News
News
X

Tarakaratna Career: భుజాలపై మోయలేనంత భారం, ఒత్తిడి! ముఖంలో చెరగని చిరునవ్వు - అదే తారకరత్న అంటే

ఎప్పుడూ ఎలాంటి వివాదాల్లో చిక్కుకోని వైనం, వినయంతో కూడిన మాట తీరు వల్ల ఆయన పట్ల జనంలో ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడింది. ఆయన కెరీర్ మొత్తం తీవ్రమైన ఒత్తిడిలోనే కొనసాగడం గమనార్హం!!

FOLLOW US: 
Share:

నటుడు, నందమూరి కుటుంబ సభ్యుడు తారకరత్న చిన్న వయస్సులోనే మృతి చెందడం ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురి చేసింది. ఆయనతో పరిచయం లేని వారిని సైతం తారకరత్న ఆకస్మిక మృతి దిగ్భ్రాతికి గురి చేసింది. బహుశా ఎప్పుడూ ఎలాంటి వివాదాల్లో చిక్కుకోని వైనం, వినయంతో కూడిన మాట తీరు వల్ల ఆయన పట్ల జనంలో ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడినట్టు విశ్లేషకులు అంటున్నారు. కానీ ఆయన కెరీర్ మొత్తం తీవ్ర మైన ఒత్తిడిలోనే కొనసాగడం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగా సినీ ప్రవేశం?
2001 మే లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు నందమూరి తారక రామారావు అలియాస్ జూ.NTR. ఏకంగా రామోజీ రావు నిర్మాత గా వీ.ఆర్. ప్రతాప్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా ఆడలేదు. అయితే.. Jr.ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ పూనుకుని రాఘవేంద్ర రావుకు అప్పగించారు. ఫలితంగా రాఘవేంద్ర రావు - అశ్వనీ దత్ లు నిర్మాతలుగా స్వప్న సినిమా బ్యానర్ పై నేటి దర్శక ధీరుడు SS రాజమౌళి తొలిసారి డైరెక్షన్ లో స్టూడెంట్ నెం.1 సినిమాలో హీరోగా NTR నటించారు. 2001 సెప్టెబరులో రిలీజ్ అయిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దానితో ఒక్కసారిగా అందరి దృష్టి NTR పై పడింది. ముఖ్యంగా తాత సీనియర్ ఎన్టీఆర్ పోలికలు కొట్టొచ్చినట్టు జూనియర్ లో కనిపిస్తుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానం పొందాడు. ఇక జూనియర్ వేసిన స్టెప్స్.. ఆయన నటన లోని ఈజ్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీనితో NTR మూడో తరం వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని ఫిక్స్ అయిపోయారు నందమూరి అభిమానులు. 

తరువాత అదే ఏడాది డిసెంబర్ లో వచ్చిన సుబ్బు డిజాస్టర్ అయ్యింది. అయితే మూడు నెలల గ్యాప్ లో 2002 మార్చ్ 28న రిలీజ్ అయిన ఆది సినిమాతో విశ్వరూపం చూపాడు NTR. దానితో మాస్ ప్రేక్షకులు కోరుకునే ఒక సాలిడ్ హీరో గా ఆయన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు.

ఒక్కసారిగా తెరపైకి తారకరత్న
జూనియర్ ఇలా తెరపై చెలరేగి పోవడంతో నందమూరి కుటుంబ సభ్యులు మరో వారసుడిని తెలుగు తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేశారు. కారణాలు ఏవైనా ఎందుకో జూనియర్ పట్ల నందమూరి కుటుంబ సభ్యులు మొదట్లో కాస్త దూరంగా మెలిగేవారనేది బహిరంగ రహస్యం. దానితో తమ నందమూరి నట వారసుడిగా మోహన కృష్ణ కుమారుడు తారక రత్నను ముందుకు తెచ్చారు. అత్యంత ఘనంగా ఒకేరోజు 9 సినిమాలను ప్రారంభించారు. అందులో చాలా వాటికి పేరున్న దర్శక నిర్మాతలను ఎంపిక చేశారు. అలా వచ్చిందే తారకరత్న మొదటి సినిమా ఒకటో నెంబర్ కుర్రాడు. ఈ సినిమాకు కోదండ రామిరెడ్డి దర్శకుడు కాగా కే. రాఘవేంద్ర రావు - అశ్వనీ దత్ లు నిర్మాతలు. M M కీరవాణి పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే.. ఒకే రోజు 9 సినిమాల ప్రారంభం అనేది వరల్డ్ రికార్డ్ అనీ.. నందమూరి వారసుడు అనీ ఒక విపరీతమైన హైప్ తారక రత్నపై ఏర్పడిపోయింది. 

ఇక అవునన్నా..కాదన్నా.. అప్పటికే మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయిన జూనియర్ తో పోలిక సరేసరి. ఇంత హై ప్రెషర్ లో సెప్టెంబర్ 2002లో  వచ్చిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. పాటలు సూపర్ హిట్ అయినప్పటికీ రొటీన్ కథ కావడంతో తారక రత్నకు కావాల్సిన కెరీర్ బూస్ట్ లభించలేదు. వెంటనే తన రెండో సినిమాగా ఉప్పలపాటి నారాయణ దర్శకత్వంలో నందమూరి వారి సొంత బ్యానర్ రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియోస్ బేనర్ పై యువరత్న సినిమా రిలీజ్ అయింది. తారక రత్న బాబాయ్ నందమూరి బాలకృష్ణ బిరుదు టైటిల్ గా.. నవంబర్ 2002లో వచ్చిన ఈ సినిమాకు MM కీరవాణి అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే సినిమా మాత్రం ఆడలేదు. నిజానికి ఈ సినిమా కథ బాగుందనే టాక్ వచ్చినా అప్పటికే మొదటి సినిమాపై వచ్చిన నెగిటివ్ టాక్ యువ రత్నపై తీవ్ర ప్రభావం చూపింది. 

తరువాత నాలుగు నెలల గ్యాప్ లో ఆయన మూడో సినిమాగా ఏప్రిల్ 2003లో  "తారక్ " సినిమా రిలీజ్ అయింది. అంతకుముందు ప్రియమైన నీకు లాంటి సూపర్ హిట్ తీసిన తమిళ డైరెక్టర్ బాలశేఖరన్ దర్శకత్వంలో ఆచంట గోపీనాథ్ నిర్మాతగా వచ్చిన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ ఒక ప్రధాన పాత్ర లో నటించారు. అయితే విచిత్రంగా ఈ సినిమాకు సరైన పబ్లిసిటీ చెయ్యలేదు. దానితో మంచి కాన్సెప్ట్ తో వచ్చిన తారక్ చిత్రం జనంలోకి వెళ్ళలేదు. మణిశర్మ అందించిన పాటలు హిట్ అయినా సినిమా మాత్రం ఆడలేదు.

కానీ విశ్లేషకులు మాత్రం మొదటి రెండు సినిమాలతో పోలిస్తే తారక రత్న నటన బాగుంది అని మాత్రం అభినందించారు. కానీ అప్పటికే సమయం మించి పోయింది. ఒకేరోజు మొదలు పెట్టిన మిగిలిన సినిమాల నిర్మాతలు మొఖం చాటెయ్యడంతో తారకరత్న తీవ్ర ఒత్తిడి లోకి వెళ్లారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అయినప్పటికీ ఎక్కడా ఒక్క వివాదాస్పద కామెంట్ గానీ, సహనం కోల్పోయి ప్రవర్తించడం గానీ తారకరత్న ఎన్నడూ చెయ్యలేదు. ఆ తరువాత ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించినా 2009 లో దర్శకుడు రవిబాబు రూపొందించిన అమరావతి సినిమాలో తారకరత్న పోషించిన విలన్ పాత్ర ఆయనకు ఏకంగా నంది అవార్డ్ ను తెచ్చి పెట్టింది. దానితో కెరీర్ టర్నింగ్ అవుతుంది అని ఆశ పడినా ఎందుకో గానీ తారక్ రత్న కు సరైన క్యారెక్టర్స్ పడలేదు. 

అదే ఏడాది జూనియర్ ను ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు ఆహ్వానించడంతో నందమూరి వారసుడిగా జూనియర్ NTR కు రాజముద్ర పడిపోయినట్లు అయింది. దానితో తారకరత్న సినీ ఇండస్ట్రీలో తన ప్రయత్నాలు తాను చెయ్యడం మొదలు పెట్టారు. కొన్ని సినిమాల్లో హీరోగా కొన్ని సినిమాల్లో నెగిటివ్ పాత్రల లోనూ నటిస్తూ వచ్చారు. ఇటీవల 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించారు. ప్రస్తుతం అంతా OTT లదే రాజ్యం కావడంతో అటువైపు బిజీ అవుతూనే.. మరోవైపు రాజకీయాల్లోనూ తెలుగుదేశం తరపున బిజీ కావాలని అనుకున్నారు. అందులో భాగంగా ఇటీవల నారా లోకేష్ పాదయాత్ర లో పాల్గొనడానికి కుప్పం వెళ్లిన ఆయన తొలిరోజు పాదయాత్ర లో ఒక్కసారిగా కుప్పకూలి పోయి, హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు.

మొదటి నుండి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్న తారకరత్న 
గొప్ప చరిత్ర గల కుటుంబంలో పుట్టిన తారకరత్నకు అదే వరం.. అదే శాపం అయిందా అనే విశ్లేషణలు వినవస్తున్నాయి. సడన్ గా తెరమీదకు రావడం ఒకేసారి 9 సినిమాల ప్రారంభం అనే హైప్.. నందమూరి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత.. తమ కుటుంబ సభ్యుడైన మరో హీరోతో పోటీ పడాల్సి రావడం, సరైన హిట్ దొరకక పోవడం ఇవన్నీ ఆయనపై ఒత్తిడిని పెంచి ఉండవచ్చని ఆయన సన్నిహితులు అంటున్నారు. అయినప్పటికీ ఆ భారాన్ని అంతా తానే భరించారు తప్ప మొఖంలో ఎన్నడూ చిరునవ్వును చెరగ నీయలేదనీ అలాగే తనను కలవడానికి వచ్చిన ప్రతీ ఒక్కరితోనూ ఎంతో సాదరంగా మాట్లాడేవారనీ వారు చెబుతున్నారు. అందుకే ఆయన మరణ వార్త వినగానే పార్టీల కతీతంగా ప్రతీ ఒక్కరూ బాధ పడుతున్నారని అంటున్నారు. తెలుగు ప్రజల నుండి నందమూరి తారకరత్న మృతి పట్ల వస్తున్న స్పందన చూస్తుంటే అది నిజమే అని అనిపిస్తుంది కూడా!

Published at : 19 Feb 2023 12:03 PM (IST) Tags: Nandamuri TarakaRatna Tarakaratna career Tarakaratna movies list tarakaratna songs okato number kurradu

సంబంధిత కథనాలు

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

టాప్ స్టోరీస్

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే