By: ABP Desam | Updated at : 28 Mar 2023 06:48 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Samantha/Instagram
నటి సమంత అనారోగ్య కారణాల వల్ల కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సమంత వరుసగా సినిమాలు, సీరిస్‌లు చేస్తూ బిజీగా ఉంది. గతేడాది ‘యశోద’ వంటి లేడిఓరియెంటెడ్ సినిమాలో నటించి మెప్పించింది. ఈ ఏడాది ‘శాకుంతలం’ లాంటి మైథాలజీ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ బ్యూటీ. ఈ సినిమాకు స్టార్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. మూవీను ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది సమంత. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ పై స్పందించింది. పురుషులతో సమానంగా మహిళా నటులకు కూడా సమాన వేతనం ఇవ్వాలా అనే అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది సమంత. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. హీరోలతో పాటు హీరోయిన్లకు సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వాలా అనే ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది. ఎవరైనా వారంతట వారే ఇష్టపూర్వకంగా ఇవ్వాలి కానీ అందుకోసం అడుక్కోకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సమంత. వాస్తవానికి తాను కూడా చాలా పోరాడుతున్నానని, అయితే అది సమాన పారితోషికం కాదని అంది. మనం కష్టపడి పని చేయాలని, తద్వారా వచ్చే విజయమే అన్నీ నిర్ణయిస్తుందని చెప్పింది. మీకు ఇంత చెల్లిస్తామని వాళ్లు వచ్చి చెబుతారని.. అంతేకానీ నాకు ఇంత కావాలి అని తానెప్పుడు అడగలేదని పేర్కొంది. ఇదంతా మన కృషితోనే వస్తుందని తాను నమ్ముతానని చెప్పింది. మనలోని శక్తి సామర్థ్యాలను వెలికి తీయాలంటే అది కేవలం పరిమితికి మించిన కష్టం ద్వారానే సాధ్యం అవుతుందని పేర్కొంది సమంత.
ఇదే ఇంటర్వ్యూలో ప్రేమ గురించి మాట్లాడిన సమంత. ప్రేమ అనేది కేవలం స్త్రీ, పురుషుల మధ్య ఉండేదే కాదని, ఇద్దరి స్నేహితుల మధ్య ఉండేది కూడా ప్రేమే అని తెలిపింది. ఒక బంధం చెడిపోయినంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదని పేర్కొంది సమంత. ‘ఏం మాయ చేశావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత ఆ సినిమాలో హీరోగా చేసిన నాగ చైతన్యతో ప్రేమలో పడింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సమంత కొన్ని రోజులపాటు డిప్రెషన్ కు గురైంది. మళ్లీ కొన్ని రోజుల తర్వాత సినిమా షూటింగ్ లలో పాల్గొంటుంది. ఈ మధ్య కాలంలో కూడా మయోసైటిస్ అనే వ్యాధితో కొన్ని నెలలపాటు పోరాడి గెలిచింది. విడాకుల తర్వాత సమంత కెరీర్ పై దృష్టి సారించింది. వరుసగా సినిమాలు చేస్తుంది. ఆమె ప్రస్తుతం హిందీలో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా చేస్తోన్న ‘ఖుషి’ సినిమాలో కూడా నటిస్తోంది. ఇక ఇటీవల నటించిన ‘శాకుంతలం’ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
Also Read: ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!
మాస్ లుక్‌లో మహేష్, ప్రభాస్‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం
ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !
IBPS RRB XII Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల - ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే?