8 Vasantalu: '8 వసంతాలు'లో 'మ్యాడ్' భామ అనంతిక - ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఖరారు
8 VasantaluFirst Look: '8 వసంతాలు' సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం (జూన్ 7వ తేదీ) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ఇందులో అనంతిక నటిస్తున్న విషయాన్ని రేపే చెబుతారు.
Ananthika Sanilkumar First Look From 8 Vasantalu: 'మ్యాడ్' సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా పరిచయం అయ్యారు. ఆయనకు జోడీగా నటించిన అమ్మాయి గుర్తు ఉందా? అనంతిక సనీల్ కుమార్! మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ 'లాల్ సలాం'లో కూడా నటించింది. ఇంటర్ చదవుతున్న ఆమె వయసు అప్పట్లో డిస్కషన్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు ఆ అనంతిక ఓ క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం (జూన్ 7న) ఉదయం 11 గంటలకు ఆ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.
My next 8 వసంతాలు (8 Vasantālu )❤️
— Ananthika Sanilkumar (@Ananthika108) February 14, 2024
Written and Directed by @phanindranarsetti
Produced by @MythriOfficial pic.twitter.com/V8ChcyBaPZ
మధురం, మను' ఫేమ్ ఫణింద్ర దర్శకత్వంలో...
'మధురం' షార్ట్ ఫిల్మ్ గుర్తుందా? సోషల్ మీడియా అంతగా పాపులర్ కాని రోజుల్లో ఎంతో మంది యువత మనసు దోచిన ఇండిపెంట్ ఫిల్మ్. దాంతో చాందిని చౌదరి పేరు తెచ్చుకున్నారు. ఆ 'మధురం'కు దర్శకత్వం వహించినది ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti). ఆ తర్వాత లెజెండరీ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా 'మను' సినిమా తీశారు. అందులోనూ తెలుగమ్మాయి చాందిని చౌదరి కథానాయిక. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, కొంతమంది విమర్శలను ఆ సినిమా ఆకట్టుకుంది. అది వచ్చిన ఆరేళ్ళకు దర్శకుడు ఫణింద్ర కొత్త సినిమాతో వస్తున్నారు. అదే '8 వసంతాలు'. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
Ananthika Sanilkumar Pre Look In 8 Vasantalu Movie: ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెలుగు చిత్రసీమలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న '8 వసంతాలు' సినిమాలో అనంతిక సనీల్ కుమార్ (Ananthika Sanilkumar) మెయిన్ లీడ్. శుక్రవారం (జూన్ 7వ తేదీ ఉదయం) ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. 'మీరు తనను రేపు చూస్తారు' అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ఒక ప్రీ లుక్ విడుదల చేసింది.
Also Read: 'మనమే' ఫస్ట్ రివ్యూ... ఒక్క బోర్ మూమెంట్ లేదు, పక్కా హిట్ - శర్వా సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Tomorrow at 11:07 AM ❤️
— Mythri Movie Makers (@MythriOfficial) June 6, 2024
Stay tuned to @MythriOfficial#8Vasantalu pic.twitter.com/BdMFnPUIsq
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న '8 వసంతాలు' సినిమా పోస్టర్ విడుదల చేశారు. ''365 రోజులను అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం. ఒకవేళ అంకెలతో కాకుండా అనుభవాలతో కొలిస్తే... ఒక వసంతం'' అంటూ '8 వసంతాలు' మూవీ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఓ ప్రేమ జంట మధ్య ఎనిమిదేళ్లలో జరిగిన సంఘటనల సమాహారమే చిత్రకథ అని చెప్పారు. జూన్ 8న సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Also Read: పవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా