Aishwarya Rajesh : ఆ దర్శకుడిపై ఐశ్వర్య రాజేష్ ఫైర్ - వైరల్ అవుతున్న ట్వీట్!
Aishwarya Rajesh : హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ డైరెక్టర్ వీర పాండియన్ తనపై చేసిన కామెంట్స్ కి ధీటుగా ట్వీట్ చేసింది.
కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కి ఓ దర్శకుడికి మధ్య మాటల యుద్ధం కాస్త తారా స్థాయికి చేరింది. దీంతో నెట్టింట ఇది వివాదంగా మారింది. అసలు ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియక నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్తే..
లేడి ఓరియెంట్ ప్రాజెక్ట్స్ కి కేరాఫ్ అడ్రస్‌గా 'ఐశ్వర్య రాజేష్..
తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ పలు తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. సహాయ నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె ఆ తర్వాత హీరోయిన్‌గా మారి పలు సూపర్ హిట్ సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది. తెలుగులో ఒకటి, రెండు సినిమాల్లో నటించినా ఇక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే తమిళంలో మాత్రం ఓవైపు అగ్ర హీరోలతో నటిస్తూనే మరోవైపు లేడి ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతుంది. ఈమధ్య ఎక్కువగా మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. అలా ప్రస్తుతం తమిళంలో మంచి క్రేజ్ తో దూసుకుపోతున్న ఐశ్వర్య రాజేష్ దర్శకుడు వీర పాండియన్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఐశ్వర్య - వీర పాండియన్ మధ్య అసలేం జరిగిందంటే..
వీర పాండియన్ 2011లో 'అవర్ గలుమ్ ఇవర్ గలుమ్' అనే సినిమా తీశాడు. ఇందులో ఐశ్వర్య రాజేష్ ఓ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఓ మీడియా ప్రకటనలో భాగంగా ఈ డైరెక్టర్ ఐశ్వర్య రాజేష్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశానని, ఈ విషయాన్ని ఆమె ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదని, ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిన తర్వాత నా సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని, ఆమె ఆర్థికంగా కష్టపడుతున్న సమయంలో ఆటో ఖర్చులకు కూడా నేనే డబ్బులు ఇచ్చానని.. చెప్పాడు.
ఇక దీనిపై పరోక్షంగా ఐశ్వర్య రాజేష్ స్పందిస్తూ డైరెక్టర్ వీర పాండియన్ పేరు చెప్పకుండా ట్వీట్ చేసింది "చాలామంది ఓ అంశాన్ని మాత్రమే విని మాట్లాడుతున్నారు. అసలు విషయాలు ఏమీ తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి వచ్చి జీవితంలోని అనుబంధాలను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరే పూర్తిగా తెలుసుకుని ఆరోపణలు చేస్తే బాగుంటుంది" అంటూ తన ట్వీట్ లో పేర్కొంది. దీంతో ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
'పుష్ప'లో ఛాన్స్ వస్తే ఆ పాత్ర చేసేదాన్ని..
ఐశ్వర్య రాజేష్ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాల గురించి మాట్లాడింది. "తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. తెలుగులో సినిమా చేస్తే కచ్చితంగా అది నా ఫ్యామిలీ గర్వపడే మూవీ అయి ఉండాలని అనుకున్నా. అలా తెలుగులో ఎన్నో ఏళ్లు అవకాశం కోసం ఎదురు చూశాక వరల్డ్ ఫేమస్ లవర్ లో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ మూవీ నన్ను తెలుగు వారికి మరింత చేరువ చేసింది. దాని తర్వాత టక్ జగదీష్, రిపబ్లిక్ సినిమాల్లో చేశా. ఇప్పుడు కూడా తెలుగులో ఆఫర్లు రావడం లేదని కాదు. వస్తున్నాయి. కాకపోతే మంచి పాత్రలతో కం బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ప్రెజెంట్ తెలుగులో అయితే ఏ ప్రాజెక్ట్ చేయడం లేదు. ఒకవేళ పుష్ప మూవీలో నాకు చాన్స్ వచ్చి ఉంటే ఖచ్చితంగా చేసేదాన్ని. పుష్ప లో రష్మిక మందన చాలా బాగా నటించారు. అందులో డౌటే లేదు. కాకపోతే ఆ రోల్ నాకు బాగా సూట్ అవుతుందని నా నమ్మకం" అంటూ చెప్పింది.
Also Read : 'విశ్వంభర'లో కోలీవుడ్ స్టార్ - మెగాస్టార్‌ను ఢీకొట్టే పాత్రలో?