Actor VK Naresh: ఆ పాట కోసం సుకుమార్ రోజంతా ఏడవమన్నారు: వి.కె.నరేష్
Actor VK Naresh: హీరోగా , కమెడియన్ గా నరేష్ గురించి అందరికీ తెలిసిందే.. తాజాగా ఆయన ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుకుమార్ గురించి చెప్పిన విశేషాలు ఏమిటో చూద్దాం!
Actor VK Naresh: సీనియర్ నటి, దర్శకురాలు అయిన విజయనిర్మల కొడుకు వీకే నరేష్. విజయనిర్మల కొడుకుగా ‘పండంటి కాపురం’ సినిమా ద్వారా బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నరేష్ ఆ తరువాత ‘ప్రేమ సంకెళ్లు’ సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత హాస్య చిత్రాల కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు.
2019లో ‘మా’ అధ్యక్షుడిగా నరేష్..
తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన నరేష్ ఆ పాత్రలలో కూడా పూర్తిగా ఇమిడిపోయి నటిస్తున్నారు. యాక్టర్ గా ఎంత పాపులర్ అయ్యాడో తన పెళ్లిళ్ల ద్వారా కూడా అంతే పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా నరేష్ మూడవ పెళ్లి ద్వారా వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. తర్వాత కొంతకాలం పాటు రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొన్నాడు. 2019లో మా ఎన్నికలలో అంతకు మునుపు అధ్యక్షుడైన శివాజీ రాజా మీద గెలిచి మా మూవీ అధ్యక్షుడు అయ్యాడు నరేష్. అయితే అతను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
నేను డైరెక్టర్స్ యాక్టర్‌ను..
‘‘మెథడ్ యాక్టింగ్ గురించి, సుకుమార్ డైరెక్షన్ గురించి ఆయన చెప్పిన విశేషాలు ఏమిటో చూద్దాం. మెథడ్ యాక్టింగ్ గురించి మాట్లాడుతూ మనం ఏదైనా మ్యానరిజం తీసుకున్నప్పుడు అది మనకి అలవాటు అయిపోతుంది. ఆ యాక్టింగ్ చూసి కొన్ని రోజులకి ప్రజలకి అది బోర్ కొడుతుంది అందుకే నేను అలాంటివి పెట్టుకోను. నేను డైరెక్టర్స్ యాక్టర్ ని. మెథడ్ యాక్టింగ్ అంటే బిహేవింగ్ ద క్యారెక్టర్ నేను ఈ విషయాన్ని జంధ్యాల, బాపు లాంటి దర్శకుల దగ్గర నేర్చుకున్నాను అంటూ బిహేవింగ్ క్యారెక్టర్ అంటే ఏమిటో డీటెయిల్ గా వివరించారు. అంటే క్యారెక్టర్ కి ఎంత కావాలో అంతవరకే నటించటం’’ అని తెలిపారు.
సుకుమార్ గారు రోజంతా ఏడవమన్నారు..
‘‘మనం ఇంట్లో చేసిన వంట ఎంతైనా తినగలం అదే అమ్మ చేతి వంటని ఎన్ని రోజులైనా తింటాం. అది అమ్మ చేతి వంట యొక్క ప్రత్యేకత. అదే హోటల్ ఫుడ్ ని మనం ప్రతిరోజు తినలేము కదా. యాక్టింగ్ అనేది కూడా అలాగే ఉండాలి అందుకు రంగస్థలంలోని ఈ చేతితోనే బువ్వ పెట్టాను సాంగ్ ని ఉదాహరణగా చూపిస్తూ సుకుమార్ గారు నా దగ్గరికి వచ్చి నరేష్ గారూ మీరు రోజంతా ఏడవాలి అని చెప్పినప్పుడు ఎందుకు సార్ అని అడిగాను. పాట అలాంటిది అని చెప్పారు సుకుమార్ గారు. అయితే వినిపించండి అని అడిగితే సుకుమార్ గారు పాట వినిపించారు’’ అని పేర్కొన్నాడు.
పాట వింటూనే ఏడుపు వచ్చేసింది..
‘‘ఆ పాట వింటూనే నాకు ఏడుపు వచ్చేసింది. ఈ సాంగ్ కి గ్లిజరిన్ అక్కర్లేదు సార్ అని చెప్పాను. ఏంటి జోకా అని సుకుమార్ గారు అడిగితే కాదు సార్ నిజం అని చెప్పాను క్యారెక్టర్ లోకి అంతలాగా ఇన్వాల్వ్ అవ్వగలగాలి. అలాగే సామజవర గమనలో క్యారెక్టర్ కి ఎంతవరకు కావాలో అంతవరకే యాక్ట్ చేయాలి. ఆ ఇంపాక్ట్ వేరే సినిమాలో వేరే క్యారెక్టర్ మీద పడకూడదు’’ అని చెప్పాడు నరేష్.