి ఎమోషనల్ అయింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ అభిమాని ఏం చేశాడంటే..

అభిమాని చేసిన పనికి ఎమోషనల్ అయిన తమన్నా..

ఇటీవల తమన్నా ముంబై వెళ్లింది. అక్కడ పని ముగించుకొని తిరిగి వస్తుండగా విమానాశ్రయంలో ఆమెతో ఫోటోలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. అదే సమయంలో ఓ వ్యక్తి వచ్చి తమన్నాకు పుష్పగుచ్చం ఇచ్చాడు. అంతేకాదు తన చేతిపై ఉన్న తమన్నా టాటూను చూపించాడు. ఆ అభిమాని తన చేతిపై తమన్నా ఫేస్ ను పచ్చబొట్టుగా వేసుకున్నాడు. దానితో పాటు తమన్నా ఐ లవ్ యూ అని కూడా రాయించుకున్నాడు. అది చూసిన తమన్నా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వెంటనే ఆ అభిమాని తమన్నా కాళ్ళ మీద పడి నమస్కారం చేయడంతో ఎమోషనల్ అయింది తమన్నా. అతనికి చాలా సార్లు థ్యాంక్స్ చెబుతూ కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అభిమానుల పట్ల తమన్నాకు ఉన్న గౌరవాన్ని చూసి మురిపోతున్నారట మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్. 

కెరీర్ లో దూసుకుపోతున్న మిల్కీ బ్యూటీ..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో తమన్నా కూడా ఒకరు. ‘హ్యాపీడేస్’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. తర్వాత వరుస సినిమాల్లో నటించింది. దాదాపు అందరి పెద్ద హీరోలతోనూ సినిమాలు చేసింది. సినిమా ఇండస్ట్రీకు వచ్చి దశాబ్ద కాలం పూర్తయినా కూడా ఇప్పటికీ మంచి అవకాశాలతో నటిగా దూసుకుపోతుంది. ప్రస్తుతం కేవలం తెలుగు సినిమాలే కాకుండా తమిళ్, హిందీ భాషల్లోనూ నటిస్తోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలోనూ తన గ్లామర్ తో యూత్ ను కట్టిపడేస్తోంది. రీసెంట్ గా ‘జీ  కర్దా’ సిరీస్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

‘లస్ట్ స్టోరీస్ 2’ తో ప్రేక్షకుల ముందుకు..

తమన్నా ఈ మధ్య బోల్డ్ సన్నివేశాల్లోనూ నటిస్తోంది. తన గ్లామర్ తో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ బ్యూటీ తాజాగా నటించిన హిందీ మూవీ ‘లస్ట్ స్టోరీస్ 2’. బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సిరీస్ లలో ఈ ‘లస్ట్ స్టోరీస్ 2’ కూడా ఒకటి. ఇది 2018లో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’కు సీక్వెల్. ఇందులో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, అమృత సుభాష్, అంగద్ బేడీ, విజయ్ వర్మ నటిస్తున్నారు. ఇందులో తమన్నా ఒక రొమాంటిక్ పాత్రలో నటించింది. రియల్ లైఫ్ లవర్ అయిన విజయ్ వర్మతో రీల్ లైఫ్ లోనూ రొమాన్స్ చేస్తూ కనిపించింది తమన్నా. ఇటీవలే ఈ ‘లస్ట్ స్టోరీస్ 2’ ట్రైలర్ విడుదల అయింది. ఇందులో తమన్నా అందానికి కుర్రకారు ఫిదా అవుతోంది. జూన్ 29 న ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: 24 జీబీ ర్యామ్‌తో రానున్న వన్‌ప్లస్ కొత్త ఫోన్ - ల్యాప్‌టాప్‌ల్లో కూడా ఇంత ఉండదుగా!

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget