
Sohel Bootcut Balaraju: కాల్‌సెంటర్ వాళ్లనీ వదిలిపెట్టని సోహెల్, సినిమా ప్రమోషన్ చేయమని రిక్వెస్ట్.. వీడియో వైరల్
Sohel Bootcut Balaraju: 'బూత్‌కట్ బాలరాజు' చూడండంటూ మోకాళ్ల మీద వేడుకున్నాడు. ప్లీజ్ అని ఏడ్చాడు. ఇప్పుడిక కాల్‌సెంటర్ ఎంప్లాయిస్‌ని కూడా బతిమలాడుతున్నాడు సోహెల్.

Sohel Requesting Call centre employee: 'బూట్‌కట్ బాలరాజు'.. బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే, ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు హీరో సోహెల్ విశ్వప్రయత్నాలు చేశారు. దాంట్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున స్టేజ్‌పైన మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం సర్వస్వం దారపోశాం.. ప్లీజ్ సినిమా చూడండి అంటూ వేడుకున్నాడు. ఇక ఇప్పుడు "లోన్ కావాలా?" అని అడిగేందుకు ఫోన్ చేసిన కాల్‌సెంటర్ అమ్మాయిని కూడా సినిమా ప్రమోషన్స్ చేయాలని బతిమాలుకున్నాడు సోహెల్. దానికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది.
'ప్లీజ్ సినిమా చూడమని చెప్పండి'
సోహెల్ నటించిన 'బూట్‌కట్ బాలరాజు' ఫిబ్రవరి 2న రిలీజ్ అయ్యింది. అయితే, ఆ టైంలోనే సోహెల్‌కి యాక్సిక్ బ్యాంక్ కస్టమేర్ కేర్ నుంచి ఫోన్ వచ్చింది. 'లోన్ కావాలా?' అని ఆ అమ్మాయి అడిగితే.. "లోన్ తీసుకుంటాను.. కానీ, నా సినిమా చూడమని చెప్పండి. మీ దగ్గర చాలామంది నంబర్లు ఉంటాయి కదా.. ప్లీజ్ సోహెల్‌గాడి సినిమా రిలీజ్ ఉంది.. ఫిబ్రవరి 2న చూడండి అని చెప్పండి. మీరు యాక్సిస్ బ్యాంక్ అని పేరు పెట్టుకుని యాక్సెస్ చేయకపోతే ఎలా చెప్పండి" అంటూ ఆ అమ్మాయిని బతిమాలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, దానికి ఆ అమ్మాయి మాత్రం "పాలసీలు ఒప్పుకోవు సార్" అంటూ ఫోన్ కట్ చేసింది. ఇక ఈ వీడియో చూసిన వాళ్లంతా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. "సోహెల్ అన్న ఏందన్న ఇది.. పిచ్చిపట్టిందా" అంటున్నారు. ఇక కొంతమందైతే.. ఇన్ని రకాలుగా సినిమా ప్రమోషన్లు చేసుకోవచ్చా? అని ప్రశ్నిస్తున్నారు.
View this post on Instagram
ఎమోషనల్ అయిన సోహెల్..
'బూట్‌కట్' బాలరాజు సినిమా ఊహించినంతగా సక్సెస్ కాలేకపోయింది. అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరికినప్పటికీ.. ప్రేక్షకులు సినిమా చూసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో సోహెల్ ఎమోషనల్ అయ్యారు. " ఈ సినిమా ఫ్రెండ్స్‌తో మాత్రమే కాదు.. ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి వల్గారిటీ లేదు ఈ సినిమాలో. అన్ని ప్రాంతాల వాళ్లు చూడొచ్చు. హైదరాబాద్ మినహా ఎక్కడా పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. నేను కూడా అందరిలా ముద్దు సీన్లు చేస్తాను. అప్పుడే అందరికీ నచ్చుతుందేమో. సినిమా విషయంలో కొంత మంది రివ్యూ ఇవ్వడం చూసి బాధపడ్డాను. కనీసం, 20 నిమిషాలు సినిమా చూడకముందే రివ్యూ ఇచ్చేస్తున్నారు. ఇదేం పద్దతి? బిగ్ బాస్ ఉన్నప్పుడు సోహెల్ ను ఎలా ప్రోత్సహించారో? ఈ సినిమా విషయంలోనూ అలాగే ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు సోహెల్.
రెండోరోజు నుంచి కాస్త పెరిగిన కలెక్షన్స్..
ఇక 'బూట్‌కట్ బాలరాజు' సినిమాకి మొదటిరోజు కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే, రెండోరోజు మాత్రం కొద్దిగా కలెక్షన్లు పెరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 40శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు చెప్పాయి. ఇక ఈ సినిమాలో సోహెల్ సరసన మేఘ లేఖ హీరోయిన్ గా నటించింది. ఎండీ పాషా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సీనియర్ నటి ఇంద్రజ, సునీల్, సిరి హన్మంతు, జబర్దస్త్ రోహిణి, ముక్కు అవినాష్, సద్దాం కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
Also Read: 'నంద.. నందన' అంటున్న దేవరకొండ - ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ లిరికల్ ప్రోమో చూశారా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

