Venkatesh: ఐ మిస్ యూ 'గూగుల్' - వెంకటేష్ ఎమోషనల్ పోస్ట్
Venkatesh Pet Dog: తన పెట్ డాగ్ 'గూగుల్' మృతి చెందడంతో స్టార్ హీరో వెంకటేష్ ఎమోషనల్ అయ్యారు. నిన్ను మిస్ అవుతున్నా అంటూ ఆయన తన ఇన్ స్టాలో రాసుకొచ్చారు.

Actor Venkatesh Pet Dog Google Is No More: తన పెంపుడు కుక్క 'గూగుల్' మృతి చెందడంతో స్టార్ హీరో వెంకటేష్ ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా 'ఐ మిస్ యూ' అంటూ పెట్ డాగ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇక వీడ్కోలు అంటూ పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
ఐ మిస్ యూ 'గూగుల్'
'నా ప్రియమైన గూగుల్ గత 12 ఏళ్లుగా నువ్వు మా జీవితాల్లో భాగమయ్యావు. అందమైన జ్ఞాపకాలు నింపావు. ఎంతో ప్రేమను పంచావ్. నువ్వే మా సన్ షైన్. నువ్వు లేని శూన్యత మాటల్లో వర్ణించలేను. ఇక నీకు వీడ్కోలు చెబుతున్నా. నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను. మై డియర్ ఫ్రెండ్ ఇక వీడ్కోలు.' అంటూ రాసుకొచ్చారు. పెట్ డాగ్‌తో గడిపిన మధుర క్షణాలను షేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు 'రిప్ గూగుల్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: నెక్స్ట్ ఇయర్ నుంచి వరుసగా మూవీస్ చేస్తా బ్రో - రానాతో స్వీటీ అనుష్క ఫోన్ కాల్... ఏంటీ నీకు పెళ్లా?
ఇక సినిమాల విషయానికొస్తే... గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వెంకీ. ఇక ఈ ఏడాది కూడా వరుస మూవీస్ లైనప్‌లో ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు. ఈ మూవీకి 'వెంకట రమణ' అనే టైటిల్ ఖరారు చేయనున్నట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా... త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. వీటితో పాటే అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబోలో వస్తోన్న 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు.
'లక్ష్మీ' కాంబో రిపీట్?
ఇదే టైంలో మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ (VV Vinayak) దర్శకత్వంలో వెంకీ (Venkatesh) మరో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మాస్, యాక్షన్, కామెడీ అన్నీ కలగలిపి వెంకీ కోసం స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇదివరకు వీరిద్దరి కాంబోలో వచ్చిన 'లక్ష్మీ' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఈ మూవీకి ఆకుల శివ స్టోరీ అందించారు. ఆయనే మరోసారి వెంకీ కోసం స్టోరీ సిద్ధం చేస్తున్నారట. లక్ష్మీ రూపొందించిన నల్లమలుపు బుజ్జి నిర్మాణంలోనే ఈ మూవీ కూడా రానుంది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. మరోసారి యాక్షన్, ఎమోషన్ కలిసిన కామెడీ మూవీలో వెంకీ చూసే అవకాశం ఉంది.






















