By: ABP Desam | Updated at : 01 Aug 2022 01:57 PM (IST)
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న జయసుధ
Actress Jayasudha: గుంటూరు జిల్లా తెనాలిలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నటి జయసుధ హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ వేడుకలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహన కృష్ణ పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా సహజ నటి జయసుధకు అవార్డును అందజేశారు. అవార్డు అందుకున్న జయసుధ మాట్లాడుతూ తన సినీ కెరీర్‌లో చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెనాలిలో జరుగుతున్న తన అభిమాన హీరో ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
ఆనయతో కలిసి 16 సినిమాల్లో నటించాను..
ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాలు నటించినందుకు చాలా గర్వపడుతున్నాని వివరించారు. సీనియర్ ఎన్టీఆర్‌తో కలిసి 16 సినిమాల్లో నటించానని గుర్తు చేసుకున్నారు. నిజంగా ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని జయసుధ చెప్పారు. తనకు ఎన్టీఆర్‌తో ఎన్నో మంచి అనుభూతులు ఉన్నాయని చెప్పారు. ఎన్టీఆర్ ఎప్పుడూ చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా ఎదుటి వాళ్ళని గౌరవిస్తుండే వారని గుర్తు చేశారు. ప్రతీ ఒక్కరి నుంచి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలని చూసే వారని వివరించారు. డైలాగులపై పట్టు రావాలని, సన్నివేషాలు పండాలని సినిమా స్క్రిప్టు తీస్కొని మొత్తం తన స్వహస్తాలతో తిరగరాసే కథానాయకుడు ఎన్టీఆర్ అంటూ జయసుధ చెప్పుకొచ్చారు.
సమయపాలన పాటించే క్యారెక్టర్ ఉన్న హీరో..
ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి వ్యావాయం పూర్తి చేసి 6 గంటలకే తన పనులన్నీ పూర్తి చేసుకొని మేకప్ వేస్కొని 7 గంటలకల్లా షూటింగ్‌కు సిద్ధంగా ఉండే వారని వివరించారు జయసుధ. సహ నటులు ఎవరైనా మద్యానికి బానిసలై జీవితాన్ని పాడు చేస్కుంటుంటే మందలించి దారిలో పెట్టిన మహోన్నత వ్యక్తి అంటూ ప్రశంసల వర్షం కురించారు. తను 50 ఏళ్ళు సినీ ఇండస్ట్రీనీ పూర్తి చేసుకున్నందుకు ఎన్టీఆర్ ఉండి ఉంటే చాలా ఆనందపడేవారని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ వల్ల నట జీవితంలో క్రమశిక్షణ నేర్చుకున్నానని తెలిపారు. ఎన్టీఆర్ అంటే ఒక యూనివర్సిటీ అని.. ఎప్పుడు ఆయన్ని చూసి ఎదో ఒకటి నేర్చుకునే వాళ్ళం అని జయసుధ పేర్కొన్నారు.
ఆయన వల్లే మానసికంగా దృఢంగా అయ్యాను..
తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని జయసుధ చెప్పారు. అలాగే సినిమాలు తీసి చాలా పోగొట్టుకున్నానని.. అలాంటి సమయాల్లో కూడా ఎన్టీఆర్ ఎంతో భరోసా ఇచ్చేవారని చెప్పారు. ఆయన వల్ల తను మానసికంగా చాలా దృఢంగా మారినట్లు వివరించారు. 50 ఏళ్లు సినీ ఇండస్ట్రీలో ఉన్నానా అని ఆశ్చర్యం కలుగుతుందన్నారు. తనకు ఇంత మంది అభిమానులు ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మీ అభిమానం ఎప్పుడు నాకు ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఇంత గొప్పగా చేస్తున్న ఆలపాటి.రాజేంద్రప్రసాద్ జయసుధ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?
Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు
ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?
Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!
AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్కు హరీష్ కౌంటర్ !
iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!
WhatsApp New Feature: వాట్సాప్లో డిలీట్ అయిన మెసేజ్లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?