Singer Sunitha: సింగర్ సునీత కొడుకు కొత్త సినిమాలో హీరోయిన్ ఈ అమ్మాయే...
Actress Bhairavi: 'సర్కారు నౌకరి'తో సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయం అయ్యారు. ఇప్పుడు తాటి బాలకృష్ణ నిర్మాణంలో ఆయన మరో సినిమా చేస్తున్నారు. అందులో భైరవి హీరోయిన్.

టాలెంట్ ఉన్నోళ్లకు టాలీవుడ్ ఎప్పుడూ వెల్కమ్ చెబుతుంది. ఏ ఊరు? వాళ్ళ భాష ఏమిటి? వంటివి ఎప్పుడూ చూడలేదు. అందుకే, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రావడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు ఆ జాబితాలో హీరోయిన్ భైరవి కూడా చేరుతోంది. సింగర్ సునీత కుమారుడి రెండో సినిమాలో ఆవిడ నటిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
ఆకాష్ గోపరాజు సరసన కొత్త అమ్మాయి భైరవి
'సర్కారు నౌకరి' సినిమాతో సింగర్ సునీత కుమారుడు (Akash Goparaju) తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఇప్పుడు ఆయన మరో సినిమా చేస్తున్నారు. ఆకాష్ హీరోగా తథాస్తు క్రియేషన్స్ పతాకం మీద నిర్మాత తాటి బాలకృష్ణ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమాలో కథానాయికగా భైరవిని ఎంపిక చేశారు.
భైరవికి ఇది తొలి సినిమా అయినప్పటికీ ఆమె ఎంతో పరిణితితో నటించిందని, పలు సన్నివేశాల్లో అద్భుతమైన అభినయం కనబరిచిందని చిత్ర బృందం చెబుతోంది. ఇక... సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ సన్నివేశాల్లో భైరవి నటన సీనియర్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సినిమా తర్వాత ఆవిడ స్టార్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: చిరు, కమల్, బాలయ్యతో నటించిన హీరోయిన్... తాగుడుకు బానిసై కెరీర్ నాశనం... భర్తతోనూ గొడవలే, 44 ఏళ్ల వయసులో రెండో పెళ్లి
రొమాంటిక్... సస్పెన్స్... కామెడీ... లవ్
హీరో మరదలు.. పక్కా పల్లెటూరి అమ్మాయి!
రొమాన్స్, సస్పెన్స్, కామెడీ, లవ్ అంశాలు మేళవించి దర్శకుడు శివ ఈ సినిమాను రూపొందిస్తున్నారని తథాస్తు క్రియేషన్స్ నిర్మాత తాటి బాలకృష్ణ తెలిపారు. ఇంకా ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ... ''పల్లెటూరి నేపథ్యంలో తీస్తున్న రొమాంటిక్ లవ్ సస్పెన్స్ కామెడీ ఫిల్మ్ ఇది. 'సర్కారు నౌకరి' తర్వాత ఆకాష్ గోపరాజు హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఆయన సరసన భైరవిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాం. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో భైరవి చక్కగా నటిస్తోంది. కథానాయకుడికి మరదలుగా ఆమె పాత్ర సినిమాలో హైలైట్ అవుతుంది. ప్రతి ఒక్కరినీ అలరించే విధంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా టైటిల్, విడుదల తేదీ ప్రకటిస్తాం'' అని అన్నారు. ఆకాష్ గోపరాజు పాత్ర కూడా సినిమాలో హైలైట్ అవుతుందని, ఆయనకు ఈ సినిమా భారీ హిట్ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
Also Read: 'దేవర' కోసం జపనీస్ మీడియాకు ఎన్టీఆర్ ఇంటర్వ్యూలు... త్వరలో జపాన్ ప్రయాణం కూడా!
ఆకాష్ గోపరాజు, భైరవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రఘు బాబు, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, ప్రభావతి, మహేందర్, డీడీ శ్రీనివాస్, కిట్టయ్య తదితరలు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: తథాస్తు క్రియేషన్స్, సహ నిర్మాత: తాటి భాస్కర్, సంగీతం: యశ్వంత్, నిర్మాత: తాటి బాలకృష్ణ, దర్శకత్వం: శివ.
Also Read: సమంతకు నచ్చిన హీరోయిన్లు, వాళ్ళ సినిమాలు... నాగ చైతన్యతో నటించిన అమ్మాయి కూడా ఉందండోయ్





















