Anasuya Bharadwaj : "పుష్ప 2"పై పిచ్చ హైప్ పెంచిన అనసూయ... బిగ్ బాస్ స్టేజ్‌పై నాగ్‌తో కలిసి 'పుష్ప 2' అప్డేట్ ఇచ్చిన యాంకర్
Pushpa 2 : "పుష్ప 2" మూవీ గురించి తాజాగా బిగ్ బాస్ 8 తెలుగు వేదికపై అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె ఈ మూవీ గురించి ఏం చెప్పిందో తెలుసుకుందాం పదండి.

Anchor Anasuya bharadwaj About Pushpa 2 : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ "పుష్ప". ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు "పుష్ప 2" అంటూ ఈ మూవీకి సీక్వెల్ ను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకగా, తాజాగా అనసూయ భరద్వాజ్ బిగ్ బాస్ షోలో ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించి సినిమాపై పిచ్చ హైప్ పెంచేసింది.
ప్రస్తుతం "పుష్ప 2 : ది రూల్" మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. రీసెంట్ గా మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి ఈ మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేయబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ప్రమోషన్స్ నవంబర్లో మొదలవుతాయని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి మీడియా ముఖంగా వెల్లడించారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ చేసిన జాతర పోస్టర్ తో పాటు చిన్న చిన్న ప్రమోషనల్ కంటెంట్ ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసింది. అలాగే ఈ మూవీకి ఇప్పటికే 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటూ నిర్మాతలు వెల్లడించిన విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే "పుష్ప 2"కు సంబంధించి ఎలాంటి వార్త బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా బిగ్ బాస్ స్టేజ్ పై స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన అనసూయ భరద్వాజ్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.
ఇదిలా ఉండగా "పుష్ప 2" మూవీ త్వరలోనే థియేటర్లోకి రానున్న నేపథ్యంలో ఇంకా మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. కానీ ఈ సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ నుంచి మొదలు పెట్టి నటీనటుల వరకు ప్రతి ఒక్కరు తమ కామెంట్స్ తో విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా అనసూయ భరద్వాజ్ "పుష్ప 2" మూవీపై బిగ్ బాస్ సీజన్ 8 దీపావళి ఈవెంట్ సందర్భంగా భారీగా హైప్ ఇచ్చే కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ స్టేజ్ పై తన పర్ఫామెన్స్ తో అదరగొట్టిన అనసూయ ఆ తర్వాత నాగార్జున అడగడంతో "పుష్ప 2" మూవీ గురించి చెప్పుకొచ్చింది. నాగార్జున అనసూయతో మాట్లాడుతూ "పుష్ప సినిమాలో మంగళం శ్రీనును లేపేస్తాను అంటూ బెదిరిస్తున్నావు. ఈ సినిమాలో నీ క్యారెక్టర్ తో దడిపిస్తున్నావు" అంటూ కాసేపు నాగార్జున అనసూయను టీజ్ చేశారు. ఆ తరువాత నాగార్జున అనసూయను సినిమా గురించి ప్రశ్నించారు.
Asal katha ipudu start avutundi 🥵🔥
— Allu Arjun TFC™ (@AlluArjunTFC) October 27, 2024
Em plan chesar sir @aryasukku @alluarjun #Pushpa2TheRule @anusuyakhasba pic.twitter.com/RnjT5OnPPk
'మీరు వెనక ఉంటా అంటే చెప్పేస్తాను అంటూ అనసూయ నవ్వింది. 'నేను ఇక్కడే ఉంటాను.. ఎక్కడికి వెళ్ళను' అంటూ నాగార్జున పంచ్ వేశారు. ఆ తర్వాత అనసూయ 'పుష్ప ది రైజ్ ఇప్పుడు పుష్ప రూల్... రూల్ చేస్తాడు. ప్రతి పది నిమిషాలకు ఈ సినిమాలో గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు ఉంటాయి. అది కూడా ఒక్కో సీన్ చూస్తుంటే క్లైమాక్స్ చూస్తున్నామా అన్నంత హైప్ ఉండేలా ప్లాన్ చేశారు. అదిరిపోయే సీక్వెన్స్ సినిమాలో ప్రతి పది నిమిషాలకు చూడొచ్చు" అంటూ అనసూయ "పుష్ప 2" మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ ఈ సినిమాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మూవీ రిలీజ్ కి ముందే ఇలా ఉంటే రిలీజ్ అయ్యాక రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో!
Also Read: ప్రెస్‌మీట్‌కు తాగి వచ్చిన నటుడు... పిచ్చి పిచ్చి మాటల వెనుక కారణం అదేనా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

