Aadi Saikumar: 'శంబాల' కాంబో రిపీట్... కానీ ట్విస్ట్ ఏంటంటే?
Aadi Saikumar New Movie: 'శంబాల' సక్సెస్ తో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఆది సాయికుమార్... ఆ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. కానీ, ఓ ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే?

'శంబాల' బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో హీరో ఆది కెరీర్‌తో పాటుగా, షైనింగ్ పిక్చర్స్ బ్యానర్, నిర్మాతలు మహిధర్, రాజశేఖర్‌లతో పాటుగా దర్శకుడు యుగంధర్ ముని కెరీర్ కూడా టాప్ పొజిషన్‌కి వెళ్లాయి. శంబాల కలిపిన వీరి బంధం చాలా గట్టిగానే ఉంది. ఆది వేరే బ్యానర్లో సినిమా చేస్తున్నా... యుగంధర్ ముని వేరే హీరోతో సినిమా చేస్తున్నా... నిర్మాతలు మాత్రం కామన్‌గానే ఉంటున్నారు. వీరంతా కలిసి మరో ప్రాజెక్ట్ చేసేందుకు సిద్దమయ్యారు. అయితే ఈ సారి దర్శకుడు యుగంధర్ మాత్రం సమర్పకుడిగా మారాడు. ఇదే ఇక్కడి ట్విస్ట్.
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మాతలుగా యుగంధర్ ముని సమర్పణలో ఆది హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి బృందా రవీందర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీతోనే బృందా రవీందర్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. ఇదొక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే హారర్ సినిమా అని చెబుతున్నారు. ఈ మూవీకి సౌండింగ్ ప్రాణం అని, అందుకే శ్రీ చరణ్ పాకాలనే మళ్లీ తీసుకున్నామని కూడా టీం చెబుతోంది. శంబాల సినిమాకి శ్రీ చరణ్ ఎలాంటి సౌండింగ్ ఇచ్చాడో అందరికీ తెలిసిందే.
Also Read: Mouni Roy Divorce - డబ్బులు వాడుకున్నాడు... మోసం చేశాడు... మౌనీ రాయ్ విడాకుల వెనుక కారణాలు అవేనా?
ఈ క్రమంలో రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో ఆది సాయి కుమార్ ఇంటెన్స్ లుక్, రక్తం కారుతున్న తీరు, చుట్టూ ఉన్న పువ్వులు, ఆకులు, కనిపిస్తున్న పాత కాలం నాటి స్టాంప్ ఇవన్నీ చూస్తుంటే ఓ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకు వెళ్లేలా కనిపిస్తున్నారు. కాన్సెప్ట్ పోస్టర్‌తోనే ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. మరి ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామని టీం చెబుతోంది.
Also Read: Nani Paradise - పుకార్లకు చెక్ పెట్టిన ప్యారడైజ్ టీమ్... గట్టిగా ఇచ్చిపడేసిన నాని & కో
ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా ఎవరు వస్తారో.. విలన్‌గా ఎవరు నటిస్తారో చూడాలి. సినిమా షూటింగ్, విడుదలకు సంబంధించిన ఇతర వివరాల్ని కూడా తెలియాల్సి ఉంది. ఆది కెరీర్ ప్రస్తుతం నేషనల్ హైవేపై వంద స్పీడులో వెళ్తున్నట్టుగా ఉంది. వరుస ప్రాజెక్టులతో ఆది బిజీగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే.
Photo Gallery: Chiranjeevi Latest Photoshoot - బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
ట్రెండింగ్ వార్తలు






















