(Source: ECI/ABP News/ABP Majha)
Actress Annapurna: నా అసలు పేరు ఇది కాదు - అప్పట్లో హీరోయిన్ అలా ఉండేవారు, శ్రీదేవి అలా ఉండేది: అన్నపూర్ణ
Actress Annapurna: అలనాటి నటి అన్నపూర్ణ. ఈమెను అందరూ అన్నపూర్ణమ్మ అని పిలుచుకుంటారు. ఆ తరం నుంచి ఈ తరం వరకు ఎంతోమంది హీరో, హిరోయిన్లతో నటించారు ఈ లెజెండరీ యాక్టర్.
Actress Annapurna About Sridevi and Soundarya: అలనాటి నటి అన్నపూర్ణ. తెగులు సినీ ప్రేక్షకులు ఆమెను అన్నపూర్ణమ్మ అని పిలుచుకుంటారు. ఆ తరం నుంచి ఈ తరం వరకు ఎన్నో సినిమాలు చేశారు ఆమె. ఎంతోమంది యాక్టర్లతో కలిసి నటించారు. సినిమాలు, సీరియళ్లు, వెబ్‌సిరీస్‌లు, జబర్దస్త్ లాంటి కామెడీ షోల్లో కూడా పాల్గొన్నారు ఆమె. కాగా.. ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె తన సినీ కెరీర్, తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నారు.
రూ.2500 రెమ్యునరేషన్..
అన్నపూర్ణమ్మ ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాల గురించి చెప్పుకొచ్చారు. తన రెమ్యునరేషన్. హీరోయిన్లు ఎలా ఉండేవాళ్లు అనే విషయాలను చెప్పారు ఆమె. "రెమ్యునరేషన్ విషయంలో నేను అసలు మొహమాట పడను. అలా అని ఎక్కువ డిమాండ్ చేయను. అందుకే, నాకు ఇవ్వాల్సినంత ఇచ్చేవాళ్లు. మొదట్లో నా రెమ్యునరేషన్ రూ.2500. రూ.5000 ఇస్తే బాగుండు అనిపించేది. కానీ, గుమ్మడి గారు, జగ్గయ్యగారు లాంటి వాళ్ల పక్కన నటించడం కదా.. అందుకే ఎక్కువ అడిగేదాన్ని కాదు. లెజెండ్స్ పక్కన నటిస్తే కచ్చితంగా పేరు వస్తుందనే ఆశ ఉండేది అప్పట్లో. ఇక అప్పట్లో కొత్తగా వాళ్లతో చేస్తే రూ.1500 ఇచ్చేవాళ్లు. "ఇంతే ఇవ్వగలం ఉమా" అనేవాళ్లు. ఇక నాకు అన్నపూర్ణ అని పేరు పెట్టింది సి.నారాయణ గారు. 'స్వర్గంనరకం' చేసినప్పుడు ఆ పేరు పెట్టారు. నేను హీరోయిన్‌గా పనికిరానేమో అనే ఫీలింగ్‌లో ఉండేదాన్ని. అప్పట్లో హీరోయిన్ అంటే మెయింటెయిన్ చేయాలి. దానిబదులు ఇలా క్యారెక్టర్లు వేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను" అని రెమ్యునరేషన్ గురించి చెప్పారు అన్నపూర్ణమ్మ.
సౌందర్య,విజయశాంతి అలా, శ్రీదేవి ఇలా..
"నన్ను అప్పట్లో నటీనటులు అందరూ బాగా చూసుకునేవాళ్లు. నేను నటించింది గొప్పవాళ్లు, లెజెండ్స్ పక్కన. గుమ్మడిగారు, రావుగోపాల్‌రావు గారు, జగ్గయ్య గారు, ప్రభాకర్‌రెడ్డి గారు అందరూ నాతో బాగా ఉండేవాళ్లు. ఇన్నేళ్లు అయినా సెట్‌లో ఇప్పుడు కూడా కొంచెం భయపడతాను. నిత్య విద్యార్థిని నేను. అందుకే, నేర్చుకుంటూనే ఉంటాను. ఎన్ని సినిమాలు చేసినా నటన అనేది నూతనంగా ప్రారంభించాల్సిన విషయం. ఏదో ఒకటి కచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఇక హీరోయిన్లు కూడా నాతో బాగానే ఉండేవారు. సినిమా ఫీల్డ్‌లో శ్రీలక్ష్మీ, వై విజయ మంచి ఫ్రెండ్స్. హీరోయిన్ల విషయాని వస్తే.. సౌందర్య బాగా మాట్లాడేది. శ్రీదేవి రిజర్వ్డ్‌గా ఉండేది. విజయ్ శాంతి, రాధ బాగా మాట్లాడతారు. ఎక్కడికి వెళ్లినా శ్రీలక్ష్మీతోనే ఎక్కువగా వెళ్లేదాన్ని. శ్రీలక్ష్మీని కూడా పిలుస్తున్నారా? అని అడిగేదాన్ని ఎవరైనా నాకు కార్డ్ ఇస్తే".
ఎక్కడికీ పెద్దగా వెళ్లను..
"పరిగెత్తే వయసులో దాక్కుని వేషాలు వేశాను. మిడిల్ వయసు వచ్చిన తర్వాత బాధ్యతల వల్ల వెళ్లలేదు. మా అమ్మాయి, మా అమ్మ వెళ్లిపోయిన తర్వాత బయటికి వచ్చా. ఎందుకంటే కొత్తకొత్తవాళ్లు వస్తారు. వాళ్ల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ప్రపంచాన్ని చూడొచ్చు. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఇక షూట్స్ లేకపోయినా ఎవ్వరినీ అడగను. నన్ను నేను విమర్శించుకుంటాను. అద్దంలో చూసి ఏదో లోపం ఉంది అనుకుంటాను. నేనే నెం.1 అనుకున్నాం అంటే ఇక మటాషే. బాగున్నని రోజులు పనిచేస్తాను. ఛాన్సులు వస్తే షూట్‌కి వెళ్తాను అంతేకానీ పెద్దగా డిమాండ్ చేసే, అడిగే మెంటాలిటీ కాదు నాది" అని జీవితంతో జరిగిన విషాలు, తనకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు అన్నపూర్ణమ్మ.
Also Read: ఓటీటీలోకి ‘ఊరు పేరు బైరవకోన’ - అనుకున్న డేట్ కంటే ముందే స్ట్రీమింగ్