అన్వేషించండి

Aamir Khan: చెన్నై వరదల్లో చిక్కుకున్న అమీర్ ఖాన్, విష్ణు విశాల్ - 24 గంటల తర్వాత సాయం!

Vishnu Vishal: తాజాగా కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ట్విటర్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. అందులో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూడా చెన్నై వరదల్లో చిక్కుకుపోయినట్టు కనిపిస్తోంది.

Chennai Floods: తమిళనాడు రాజధాని చెన్నైను వరదలు ముంచేస్తున్నాయి. గతంలో జరిగినట్టుగానే ఇప్పుడు కూడా చెన్నై ప్రజలు తుఫాన్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి ‘మిగ్‌జాం’ తుఫాను.. అక్కడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. అందుకే తుఫాన్‌ను చిక్కుకుపోయిన ప్రజలను కాపాడడం కోసం సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. అంతే కాకుండా వారితో పాటు మరికొందరు ప్రజలు కూడా ఇతరులను కాపాడడానికి ముందుకొస్తున్నారు. తాజాగా చెన్నై వరదల్లో చిక్కకుపోయిన బాలీవుడ్ హీరో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్‌ను సహాయక బృందాలు కాపాడాయి. 

24 గంటల తర్వాత..
అమీర్ ఖాన్ ఉన్న ప్రాంతంలో పూర్తిగా వరద నీరు నిండిపోవడంతో తను నీరు, కరెంటు లేకుండా ఒకే దగ్గర చిక్కకుపోయాడు. వరదల వల్ల అమీర్ ఉన్న ప్రాంతంలో పెద్దగా ఫోన్ సిగ్నల్ కూడా లేదని సమాచారం. కరపాక్కం ఏరియాలో దాదాపు 24 గంటలు ఉన్న తర్వాత సహాయక బృందాలు తనను కాపాడాయి. ఈ విషయం కోలీవుడ్ హీరో విష్ణు విశాల్.. తన ట్విటర్ ద్వారా బయటపెట్టారు. అమీర్ ఖాన్.. చెన్నైకు వచ్చి విష్ణు విశాల్ ఇంట్లోనే ఉన్నాడని సమాచారం. ఈ విషయం విష్ణూ విశాల్ బయట పెట్టకపోయినా.. తమరిని వరదల నుంచి కాపాడాలని, సురక్షితమైన ప్రదేశానికి తరలించాలని.. తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.

కరెంటు లేదు, వైఫై లేదు, ఫోన్ సిగ్నల్ లేదు..
‘‘నా ఇంట్లోకి నీరు చేరుకుంటుంది. కరపాక్కంలో నీటి పారుదల పెరుగుతూ వస్తోంది. నేను సహాయం కోసం ఫోన్ చేశాను. కరెంటు లేదు, వైఫై లేదు, ఫోన్ సిగ్నల్ కూడా లేదు. ఏదీ లేదు. టెర్రస్‌పైన ఒకచోటిలో మాత్రమే కొంచెం సిగ్నల్ వచ్చింది. నాతో పాటు ఇక్కడ ఉన్న చాలామందికి సాయం దొరుకుతుందని కోరుకుంటున్నాను. చెన్నై ప్రజలంతా ఎంత ఇబ్బందులు పడుతున్నారో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను’’ అని సహాయం కోసం తన ట్విటర్‌లో షేర్ చేశాడు విష్ణు విశాల్. ఆ తర్వాత సహాయక బృందాలు వచ్చి అతడిని కాపాడాయి. ‘‘మాలాగే చిక్కుకుపోయిన ప్రజలకు సాయం చేస్తున్నందుకు ఫైర్, సహాయక సిబ్బందులకు థ్యాంక్స్. కరపాక్కం సహాయక చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే 3 పడవలు ఇందులో పాల్గొనడం చూశాను. ఇలాంటి సమయంలో తమిళనాడు ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తోంది. ఈ సమయంలో విరామం లేకుండా పనిచేస్తున్న అందిరికీ థ్యాంక్స్’’ అని చెప్పుకొచ్చాడు.

తల్లి ట్రీట్మెంట్ కోసం..
తన ఇంటి దగ్గర నీరు నిండిపోయిన ఫోటోలతో పాటు సహాయక బృందాలు తమను కాపాడిన తర్వాత దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో విష్ణు విశాల్, తన భార్య జ్వాలా గుత్తాతో పాటు అమీర్ ఖాన్ కూడా కనిపించాడు. చెన్నైలో అమీర్ ఖాన్ తల్లికి ట్రీట్మెంట్ జరుగుతుండగా.. కొంతకాలం క్రితమే ఈ హీరో అక్కడికి షిఫ్ట్ అయిపోయాడు. అయితే అప్పటినుంచి ఆయన విష్ణు విశాల్‌తోనే కలిసుంటున్నాడని సోషల్ మీడియాలో షేర్ అయిన ఫోటోలు చూస్తుంటే అనిపిస్తుందని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా తన తల్లి ట్రీట్మెంట్‌పై ఫోకస్ పెట్టాడు అమీర్ ఖాన్.

Also Read: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Best Smart TV Under Rs 20000: రూ.20 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే - 43 అంగుళాల భారీ డిస్‌ప్లేతో!
రూ.20 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే - 43 అంగుళాల భారీ డిస్‌ప్లేతో!
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget