Bigg Boss 8 Telugu Nominations: వెంట్రుక వాసిలో తప్పించుకున్న నైనిక... ఈ వీక్ నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్స్
బిగ్ బాస్ సీజన్ 8కు సంబంధించిన 4వ వారం నామినేషన్స్ లో నైనిక జస్ట్ మిస్ అయ్యింది. అది కూడా నిఖిల్ కారణంగా. మరి నిఖిల్ సోనియాను కాకుండా ఆమెనుకు ఎందుకు సేవ్ చేశాడో తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం నాలుగవ వారానికి చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నాలుగవ వారానికి సంబంధించిన నామినేషన్ పూర్తి కాగా, కంటెస్టెంట్స్ ముఖానికి మాస్కులు వేసుకొని ఆడుతున్నట్టుగా అనిపించింది. మొదటి వారం నుంచి తమ మధ్య ఉన్న మనస్పర్ధలను నెమ్మదిగా నామినేషన్స్ లో బయటకు తీస్తున్నారు బిగ్ బాస్ హౌస్ మేట్స్. ఇక ఈ వారం మొత్తం రివేంజ్ నామినేషన్సే నడిచాయి. అయితే నిఖిల్ కారణంగా నైనిక రెప్పపాటున సేవ్ అయింది. కానీ హౌస్ మేట్స్ అందరూ నిఖిల్, పృథ్వీ, సోనియా గ్రూప్ నే టార్గెట్ చేస్తున్నారు. నామినేషన్లలో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చూపించారు.
ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే?
సోనియా సొంతంగా గేమ్ ఆడలేదని, పృథ్వి, నిఖిల్ తో కలిసి గ్రూప్ గేమ్ ఆడుతోంది అంటూ నబిల్ సోనియాను, ఆవేశాన్ని తగ్గించుకోవాలంటూనే, సంచాలక్ గా ఉన్నప్పుడు తన పట్ల వ్యవహరించిన తీరు నచ్చలేదని చెప్పి పృథ్వీని నామినేట్ చేశాడు. ఆదిత్య ఓం మొదటి మూడు రోజులు కనిపించిన సోనియా ఇప్పుడు కనిపించట్లేదు అంటూ సోనియాను, ఇన్సల్ట్ గట్టిగా చేసినప్పుడు సారీ కూడా అంతేగా గట్టిగా చెప్పాలని, అది తనకు వినిపించలేదని పృథ్వీని నామినేట్ చేశారు. ఇక సోనియా.. నబిల్ తనపై చేసిన కామెంట్స్ ను తిప్పికొడుతూ, అనడమే కాదు తీసుకునేట దమ్ము కూడా నాకుంది అంటూ నబిల్ ముఖం వాడిపోయేలా సమాధానం చెప్పింది. ఇక నబిల్ తో పాటు తనను నామినేట్ చేసిన మరో కంటెస్టెంట్ ఆదిత్య ఓంను "మీరు హౌస్ లో ఎక్కడా కనిపించట్లేదు. పైగా ఈ వీక్ మీరు వెళ్లిపోతాను అన్నారు కదా.. వెళ్ళిపోండి" అంటూ నామినేట్ చేసింది. ఆయన పెద్దగా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ తర్వాత ప్రేరణ.. మణికంఠను, నైనికను నామినేట్ చేసింది. నైనిక మణికంఠను, ఆదిత్య ఓంను నామినేట్ చేసింది. పృథ్వీ.. మణికంఠను, ఆదిత్య ఓంను నామినేట్ చేశారు. కిరాక్ సీత.. ప్రేరణను, మణికంఠను నామినేట్ చేసింది. విష్ణు ప్రియ.. ప్రేరణను, ఆదిత్యను నామినేట్ చేసింది. ఇక చివరిగా యష్మి గౌడ మరోసారి నువ్వు స్ట్రాంగ్ కాదంటూ మణికంఠను నామినేట్ చేసింది. ఇద్దరి మధ్య కాసేపు హీటెడ్ డిస్కషన్ నడిచింది. ఎప్పటిలాగే యష్మి గౌడ ఇటు మణికంఠను, సోనియాను రెచ్చగొట్టే పని పెట్టుకుంది. పైగా సోనియా విషయంలో "వాళ్ళిద్దర్నీ అడ్డు పెట్టుకుని ఆడుతున్నావు, నువ్వు ఒంటరిగా ఆడలేవా" అంటూ నోటికి పని చెప్పింది. దీంతో సోనియా కూడా "నువ్వు ఎప్పుడు పృథ్వీనే చూస్తావు, మిగతాది చూస్తే తెలుస్తుంది" అంటూ రివర్స్ కౌంటర్ వేసింది. అక్కడితో ఆగకుండా యష్మి గౌడ "అవును.. నేను వాడినే చూస్తాను. కానీ నా గేమ్ వచ్చినప్పుడు నేను ఆడతాను" అంటూ అంతే దీటుగా సమాధానం చెప్పింది. మొత్తానికి ఈ వీక్ నామినేషన్స్ రివేంజ్ నామినేషన్స్ గా మిగిలాయి.
Also Read: ఏపీ కంటే తక్కువ కానీ... తెలంగాణలో 'దేవర' టికెట్ రేట్లు ఎంత పెరిగాయో తెలుసా?
నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరెవరంటే ?
ఈ తాజా నామినేషన్స్ లో బిగ్ బాస్ 3 వారాలు ఒకరినొకరు చూసారు కాబట్టి హౌస్ లో ఉండడానికి ఎవరు అనర్హులో తెలుపుతూ వాళ్ళ ఫేస్ మీద ఫోమ్ స్ప్రే చేయాలని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే కంటెస్టెంట్స్ అందరూ చేశారు. ఇక ఈ వీక్ నామినేషన్ లో నబిల్, ప్రేరణ, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్ సోనియా, నైనిక, మణికంఠ నామినేట్ అయ్యారు. అయితే నిఖిల్ చీఫ్ కావడంతో ఆయనను ఎవ్వరూ నామినేట్ చేయకూడదని చెప్పిన బిగ్ బాస్ ప్రస్తుతం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఒకరిని సేవ్ చేసే పవర్ ను ఇచ్చారు. అయితే నిఖిల్ నైనికను సేవ్ చేస్తూ, ఆమెను నామినేట్స్ చేస్తూ చెప్పిన రీజన్స్ కరెక్ట్ గా లేవని సమర్దించుకున్నాడు. దీంతో నాలుగవ వారం నిఖిల్ తనతో పాటు నైనికను కూడా సేవ్ చేశాడు.