News
News
వీడియోలు ఆటలు
X

Actress Jhansi : ఆ హీరోతో ఎఫైర్ ఉందని, పోలీస్ రైడ్‌లో దొరికానని రూమర్స్ క్రియేట్ చేశారు : ఝాన్సీ

బుల్లితెరపై యాంకర్ గానే కాకుండా వెండితెరపైనా మంచి నటిగా నిరూపించుకున్న ఝాన్సీ, తనకు ఇండస్ట్రీలో ఎదురైన సవాళ్లు, తనపై వచ్చిన రూమర్స్, వచ్చిన సమస్యల గురించి చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి

FOLLOW US: 
Share:

Jhansi: నటిగా, యాంకర్ గా, సహ నటిగా.. సినీ ఇండస్ట్రీలో పలు పాత్రలో ఒదిగిపోయి.. ప్రేక్షకులను అలరించిన ఝాన్సీ.. తన టాలెంట్ తో ఎనలేని పాపులారిటీని దక్కించుకున్నారు. బహుశా తెలుగులోని అనేక మాండలికాలను చాలా అనర్గళంగా మాట్లాడగల, ఏ పాత్రనైనా సులభంగా పోషించగల ఏకైక నటి ఆమె అని చెప్పవచ్చు. గతంలో టెలివిజన్‌లోనూ దూసుకుపోయింది ఝాన్సీ.. ఆమె కెరీర్ ప్రారంభంలో అనేక రూమర్స్ ను ఎదుర్కొంది.

ఇప్పటివరకు తన జీవితంలో తనను తీవ్రంగా బాధపెట్టిన పుకార్లపై ఆమె ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. “నిరాధారమైన పుకార్లను వ్యాప్తి చేయడం ద్వారా నన్ను బ్లేమ్ చేయాలని, కించపర్చాలని ప్రయత్నించారు. పోలీసులు నా ఇంటిపై దాడి చేశారని ఓ వార్తా సంస్థ పేర్కొంది. నాకు ఓ టాప్ హీరోతో ఎఫైర్ ఉందని కూడా రాశారు” అని ఝాన్సీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ నిరాధారమైన, చీప్ వార్తలు తనకు మానసిక ప్రశాంతత లేకుండా చేశాయని చెప్పారు. తన కెరీర్‌ నష్టపోయేలా చేశాయని ఝాన్సీ పేర్కొంది.

తనపై ఎలాంటి రూమర్లు క్రియేట్ చేశారు.. ఎవరు తప్పుడు రాతలు రాయించారు.. ఎందుకు రాయించారన్న విషయాలను కూడా ఝాన్సీ స్పందించారు. ‘‘నన్ను బాధపెట్టిన వాళ్లకి నా శాపం చాలా గట్టిగా తగులుతుంది.. ఊరికే పోదు. చాలామందికి నా శాపం తగిలే ఉంటుంది.. అది తగిలిన వాళ్లు చెప్పాలి. నాతో ఓ సినిమాకి రెండు రోజులు క్యారెక్టర్ చేయించుకుని సడెన్‌గా నన్ను సినిమా నుంచి తీసేశారు. రావాల్సిన డబ్బులు ఇచ్చారు. కానీ తన స్థానంలో వేరొకర్ని పెట్టుకున్నారు. అలా నాకు చాలా అవమానం కలిగింది. అందుకే నా శాపం వాళ్లకి బాగా తగిలింది. వాళ్లకి మామూలు దెబ్బ తగల్లేదు. కోలుకోలేనంత దెబ్బ తగిలింది.. తిరిగి ఇప్పటివరకూ మళ్లీ లేవలేదు. అది నా వల్లే అని అనడం లేదు.. వాళ్ల సినిమాలో దమ్ములేదు కాబట్టి తగిలిన దెబ్బకి మళ్లీ లేవలేకపోయారు అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

తన గురించి తెలియాలంటే మీరు గూగుల్‌లో పదో పేజీకో, పదిహేనో పేజీకో వెళ్లాలని, టాప్ పర్సనాలిటీ లిస్ట్‌లో ఝాన్సీ కూడా ఉందని వెతుక్కోవడానికి 15 పేజీలోకి వెళ్లాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ఝాన్సీకి 8 నంది అవార్డులు వచ్చాయని తెలసుకోవడానికి పదో పేజీలోకి వెళ్లాలని, తాను సమాజానికి చేసిన సేవ గురించి తెలుసుకోవాలంటే ఇంకో 15 పేజీలు వెనక్కి వెళ్లాలని చెప్పారు. నిజంగా నేనంటే తెలుసుకోవాలని అనుకునేవాళ్లు.. అలాంటివి చదువుతారు.. కానీ.. వాళ్లకి కావాల్సిన చెత్త కోసం వెతుక్కునే వాళ్లు ముందు పేజీనే చదివి ఊరుకుంటారన్నారు.

తనకు పలానా హీరోతో ఎఫైర్ ఉందని.. పోలీస్ రైడ్‌లో దొరికానని.. అలా దొరికితే ఈపాటికి తాను ఎక్కడ ఉండాలి అని ఝాన్సీ ప్రశ్నించారు. అది రాసింది ఎవరో, రాయించిన వారెవరో తెలుసన్న ఆమె.. రాయించిన ఉద్దేశం కూడా తెలుసంటూ మండిపడ్డారు. ఒక్క వెబ్ సైట్ ఏదైనా రాస్తే.. అదే చూసి గుడ్డిగా రాసే వంద వెబ్ సైట్‌లు ఉన్న ఈ రోజుల్లో కాపీ పేస్ట్ చేసి రాస్తారే గానీ.. రీసెర్చ్ చేసి రాసే వెబ్ సైట్స్ లేవని ఆమె చెప్పారు. ఇంటర్వ్యూలు చేసి కానీ.. ఫోన్ చేసి కానీ అడిగి మరీ రాసే జర్నలిస్ట్‌లు ఇప్పట్లో లేరని.. వెబ్ జర్నలిజం అంటే కట్ కాపీ పేస్ట్. ఒకరు ఏది రాస్తే.. మిగిలిన వాళ్లు కూడా అదే రాస్తారు. కాబట్టి వాళ్లని నమ్మాల్సిన పనిలేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. నా చుట్టు పక్కల వాళ్లకి నేను ఎలా ఉంటానో తెలుసు. నాపై తప్పుడు రాతలు రాయడం వల్ల నాకొచ్చిన నష్టం ఏమీ లేదు.. నా కెరియర్‌ని కానీ.. వ్యక్తిత్వాన్ని కానీ ఎఫెక్ట్ చేయలేదు కానీ.. నేను బాధపడిన సందర్బం మాత్రం ఒకటి ఉందంటూ ఝాన్సీ సెన్సేషన్ కామెంట్స్ చేశారు.

Also Read 'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య సక్సెస్ కొట్టారా? డిజప్పాయింట్ చేశాడా?

తాను యూనిసెఫ్ కి చాలా వర్క్ చేస్తూ వచ్చానని, చైల్డ్ మ్యారేజెస్ కోసం చాలా ఏళ్లు ఆ సంస్థలో వర్క్ చేశానని ఝాన్సీ చెప్పారు. తన సేవల్ని గుర్తించి.. యూనిసెఫ్ కర్ణాటక అండ్ సౌత్ బ్రాండ్‌అంబాసిడర్‌గా నియమించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్లు చాలా ఆలోచించి ఆ బ్రాండ్‌ అంబాసిడర్‌ పదవిని ఇవ్వలేదన్నారు. తన కెరియర్‌లో ఇమేజ్ డ్యామేజ్ చేయడం వల్ల వచ్చిన నష్టం ఏమైనా ఉందంటే.. ఈ పదవిని కోల్పోవడమేనని, దాని వల్ల పైసా నష్టం లేకపోయినప్పటికీ.. చిన్న బాధ మాత్రం ఉండిపోయిందంటూ ఝాన్సీ తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఇదిలా ఉండగా చాలా కాలం క్రితమే భర్తకు విడాకులు ఇచ్చిన ఝాన్సీ.. ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తోంది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్‌ రోల్స్‌ చేస్తూ సినిమాల్లో బిజీగా గడుపుతోంది.

Also Read ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ విన్ అయినప్పుడు భర్తకు ఏడేళ్లు, టీవీలో ప్రోగ్రామ్ చూసిన నిక్

Published at : 12 May 2023 12:45 PM (IST) Tags: UNICEF Jhansi Social Media Anchor Jhansi Rumors Affair Police Raid

సంబంధిత కథనాలు

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్

'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి