అన్వేషించండి

Actor Naresh: నేనో పెద్ద కోతిని, మహేష్ బాబుకు ఆ ఫుడ్ అంటే చాలా ఇష్టం- నటుడు నరేష్

అమ్మ విజయ నిర్మల చేసిన ఫుడ్స్ అంటే మహేష్ బాబుకు ఎంతో ఇష్టమని నటుడు నరేష్ తెలిపారు. చిన్నప్పుడు తాను ఓ పెద్ద కోతిలా అల్లరి చేసినా, అమ్మ ఏనాడు కొట్టలేదని వెల్లడించారు.

Actor Naresh About His Family: సీనియర్ నటుడు నరేష్ గురించి పరిచయం అవసరం లేదు. ఏదో ఒకరకంగా ఆయన మీద మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. ఈ వయసులోనూ ఆయన కుర్రాడి పనులు చేస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్, తన ఫుడ్ హాబిట్స్, మహేష్‌కు ఇష్టమైన ఫుడ్ తో పాటు అమ్మానాన్న మధ్య ప్రేమ గురించి కీలక విషయాలు వెల్లడించారు.

దిగులుతో 10 కేజీలు బరువు తగ్గాను - నరేష్

ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నరేష్ తెలిపారు. “రాగి చెంబులో నీళ్లు, నాలుగు బాదం పప్పులు, నాలుగు జీడి పప్పులు, నాలుగు ఖర్జూరాలు, ఎండు నల్లద్రాక్షను నీళ్లలో వేసుకుని తాగుతాను. ఇదే నా బ్రేక్ ఫాస్ట్. రాత్రి నానబెట్టి పొద్దున్నే తాగితే వైన్ లా అనిపిస్తుంది. ఈ వాటర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అమ్మ ఉన్నప్పుడు కడుపు నిండా టిఫిన్ పెట్టేది. ఆవిడ ఉన్నప్పుడు నేను చాలా లావుగా ఉండేవాడిని. అప్పట్లో అమ్మ టైమ్ టేబుల్ ప్రకారం ఫుడ్ పెట్టేది. పొంగల్ లో ఎర్ర పచ్చడి, నెయ్యి వేసుకుని తింటుంటే అద్భుతంగా ఉండేది. అమ్మ చనిపోయినప్పుడు దిగులుతో 10 కేజీలు తగ్గాను” అని నరేష్ వెల్లడించారు.

మహేష్ బాబుకు ఆ ఫుడ్ అంటే చాలా ఇష్టం-నరేష్

అమ్మ ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. లంచ్ చేస్తుంటే పంక్తి భోజనంలా ఉండేది. లంచ్ లో చాలా వెరైటీలు ఉండేవి. మహేష్ బాబు ఫుడ్ ను ఎంజాయ్ చేస్తూ తినేవాడు. మహేష్ బాబుకు అమ్మ చేసిన ఫుడ్స్ లో బిర్యానీ అంటే చాలా ఇష్టం. గోంగూర మటన్ కూడా బాగా లాగించేవాడు. కృష్ణగారు కూడా ఫుడ్ ని చాలా ఇష్టంగా తినేవాళ్లు” అని చెప్పుకొచ్చాడు.

అమ్మనాన్న మధ్య స్వచ్ఛమైన ప్రేమ ఉండేది- నరేష్

అప్పట్లో కృష్ణగారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అని వేరుగా ఉండేది కాదు. అందరం కలిసి ఉండేవాళ్లం. అమ్మానాన్న కూడా ఒకరి నుంచి మరొకరు ఏమీ ఆశించేవారు కాదు. ప్రేమ తప్ప. మహేష్ అంటే అమ్మకు ఎంతో ఇష్టం. అమ్మ ఈ ఇంట్లో ఏం పెట్టిందో? అవి అలాగే ఉంచాం. ఆమె కోరుకున్నట్టే ఈ ఇల్లు ఉంది. పైన వాళ్లు ఉన్న రూమ్ ఇప్పటికీ అలాగే ఉంటుంది. అప్పుడప్పుడు నేను అక్కడికి వెళ్లి కూర్చుంటాను. ఆలోచిస్తాను. నవ్వుతాను. ఏడుస్తాను. వారి జీవితంలోని బ్యూటీ ఫుల్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి” అని చెప్పుకొచ్చారు.

కోతి వేషాలు వేసినా అమ్మ కొట్టేది కాదు- నరేష్

“మా అమ్మను చూస్తే చిన్నప్పుడు నాకు చాలా భయం. ఆమె నన్ను ఎప్పుడూ కొట్టలేదు. నేను కోతి చేష్టలు చేసినా.. కళ్లతోనే భయపెట్టేది. పిల్లల్ని కొట్టకూడదు, భయపెట్టాలని అనేది. నా పట్ల అలాగే చేసేది. అమ్మను ఎప్పుడూ ఏకవచనంతో పిలవలేదు” అని నరేష్ చెప్పారు.  

Read Also: నా భర్త.. గే, ధనుష్ కూడా - ఐశ్యర్యకు పెళ్లికి ముందే ఎఫైర్ ఉంది: గాయని సుచిత్ర

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget