Actress Ileana: ఇలియానాను బ్యాన్ చేసిన తమిళ ఇండస్ట్రీ, ఎందుకో తెలుసా ?
ఒకప్పుడు కుర్రకారును తన అందంలో ఉర్రూతలూగించింది నటి ఇలియానా. అయితే ప్రస్తుతం సరైన సినిమా అకాశాలు రాక సమమతమవుతుంది. దాదాపు పదేళ్ల నుంచి సౌత్ సినిమాలకు దూరంగా ఉంటోంది ఇలియానా.
ఒకప్పుడు కుర్రకారును తన అందంలో ఉర్రూతలూగించింది నటి ఇలియానా. అయితే ప్రస్తుతం సరైన సినిమా అకాశాలు రాక సమమతమవుతోంది. కొన్నాళ్లుగా సౌత్ సినిమాలకు దూరంగా ఉంటోంది ఇలియానా. తెలుగులో అవకాశాలు తగ్గడంతో పాటు తమిళంలో పూర్తిగా సినిమాలు చేయడం లేదు ఈ బ్యూటీ.
ఇలియానా తమిళ సినిమాలు చేయకపోవడం వెనుక ఓ పెద్ద కారణమే ఉందట. తెలుగులో మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తర్వాత అవకాశాలు వెల్లువెత్తాయి. దీంతో కొలీవుడ్, శాండిల్ వుడ్ లో కూడా మంచి సినిమాలు చేసి సౌత్ ఇండియన్ హీరోయిన్ గా ఎదిగింది. గత కొన్నేళ్లుగా హిందీ సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. సౌత్ లో అసలు సినిమాలు చేయడం లేదు. ఇందుకు కారణం ఏమిటనేది ఇటీవల బయటపడింది.
అసలు ఏం జరిగిందంటే..
ఇలియానా తెలుగులో రవితేజ నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా సమయంలో తమిళంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అందుకు అక్కడ ఓ పెద్ద నిర్మాత నుంచి డబ్బులు కూడా తీసుకుందట. అయితే తర్వాత సినిమా చేయలేదట. ఇదేంటని అడిగితే.. ‘‘డబ్బులు ఇవ్వను, ఇంకో సినిమా చేస్తానులే’’ అని చెప్పడంతో ఆ నిర్మాత సీరియస్ అయ్యాడట. ఆ విషయంపై కోలీవుడ్ నడిగర్ సంఘంతో పాటు సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కూడా ఫిర్యాదు చేశాడట. దీంతో ఇలియానాను పదేళ్ల పాటు సౌత్ సినిమాలలో నటించకుండా బ్యాన్ చేశారట. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలియానా ఇంతపని చేసిందా అని ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.
మళ్లీ టాలీవుడ్ లో పాగా వేయాలని..
ఇలియానా కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండేది. అయితే ఆమె వ్యాఖ్యల వల్లే టాలీవుడ్ లో కూడా అవకాశాలు తగ్గాయి అంటారు. ఓ సందర్భంలో ఇలియానా తనకు బాలీవుడ్ లోనే సెటిల్ అవ్వాలి అదే నా కోరిక అని చెప్పింది. ఇక అప్పటి నుంచి ఆమెపై టాలీవుడ్ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే బాలీవుడ్ లో కొన్ని హిట్ సినిమాలలో నటించినా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. మరోవైపు సౌత్ లో కూడా అవకాశాలు తగ్గిపోయాయి. గతంలో రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలో నటించిది. ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో మళ్లీ ఎలాగైనా టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తోందట ఈ బ్యూటీ. ఒకప్పుడు ఇలియానా కు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉండేది. అయితే ఆమె వయసు రీత్యా అంత డిమాండ్ ఇప్పుడు ఉండకపోవచ్చు. అందుకే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల సినిమాలలో అయినా చాన్స్ దక్కించుకోవాలని తెగ ప్రయత్నిస్తోందట. అయితే తమిళంలో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘నన్బన్’. ఈ సినిమాలో ఇలియానా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే ఇప్పుడు శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ‘ఇండియన్ 2’ సినిమాలో ఓ పాత్ర కోసం సంప్రదించారని టాక్. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి ఇకపై ఇలియానా సౌత్ సినిమాల్లో కనిపిస్తుందో లేదో చూడాలి.
Also Read: పెళ్లి చేసుకున్న నరేష్, పవిత్ర లోకేష్ - వీడియో వదిలిన కొత్త జంట