అన్వేషించండి

Game Changer: ‘గేమ్ చేంజర్’లో హైలెట్ ఏంటో చెప్పేసిన శ్రీకాంత్.. ‘ట్విస్టుల మీద ట్విస్టులు’ శంకర్ సార్ మీకో దండం!

డిసెంబర్‌లో వచ్చిన ‘పుష్ప 2’ మూవీ అందరికీ ఫుల్ మీల్స్ పెట్టేసింది. ఇప్పుడందరి చూపులు సంక్రాంతి సినిమాలపైనే. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ చేసిన ‘గేమ్ చేంజర్’ సినిమాపైనే. ఈ మూవీ విశేషాలేంటో శ్రీకాంత్ మాటల్లో

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా సంక్రాంతి స్పెషల్‌గా 2025, జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మూవీ యూనిట్ చిత్ర ప్రమోషన్స్‌ని మొదలెట్టి పాటలు, టీజర్ విడుదల చేశారు. ఇప్పటి వరకు విడుదలైన 3 పాటలు, టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఇప్పుడిక యూనిట్‌తో ఇంటర్వ్యూలను స్టార్ట్ చేసింది యూనిట్. అందులో భాగంగా ‘గేమ్ చేంజర్’లో ఓ ముఖ్య పాత్రను పోషించిన శ్రీకాంత్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..

శంకర్ సార్‌తో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కూ ఉంటుంది. ‘గేమ్ చేంజర్’ కథ ఆయన ఫస్ట్ హాఫ్ చెప్పినప్పుడు ఈ పాత్రను నాకు ఎందుకు చెబుతున్నారా? అని అనుకున్నా.సెకండాఫ్ చెప్పిన తరువాత ఈ పాత్రను కచ్చితంగా నేనే చేయాలని ఫిక్సయ్యా. నా పాత్ర అంత బాగా ఉంటుంది. గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. నా పాత్రకి ఉన్న ప్రోస్థటిక్ మేకప్‌కే దాదాపు నాలుగు గంటలు పట్టేది. నేను ఇంత వరకు ప్రోస్థటిక్ మేకప్‌ వేసుకుని నటించలేదు. కానీ అలాంటి మేకప్ ధరించి నటించడం చాలా కష్టం. చెమటలు పట్టినా మేకప్ మారిపోతుంది. మా నాన్నగారి గెటప్‌ను చూసే నాకు ఈ క్యారెక్టర్ లుక్‌ను ఫిక్స్ చేశారు. ఒకరోజు గెటప్ వేసుకుని నేరుగా ఇంటికి వెళ్లాను. మా అమ్మ నన్ను చూసి షాకయింది. హేయ్ బేబీ (నవ్వుతూ) అని సరదాగా పిలిచాను. అప్పుడు నా గెటప్ సరిగ్గా సెట్ అయిందని అనుకున్నాను.

Also Readసోలో బాయ్ గౌతమే విన్నర్... బిగ్ బాస్ ఫినాలేలో అతను విజేతగా నిలవడానికి కారణమైన ప్లస్ పాయింట్స్‌ ఏంటో తెలుసా? మైనస్‌లు ఏమున్నాయ్ అంటే?

శంకర్ సార్ పనితనం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు ఓర్పు, సహనం చాలా ఎక్కువ. అనుకున్నది అనుకున్నట్టు వచ్చే వరకు టేక్స్ తీసుకుంటూనే ఉంటారు. ఇంకో విషయం ఏమిటంటే ప్రతీ పాత్రని ఆయన నటించి చూపిస్తారు. ప్రస్తుత జనరేషన్ ఎలివేషన్స్‌తో పాటు కథను చెబితే బాగా ఆదరిస్తున్నారు. కొన్ని చిత్రాలు ఎలివేషన్స్‌తోనే ఆడుతున్నాయి. ఈ చిత్రంలో కథతో పాటు ఎలివేషన్స్‌ కూడా మాములుగా ఉండవు. శంకర్ సార్ అలా ప్లాన్ చేశారు. ఈ మధ్య ఆయన చిత్రాలు మిస్ ఫైర్ అయి ఉండొచ్చు. కానీ ‘గేమ్ చేంజర్’ మాత్రం అస్సలు మిస్ ఫైర్ కాదు. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. శంకర్‌గారి అన్ని సినిమాల్లో ఉండేలానే ఇందులోనూ సామాజిక సందేశం ఉంటుంది.

ఇక ఇందులో నా పాత్ర విషయానికి వస్తే.. నా పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. చాలా సస్పెన్స్‌లు ఉంటాయి. అవన్నీ చెప్పలేము. సినిమాలోనే చూడాలి. గెటప్ వేసిన వెంటనే ఆ పాత్ర తాలుకా షేడ్స్ అన్నీ వచ్చేస్తాయి. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సినిమాకు చాలా ముఖ్యమైన పాత్ర. ఇంత మంచి అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. సినిమాలో నాకు ఎస్‌జె సూర్య, జయరాం, సముద్రఖని, రామ్ చరణ్ ఇలా అందరితోనూ సీన్లు ఉంటాయి. ఎస్‌జె సూర్య పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ‘సరిపోదా శనివారం’ పాత్రను మించేలా ఉంటుంది. 

రామ్ చరణ్‌తో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ అంటే.. ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం టైంలో రామ్ చరణ్ చాలా యంగ్. ఇప్పుడు చాలా ఎదిగాడు. గ్లోబల్ స్థాయికి చేరుకున్నాడు. ఇందులో అప్పన్న పాత్రను రామ్ చరణ్ పోషించిన తీరు చూస్తే అంతా షాక్ అవుతారు. చాలా కొత్తగా అనిపిస్తాడు. రామ్ చరణ్ నన్ను ఎప్పుడూ అన్నా అని ఆప్యాయంగానే పిలుస్తాడు. నేను కూడా మా అన్నయ్య కొడుకులానే రామ్ చరణ్‌ని చూస్తాను.

‘గేమ్ చేంజర్’ సినిమాకు కార్తిక్ సుబ్బరాజ్ కథ అందించారు. ఆయన రాసిన కథ శంకర్ సార్‌కి బాగా నచ్చింది. అందుకే సినిమాను చేసేందుకు ముందుకు వచ్చారు. నిర్మాత దిల్ రాజు కూడా ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. ఈ మూవీకి సీక్వెల్ వంటివి ఏమీ ఉండవు. ఈ సినిమా ఆలస్యానికి కారణం అందరి డేట్లు సెట్ కాకపోవడం వల్లే షూటింగ్ ఆలస్యమైంది. దాదాపు ఏడాది వేస్ట్ అయింది. నేను ‘దేవర’ షూటింగ్‌లో ఉన్నప్పుడు ‘గేమ్ చేంజర్’ కోసం అడిగారు. అలా అందరి డేట్లు సెట్ చేసుకుని షూటింగ్ చేసే సరికి ఆలస్యం అయింది.

Also Readబిగ్ బాస్ 8 రన్నరప్‌గా నిలిచిన నిఖిల్... రెండో స్థానంలో నిలవడానికి కారణమైన మైనస్ పాయింట్స్‌ ఏంటి? అతని గేమ్‌లో ప్లస్ లేంటి?

రీ రిలీజ్‌ల విషయానికి వస్తే.. ప్రేక్షకులు ఎంకరేజ్ చేయడం వల్లే అవి జరుగుతున్నాయి. ‘ఖడ్గం’ రీ రిలీజ్‌ను థియేటర్లో చూశాను. కుర్రాళ్లంతా చాలా ఎంజాయ్ చేశారు. పెళ్లి సందడి చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా? అని అనుకుంటున్నా. నా కొడుకు రోషన్ ప్రస్తుతం ‘ఛాంపియన్’ చిత్రాన్ని చేస్తున్నాడు. మేం ఇద్దరం కలిసి ఇప్పట్లో అయితే నటించం. చిన్నోడు ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. చదువులు పూర్తయ్యాక సినిమాల్లోకే వస్తాడు.

నేను చేసే ఈ డిఫరెంట్ పాత్రలకి మూలం ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రం. ‘దేవర’ చిత్రంలో డిఫరెంట్ పాత్ర చేశా. ‘అఖండ’ టైంలోనూ కాస్త భయపడ్డాను. ప్రేక్షకులు ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రాన్ని రిసీవ్ చేసుకున్న తీరు చూశాక నాకు కాస్త ధైర్యం ఏర్పడింది. అందుకే  రెగ్యులర్ ఫిల్మ్స్ కాకుండా డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటోంది. ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటు గట్టు’లో మరో వైవిధ్య పాత్రలో నటిస్తున్నాను. కళ్యాణ్ రామ్ మూవీలో నటిస్తున్నాను. సుష్మిత గోల్డెన్ బాక్స్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Embed widget