News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Samantha Bali Vacation: మట్టితో బొమ్మలు, ఫ్రెండ్స్‌తో సమంత సరదాలు- బాలిలో జాలీగా గడుపుతున్న సామ్

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. తన ఫ్రెండ్ తో కలిసి బాలిలో సరదాగా గడుపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన హాలీ డే పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

FOLLOW US: 
Share:

కొంత కాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించిన అందాల తార సమంత, ప్రస్తుతం వెకేషన్ లో సరదాగా గడుపుతోంది. తన ఫ్రెండ్ తో కలిసి హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇండోనేషియాకు వెళ్లిన సమంత, ప్రస్తుతం బాలిలో ప్రకృతి అందాలను తిలకిస్తోంది. అక్కడి అద్భుత దృశ్యాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.  

బాలిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సమంత

నిన్న మొన్నటి వరకు బీచుల్లో సరదాగా గడిపిన ఫోటోలను సమంత షేర్ చేసింది. అక్కడ ఎంతో హ్యాపీగా గడుపుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు అనుక్షణం ప్రకటిస్తున్నట్లు ఈ ఫోటోలు, వీడియోలను చూస్తుంటే అర్థం అవుతోంది. నచ్చిన ఆహారం తీసుకుంటూ, జిమ్ లో కష్టపడుతూ కనిపించింది. తన ఆరోగ్యం మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. తన ఫుడ్, జిమ్ వర్కౌట్స్ కు సంబంధించిన వీడియోలను, ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా మట్టితో చక్కటి బొమ్మలను తయారు చేస్తూ కనిపించింది. తన ఫ్రెండ్స్ తో కలిసి చక్కటి కళాఖండాలను రూపొందిస్తోంది. బురద మట్టితో రకరకాల మొక్కలను తయారు చేసింది. ఇక ప్రకృతి అందాల నడుమ హాయిగా సేద తీరుతూ కనిపించింది. సూర్య రశ్మిని చూస్తూ కనిపించింది. చెక్క రూఫ్ లో జలపాతాన్ని దాటుతూ సరదాగా గడిపింది. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే పనులు చేస్తోంది. మొత్తంగా బాలి వెకేషన్ లో అనారోగ్య సమస్యల నుంచి  బయటపడేందుకు ప్రయత్నిస్తోంది.

View this post on Instagram
 
A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఆరోగ్య సమస్యలతో సినిమాలకు బ్రేక్

కొద్ది రోజుల క్రితం సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు సమంతా ప్రకటించింది. సుమారు ఏడాది పాటు సినిమాలు చేయట్లేదని వెల్లడించింది. కొద్ది సంవత్సరాలుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమె, చికిత్స తీసుకుంటూనే సినిమాలు చేసింది. అయితే, ‘శాకుంతలం’ మూవీ డిజాస్టర్ తర్వాత కొద్ది కాలం సినిమాలకు విరామం ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. తన ఆరోగ్య సమస్యలు పూర్తి స్థాయిలో నయం అయ్యేందుకు అమెరికాలో చికిత్స తీసుకోనున్నట్లు ప్రకటించింది. సైన్ చేసిన సినిమాలను దాదాపు పూర్తి చేసింది. కొన్ని సినిమాలకు ఓకే చెప్పినా, షూటింగ్ మొదలుకాని వాటి నుంచి తప్పుకుంది. ఈ మేరకు తీసుకున్న అడ్వాన్సులను కూడా తిరిగి ఇచ్చేసింది. ప్రస్తుతం మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు బాలిలో వెకేషన్ గడుపుతోంది.

సెప్టెంబర్ 1న ‘ఖుషి’ మూవీ విడుదల

సమంత సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ అనే సినిమా చేసింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సెప్టెంబర్ 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి వచ్చిన ఫోటోలు, పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ‘సిటాడెల్’ ఇండియా వెర్షన్ వెబ్ సిరీస్ లోనూ సమంతా కనిపించనుంది. ఇప్పటికే ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.  

Read Also: ఈ వారం కూడా చిన్న సినిమాల సందడే - థియేటర్లు, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే మూవీస్ ఇవే!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 01 Aug 2023 11:34 AM (IST) Tags: actress samantha Samantha Ruth Prabhu Samantha Bali Vacation Samantha Bali Vacation Photos Samantha Bali Vacation Videos

ఇవి కూడా చూడండి

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ -  'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !