News
News
X

Kriti Sanon Prabhas : ప్రభాస్‌తో పెళ్ళెప్పుడు? డైరెక్టుగా ప్రభాస్‌కు కృతి సనన్ ఫోన్ చేస్తే ఒక్కటే క్వశ్చన్

Kriti Sanon Reacts To Prabhas Called To Prabhas Over Rumours : లవ్ ఎఫైర్ రూమర్స్, వరుణ్ ధావన్ చేసిన గోల గురించి ప్రభాస్‌కు ఫోన్ చేశానని కృతి సనన్ పేర్కొన్నారు.

FOLLOW US: 
Share:

ప్రభాస్ (Prabhas) ప్రేమలో ఉన్నారా? 'ఆదిపురుష్'లో తనకు జోడీగా నటించిన కృతి సనన్ (Kriti Sanon) తో ఆయన డేటింగ్ చేస్తున్నారా? ఆ మధ్య హిందీ హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారం చెలరేగింది. ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యలు సంచలనానికి కారణం అయ్యాయి. ఆ తర్వాత అందులో నిజం లేదని కృతి సనన్ స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి.

ప్రభాస్‌కు ఫోన్ చేస్తే...
వరుణ్ ధావన్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో చాలా ఇబ్బందులు పడ్డానని కృతి సనన్ తెలిపారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో మరోసారి అప్పట్లో జరిగిన విషయాలపై మరోసారి ఆమె స్పందించారు.

''ప్రభాస్, నేను ప్రేమలో పడ్డామని వార్తలు రావడానికి కారణం వరుణ్ ధావన్. మేం ఇద్దరం అప్పటికి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాం. వరుణ్ ధావన్‌కు బోర్ కొట్టింది. ఏదైనా రూమర్ క్రియేట్ చేద్దామన్నాడు. నా జీవితంలో ఎవరో ఉన్నారని చెబుతానని అన్నాడు. సరే అన్నాను. కానీ, ప్రభాస్ పేరు చెబుతాడని నాకు అసలు తెలియదు. ఆ తర్వాత గోల గోల అయ్యింది. దాని గురించి నేను ప్రభాస్‌కు ఫోన్ చేశా. జరిగిందంతా చెప్పాను. 'వరుణ్ ధావన్ ఎందుకు అలా అన్నాడు?' అని ప్రభాస్ క్వశ్చన్ చేశాడు. వరుణ్ పిచ్చిగా మాట్లాడానని చెప్పేశా. ఆ తర్వాత నాకు తెలిసిన చాలా మంది 'పెళ్లి ఎప్పుడు' అని ప్రశ్నించారు. బోలెడు మెసేజ్ లు వచ్చాయి. దాంతో స్పందించక తప్పలేదు'' అని కృతి పేర్కొన్నారు.

'అన్‌స్టాపబుల్'లో కృతితో ప్రేమ, పెళ్లి గురించి ప్రభాస్‌ను బాలకృష్ణ అడిగారు. ఆ విషయంలో ఏమీ లేదని మేడమ్ చెప్పారని రెబల్ స్టార్ బదులు ఇచ్చారు. వరుణ్ ధావన్ కామెంట్ పక్కన పెడితే... అయోధ్యలో 'ఆదిపురుష్' (Adipurush) టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది. అక్కడ ప్రభాస్ చెమట తుడుచుకోవడానికి ట్రై చేస్తే కృతి సనన్ తన చీర కొంగు అందించడం... ప్రభాస్ నడుస్తుంటే అతనికి కృతి సపోర్ట్ ఇవ్వడం వంటివి వైరల్ అయ్యాయి. అందువల్ల ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని కొందరు బలంగా నమ్మారు.

Also Read హీరోగా కాదు అభిమానిగా ఆస్కార్స్‌కు రామ్ చరణ్ - అక్కడ వాళ్ళిద్దర్నీ చూడాలని... 

ప్రభాస్, కృతి సనన్ రిలేషన్ గురించి జరుగుతున్న ప్రచారానికి తోడు తనను తాను క్రిటిక్ అని సోషల్ మీడియాలో ప్రకటించుకున్న ఉమైర్ సందు చేసిన లేటెస్ట్ ట్వీట్ మరింత వైరల్ అయ్యింది. వచ్చే వారం మాల్దీవుల్లో వాళ్లిద్దరూ ఉంగరాలు మార్చుకోవడానికి రెడీ అయ్యారని ట్వీట్ చేశాడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ ట్వీట్ గురించి డిస్కషన్. దాంతో ప్రభాస్ టీమ్ రియాక్ట్ అవ్వక తప్పలేదు. అది కూడా పుకారే అని ప్రభాస్ టీమ్ పేర్కొంది.
 
ప్రేమ లేదు... పీఆర్ కాదు!  
వరుణ్ ధావన్ కామెంట్స్ వైరల్ అయిన తర్వాత కృతి సనన్ స్పందించారు. ''ఇది ప్రేమ కాదు... పీఆర్ (పబ్లిసిటీ స్టంట్) అంత కంటే కాదు'' అని ఆమె పేర్కొన్నారు.  అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ చేశారామె. ''మా తోడేలు (వరుణ్ ధావన్) రియాలిటీ షోలో కొంచెం హద్దులు దాటింది. సరదాగా చేసిన వ్యాఖ్యలు పుకార్లకు కారణం అయ్యాయి. ఎవరో ఒకరు నా పెళ్లి తేదీ వెల్లడించే ముందు నన్ను అసలు విషయం చెప్పనివ్వండి. అదంతా ఫేక్ న్యూస్'' అని కృతి పేర్కొన్నారు. హిందీలో భారీ సినిమాల్లో నటించే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఉన్నట్టు ప్రచారం చేయడం పబ్లిసిటీ స్టంట్ అని చెబుతుంటారు. అందులోనూ ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు కావడంతో కృతితో ప్రేమలో పడ్డారని, నిశ్చితార్థానికి రెడీ అయ్యారని వార్తలు రాగానే ప్రేక్షకుల అందరి దృష్టి వాళ్ళ మీద పడింది. 

Also Read వెయ్యి కోట్ల సినిమాకు అయినా సరే 'ఆమె' కావాలి - ఆడదే ఆధారం

Published at : 08 Mar 2023 03:01 PM (IST) Tags: Kriti Sanon Prabhas Varun Dhawan Dating rumours

సంబంధిత కథనాలు

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్

టాలీవుడ్‌‌లోకి బాలీవుడ్ బ్యూటీలు, తెలుగులో పాగా వేసేదెవరు?

టాలీవుడ్‌‌లోకి బాలీవుడ్ బ్యూటీలు, తెలుగులో పాగా వేసేదెవరు?

Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!

Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!

Virupaksha Modhamamba Temple: ‘విరూపాక్ష’ మూవీ కోసం ఏకంగా గుడే కట్టేశారు - ఎంత అద్భుతంగా ఉందో చూడండి

Virupaksha Modhamamba Temple: ‘విరూపాక్ష’ మూవీ కోసం ఏకంగా గుడే కట్టేశారు - ఎంత అద్భుతంగా ఉందో చూడండి

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

టాప్ స్టోరీస్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

TS Paper Leak Politics : "పేపర్ లీక్" కేసు - రాజకీయ పుట్టలో వేలు పట్టిన సిట్ ! వ్యూహాత్మక తప్పిదమేనా ?

TS Paper Leak Politics :

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Animals Care in Jharkhand: పశువులకు కూడా ఆదివారం సెలవు - ఆరోజు పాలు కూడా పితకరు!

Animals Care in Jharkhand: పశువులకు కూడా ఆదివారం సెలవు - ఆరోజు పాలు కూడా పితకరు!