By: ABP Desam | Updated at : 19 Feb 2023 04:49 PM (IST)
నటుడు నరేష్
సీనియర్ నటుడు నరేష్ విజయకృష్ణ (Actor Naresh) ఇంటిపై ఆదివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాళ్ళు రువ్వారు. ఈ ఘటనలో ఆయన పర్సనల్ కారవాన్ (Attack On Naresh Caravan) అద్దాలు ధ్వంసం అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...
కారవాన్ అద్దాలు ధ్వంసం
నానక్ రామ్ గూడాలోని విజయ టవర్స్ దగ్గర నరేష్, ఆయన కుమారుడు నవీన్ విజయకృష్ణ నివాసం ఉంటున్నారు. నటుడిగా నరేష్ బిజీ బిజీ. అందుకని, ఆయన తనకు ప్రత్యేకంగా ఓ కారవాన్ చేయించుకున్నారు. దానిని ఇంటి దగ్గర విజయ టవర్స్ (Actor Naresh Caravan) పార్క్ చేసి ఉంటారు. ఆదివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రాళ్ళతో దాడి చేయడంతో ఆయన కారవాన్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులకు నరేష్ పీఏ కుమార్ గౌడ్ ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల తన మూడో భార్య రమ్య రఘుపతిపై నరేష్ ఆరోపణలు చేశారు. ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దాడి జరగడంతో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నరేష్, రమ్య రఘుపతి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. సఖ్యత లేదు. ఆమె దూరంగా ఉంటున్న నరేష్, త్వరలో నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) తో ఏడు అడుగులు వేయనున్నారు. కొత్త ఏడాది సందర్భంగా ఆ విషయం వెల్లడించిన సంగతి తెలిసిందే.
లిప్ కిస్సుతో... కొత్త ఏడాదిలోకి!
''కొత్త ఏడాది... కొత్త ప్రారంభం... మీ అందరి అశీసులు కావాలి! మీ ఇద్దరి నుంచి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు - మీ పవిత్రా నరేష్'' అని ఈ రోజు నరేష్ ఓ ట్వీట్ చేశారు. అందులో ఓ వీడియో ఉంది. వీడియోలో ఏముంది? అని చూస్తే... నరేష్, పవిత్రా లోకేష్ కలిసి కేక్ కట్ చేశారు. ఆ తర్వాత వైన్ గ్లాసులు పట్టుకుని కనిపించారు. తర్వాత లిప్ కిస్ పెట్టుకున్నారు. అప్పుడు ''త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాం'' అని వీడియోలో అనౌన్స్ చేశారు. 'పవిత్రా లోకేష్' అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పోస్ట్ చేశారు.
Also Read : తారకరత్న వారసులు ఎంత మందికి తెలుసు? చిన్న కుమార్తె, కొడుకు గురించి...
నరేష్ (Actor Naresh Fourth Marriage) కు ఇది నాలుగో పెళ్ళి. నరేష్ మొదటి భార్య సంతానమే హీరో నవీన్ విజయ్ కృష్ణ. ఆయన మూడో భార్య రమ్య రఘుపతికి కూడా ఓ కుమారుడు ఉన్నారు. నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh Second Marriage) కు రెండో పెళ్ళి. ఐదేళ్ళ క్రితం సుచేంద్ర ప్రసాద్ నుంచి ఆమె విడాకులు తీసుకున్నారు.
Also Read : భుజాలపై మోయలేనంత భారం, ఒత్తిడి! ముఖంలో చెరగని చిరునవ్వు - అదే తారకరత్న అంటే
నరేష్, పవిత్రా లోకేష్ కొన్ని సినిమాల్లో భార్యాభర్తలుగా నటించారు. ఆ సినిమాల్లో 'సమ్మోహనం' సూపర్ హిట్. ఓటీటీలో విడుదలైన ఆలీ సినిమా 'అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలి' సినిమాలోనూ జంటగా కనిపించారు. ఎప్పుడో ప్రేమ చిగురించిందో... వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందంటూ నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి కొన్నాళ్ళ క్రితం ఆరోపణలు చేశారు. బెంగళూరులో పెద్ద హంగామా కూడా నడిచింది. తమకు మద్దతు ఇవ్వమని పవిత్రా లోకేష్ కోరడం కూడా చర్చనీయాంశం అయ్యింది.
Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?
Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !
NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ
Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్
Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా
Breaking News Live Telugu Updates: ఆకాశంలోకి LVM3 -M3 రాకెట్, ఏకంగా 36 ఉపగ్రహాలు మోసుకెళ్లిన వాహకనౌక
BRS PLan : మహారాష్ట్రలో రెండో సభ - ఇతర రాష్ట్రాలను బీఆర్ఎస్ చీఫ్ లైట్ తీసుకుంటున్నారా ?
BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే