Bigg Boss Telugu Fame Sarayu: బిగ్ బాస్ కంటెస్టెంట్ పై పోలీస్ కేసు
బిగ్ బాస్ ఫేమ్ సరయుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
యూట్యూబర్ 7 ఆర్ట్స్ సరయు తన కంటెంట్ తో బాగా పాపులర్ అయింది. బోల్డ్ వీడియోలను రూపొందిస్తూ.. యూత్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా ఆమెని తీసుకున్నారు. దీంతో హౌస్ లో బూతులు వినిపించడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ హౌస్ లోకి ఎంటర్ అయిన వారంలోనే ఆమె ఎలిమినేట్ అయిపోయింది. ఆ సమయంలో షణ్ముఖ్-సిరిలను టార్గెట్ చేస్తూ సరయు చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ బ్యూటీ ఓ వివాదంలో చిక్కుకుంది. హోటల్ ప్రమోషన్ కోసం తీసిన పాటలో విజువల్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సరయుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 7 ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ కోసం గతేడాది సరయు తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియో రిలీజ్ చేసింది.
ఇందులో సరయు, ఆమె టీమ్ అందరూ తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లను ధరించారు. దేవుడి రిబ్బన్లను ధరించి మద్యం సేవించినట్లుగా వీడియోను రూపొందించారు. హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఈ వీడియో ఉందంటూ సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు అశోక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరి దీనిపై సరయు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం ఈమెకి ఒకట్రెండు సినిమా ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది. లీడ్ రోల్ లో కూడా సినిమాలు చేస్తుంది సరయు.
View this post on Instagram