Chiranjeevi Net Worth: కోట్ల విలువైన బంగ్లా, విలాసవంతమై ప్రైవేట్ జెట్ - చిరంజీవి లైఫ్ స్టైల్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
చిరంజీవి తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ మూవీకి గాను ఆయన కెరీర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇంతకీ ఆయన సినిమాల ద్వారా ఎంత సంపాదించారో తెలుసా?
చిరంజీవి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి టాప్ హీరోగా ఎదిగారు. ఎన్నో ఇండస్ట్రీ హిట్లతో మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఈ 67 నటుడు 150కి పైగా సినిమాలు చేసి, ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. పద్మభూషణ్ లాంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. రూ.1,650 కోట్ల రూపాయల భారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చిరంజీవి ఆస్తుల వివరాలిలా ఉన్నాయి.
1. హైదరాబాద్ విలాసవంతమైన ప్యాలెస్
మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్ లోని 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీకి చెందిన ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైన్ సంస్థ రూ. 30 కోట్ల వ్యయంతో ఈ బంగ్లా నిర్మించింది. ఈ ఇంటీరియర్ హైదరాబాద్ నిజామీ స్టైల్ తో ఎక్కువగా ప్రభావితమయ్యింది. ఈ విలాసవంతమైన ప్యాలెస్ ఆధునిక సౌకర్యాలతో నిండి ఉంది. పెద్ద స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్టుతో పాటు పాతకాలపు డిజైన్లతో ఆకట్టుకుంటుంది. ఈ బంగ్లాలో పెద్ద ఫిష్ పాండ్, భారీ గార్డెన్ స్పేస్ ఉన్నాయి.
2. విలాసవంతమైన గృహాలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖులలో ఒకరైన చిరంజీవి, రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. బెంగళూరు, చెన్నైలలో కోట్ల విలువైన విలాసవంతమైన గృహాలను కూడా కలిగి ఉన్నాడు. 90వ దశకంలో ఆయన కొనుగోలు చేసిన ఫిలిం నగర్ భూమిని చిరంజీవి రూ. 70 కోట్ల రూపాయలకు ఇటీవల విక్రయించినట్లు తెలుస్తోంది.
3. సూపర్ లగ్జరీ వాహనాలు
మెగాస్టార్ చిరంజీవి రూ.9 - 10.50 కోట్ల విలువ చేసే సూపర్-లగ్జరీ రోల్స్ రాయిస్ ఫాంటమ్‌ను కలిగి ఉన్నారు. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, రేంజ్ రోవర్ వోజ్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి అనేక ఇతర ఖరీదైన వాహనాలను కలిగి ఉన్నారు.
4. కోట్ల విలువైన ప్రైవేట్ జెట్
దేశంలో విలాసవంతమైన ప్రైవేట్ జెట్‌ను కలిగి ఉన్న అతికొద్ది మంది నటులలో చిరంజీవి ఒకరు. ఈ జెట్ కోసం ఆయన కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలుస్తోంది.
5. ప్రొడక్షన్ హౌస్
1988లో చిరంజీవి తన సోదరుడు నాగేంద్రబాబుతో కలిసి తన సొంత ప్రొడక్షన్ హౌస్ - అంజనా ప్రొడక్షన్స్‌ని ప్రారంభించారు. వారి తల్లి అంజనా దేవి పేరుతో నెలకొల్పిన ఈ ప్రొడక్షన్ హౌస్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ బ్యానర్‌లలో ఒకటిగా పేరుపొందింది.
6. కేరళ బ్లాస్టర్స్ (ISL జట్టు) సహ యజమాని
ఇండియన్ సూపర్ లీగ్ (ఫుట్‌బాల్ లీగ్)లోనూ చిరంజీవి పెట్టుబడులు పెట్టారు. దేశీయ ఫుట్‌బాల్ లీగ్‌లో ఒక జట్టును (కేరళ బ్లాస్టర్స్) కొనుగోలు చేయడానికి టాలీవుడ్ సూపర్ స్టార్ నాగార్జున, సచిన్ టెండూల్కర్‌లతో చేతులు కలిపారు.
7. చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంకులు
1998లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సహాయం చేస్తున్నారు. దేశంలో అనేక ఆపరేషనల్ బ్లడ్, ఐ బ్యాంకులు ప్రారంభించారు. చిరంజీవి తన అభిమానుల ద్వారా రక్తదానం చేయించడం ద్వారా అసరమైన వారికి రక్తం అందిస్తున్నారు.
8. చిరంజీవి మొత్తం ఆస్తుల విలువ
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధికంగా సంపాదిస్తున్న నటుల్లో ఒకరైన చిరంజీవి, ఓ నివేదిక ప్రకారం రూ.1,650 కోట్ల రూపాయల భారీ సామ్రాజ్యాన్ని నిర్మించారు.
View this post on Instagram
Read Also: ఓ మై గాడ్ - ‘వాల్తేరు వీరయ్య’ కోసం చిరంజీవి, రవితేజ అంత రెమ్యునరేషన్ తీసుకున్నారా?