By: ABP Desam | Updated at : 12 Apr 2022 06:24 PM (IST)
'ఆచార్య'లో రామ్ చరణ్, చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన చిత్రం 'ఆచార్య' (Acharya Movie). కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. యూట్యూబ్‌లోకి లేటుగా వచ్చింది కానీ... థియేటర్లలో ముందుగా విడుదలైంది. ఆల్రెడీ ట్రైలర్ చూసిన మెగాభిమానులకు తమకు సినిమా ఫుల్ కిక్ ఇచ్చేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. థియేటర్లలో రచ్చ రచ్చ చేశారు. సినిమా విడుదలైనప్పుడు మరింత రచ్చ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలా?
ఇక, 'ఆచార్య' ట్రైలర్ విషయానికి వస్తే... ప్రారంభంలో రామ్ చరణ్, పూజా హెగ్డే జోడీని చూపించారు. దేవాలయాల్లో పూజలు చేసే వ్యక్తిగా చరణ్ కనిపించారు. 'ఇక్కడ అందరూ సౌమ్యులు. పూజలు పునస్కారాలు చేసుకుంటూ... కష్టాలు వచ్చినప్పుడు అమ్మోరు తల్లి మీద భారం వేసి బిక్కు బిక్కు మని ఉంటామేమో అని బ్రమ పడి ఉండొచ్చు. ఆపద వస్తే ఆ అమ్మోరు తల్లి మాలో ఆవహించి ముందుకు పంపుద్ది' అని చరణ్ డైలాగ్ (Ram Charan dialogues in Acharya) చెబుతుంటే థియేటర్ దద్దరిల్లింది. ఒక్కటే ఈలలు, చప్పట్లు, గోల. 'ధర్మస్థలి అధర్మస్థలి ఎలా అవుతుంది?' అంటూ చరణ్ ప్రశ్నించడం, ఫైట్ చేయడం యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంది.
మెగాస్టార్ చిరంజీవి ట్రైలల్‌లో కాస్త లేటుగా వచ్చినా... ఆయన ఎంట్రీ లేటెస్టుగా ఉంది. 'పాదఘట్టం వాళ్ళ గుండెల మీద కాలు వేస్తే... ఆ కాలు తీసేయాలి. కాకపోతే అది కాలా? అని!', 'నేను వచ్చానని చెప్పాలనుకున్నా. కానీ, చేయడం మొదలు పెడితే...' అనే చిరు డైలాగ్స్ (Chiranjeevi dialogues in Acharya) సూపర్ అంటున్నారు ఫ్యాన్స్. ట్రైలర్ చివర్లో చిరంజీవి, రామ్ చరణ్ కనిపించే సీన్స్ అయితే మెగాభిమానులకు డబుల్ బొనాంజా.
A truly special film with My SIDDHA ♥️ & Your Mega Powerstar @AlwaysRamCharan.
Here's #AcharyaTrailer.
▶️ https://t.co/EMzTX3C6np#AcharyaOnApr29 #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja @SonuSood @MatineeEnt @KonidelaPro @adityamusic— Acharya (@KChiruTweets) April 12, 2022
చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. రామ్ చరణ్ 'చిరుత', 'రచ్చ' సినిమాలకూ మణి హిట్ సాంగ్స్ ఇచ్చారు. మరోసారి 'ఆచార్య'కు ఆయన సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన 'నీలాంబరి...', 'లాహే లాహే లాహే...', 'సానా కష్టం...' పాటలకు మంచి స్పందన లభించింది.
చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల (Surekha Konidala) సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి 'ఆచార్య' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు. ఈ నెల 29న సినిమా (Acharya On Apr29) విడుదల కానుంది.
Also Read: తెలంగాణలో 'కెజియఫ్ 2' టికెట్ రేట్స్ పెరిగాయ్, రోజుకు ఐదు షోలు
Also Read: మహేష్ ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్- ఒక్క పాట పూర్తైతే చాలు పండగే
Muthiah Muralidharan: ఆయన కెప్టెన్ అయితే బాగుంటుంది: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ గురించి ముత్తయ్య మురళీధరన్ కామెంట్స్
Jawan: రూ.1000 కోట్ల క్లబ్ లో 'జవాన్'.. చరిత్ర సృష్టించిన కింగ్ ఖాన్!
Chandramukhi 2: 480 ఫైల్స్ మిస్ అయ్యాయి.. అందుకే 'చంద్రముఖి 2' చిత్రాన్ని వాయిదా వేశాం: పి.వాసు
Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?
Chandrababu Naidu Arrest: ఆయనకు ఒక గుణపాఠం, చంద్రబాబు అరెస్ట్పై హీరో సుమన్ స్ట్రాంగ్ రియాక్షన్
Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం
చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత
/body>