News
News
X

Bigg Boss 6 Telugu Episode 48: ఆడినా కూడా జైలుకెళ్లిన వాసంతి, అందరూ కలిసి టార్గెట్ చేశారుగా

Bigg Boss 6 Telugu: ఓడిపోయిన్ టీమ్ నుంచి ఎవరు నామినేట్ అవ్వాలి అనే విషయంపై ఇంట్లో డ్రామాలు సాగాయి.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: ఈ ఎపిసోడ్లో రెడ్ టీమ్, బ్లూటీమ్‌లలో ఎవరు గెలిచారో లెక్కపెట్టారు. టీమ్‌లు సాధించిన పువ్వులు, బొమ్మలు లెక్కపెట్టారు. ఇందులో ఇనయా రెడ్ టీమ్ గెలిచింది. ఈ టీమ్లో ఇనయా, ఆదిరెడ్డి, రేవంత్, బాలాదిత్య,కీర్తి, ఫైమా, శ్రీహాన్ ఉన్నారు. మిగతా వాళ్లంతా బ్లూటీమ్‌లో ఉన్నారు. దీంతో రెడ్ టీమ్‌లో ఉన్న వారిలో ఒకరు నేరుగా నామినేట్ అవ్వాలని చెప్పారు బిగ్‌బాస్. దీంతో శ్రీసత్య మొదట టీమ్ లీడరుగా తాను నామినేట్ అవుతానని చెప్పింది. అలా కాదని చిట్టీలు రాయించారు. తీసిన చిట్టీలో కూడా శ్రీసత్య పేరే వచ్చింది. తాను నామినేట్ అవుతానని చెప్పింది శ్రీసత్య. రాత్రి తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఉదయానికల్లా మార్చేసుకుంది. అందరూ డిస్కస్ చేద్దామంటూ అడిగింది. అందులో గీతూ వాసంతి పేరు తెచ్చింది. ఆమెనే నామినేట్ చేయాలని చెప్పింది. నిజానికి అర్హత టాస్కులో గీతూ ఏమీ ఆడలేదు, వాసంతినే ఆడింది. కానీ ఈ టాస్కు పరిగణనలోకి తీసుకోకుండా పాత టాస్కుల పేరుతో వాసంతిని బలి చేశారు. వచ్చే వారం వాసంతి నేరుగా నామినేట్ అవుతుంది. 

ఎవరు డిజాస్టర్?
ఇక గేమ్‌లో  ఎవరి ఆట వరస్ట్ గా ఉందో చెప్పి ‘డిజాస్టర్’ అనే ట్యాగ్ ఇవ్వాలని చెప్పారు బిగ్‌బాస్. అర్జున రేవంత్ ఇచ్చాడు. అతను మాట్లాడిన మాటలు కొన్ని బాగోలేవని కారణం చెప్పాడు అర్జున్. ఇక వాసంతి గీతూకి ఇచ్చింది. గీతూ ఫిజికల్ టాస్కు సరిగా ఆడలేదని చెప్పింది వాసంతి. గీతూ మాత్రం తన స్టైల్లోనై నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. తరువాత మెరీనా కూడా గీతూకే డిజాస్టర్ బ్యాడ్జ్ ఇచ్చింది. దానికి గీతూ ‘నీ వల్లే ఇంతవరకు వచ్చాం’ అంటూ అవమానంగా మారింది. శ్రీ సత్య రేవంత్‌ను నామినేట్ చేసింది. ఇక సూర్య తనకు సంబంధంలేని పాయింట్‌తో వాసంతికి బ్యాడ్జ్ ఇచ్చింది. అలాగే గీతూ కూడా వాసంతికే ఇచ్చింది. రేవంత్ కూడా వాసంతినే నామినేట్ చేశాడు. దీంతో వాసంతి కెప్టెన్‌గా ఉండి పదిసార్లు పడుకున్నావ్ అది గుర్తు లేదా అంటూ వాదించింది. గీతక్క ఫ్రెండు ఆదిరెడ్డి కూడా వాసంతినే టార్గెట్ చేశాడు. ఇలా నాలుగు డిజాస్టర్ బ్యాడ్జ్‌లు వాసంతికి వచ్చాయి. దీంతో ఆమెను జైల్లో వేయమని చెప్పారు బిగ్‌బాస్.

గీతూ గొడవ
వాసంతి ప్లాన్ చేసుకుని నన్ను నామినేట్ చేశావంటూ గీతూతో అంది. ఆ విషయంపై మళ్లీ పంచాయతీ పెట్టింది గీతూ. ఈ విషయాన్ని అర్జునే వాసంతికి చెప్పేశాడని, అందుకే అతను ఉన్నప్పుడు తాను మాట్లాడనని శ్రీసత్యతో చెప్పింది గీతూ. శ్రీ సత్య నేను చెప్పలేదు అని చెప్పింది. తరువాత అందరూ జైల్లో ఉన్న వాసంతి దగ్గర ముచ్చట్లు పెట్టారు. మొదటిసారి జైలుకొచ్చా అని చెప్పింది వాసంతి.

నెయిల్ పాలిష్ ఛాలెంజ్
నెయిల్ పాలిష్ ఛాలెంట్ పెట్టారు బిగ్‌బాస్. జంటలుగా విడిపోయి అబ్బాయిలు, అమ్మాయిలకు నెయిల్ పాలిష్ పెట్టాలి. ఇందులో వాసంతి - సూర్య జంట గెలిచింది. వీరికి గిఫ్ట్ హ్యాంపర్లు ఇచ్చారు బిగ్ బాస్.  

News Reels

Also read: బిగ్‌బాస్ బుద్ధి చెప్పడంతో ప్రాణం పెట్టి ఆడిన కంటెస్టెంట్లు, శ్రీహాన్ బర్త్ డేకు ఇనయా కేక్

Published at : 22 Oct 2022 06:40 AM (IST) Tags: Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Inaya sulthana

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu Episode 83: ఎట్టకేలకు కెప్టెన్ అయిన ఇనాయ - అమ్మ కోరిక తీర్చింది, మట్టి తింటున్న ఫైమా

Bigg Boss 6 Telugu Episode 83: ఎట్టకేలకు కెప్టెన్ అయిన ఇనాయ - అమ్మ కోరిక తీర్చింది, మట్టి తింటున్న ఫైమా

Bigg Boss 6 Telugu: కంటతడి పెట్టించిన రేవంత్ - భార్యతో మాట్లాడుతుండగా షాకిచ్చిన ‘బిగ్ బాస్’

Bigg Boss 6 Telugu: కంటతడి పెట్టించిన రేవంత్ - భార్యతో మాట్లాడుతుండగా షాకిచ్చిన ‘బిగ్ బాస్’

Geetha Madhuri: ‘బిగ్ బాస్’ విన్నర్ అతనే, నందు-రష్మీల మీమ్స్ చూసి భలే ఎంజాయ్ చేశా: గీతా మాధురి

Geetha Madhuri: ‘బిగ్ బాస్’ విన్నర్ అతనే, నందు-రష్మీల మీమ్స్ చూసి భలే ఎంజాయ్ చేశా: గీతా మాధురి

Bigg Boss 6 Telugu: కొడుకుతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సిరి - అందరి దృష్టి ఇనయా, సత్యా పైనే!

Bigg Boss 6 Telugu: కొడుకుతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సిరి - అందరి దృష్టి ఇనయా, సత్యా పైనే!

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఇంట్లోకి రోహిత్ తల్లి ఎంట్రీ - మళ్లీ ‘వసపత్ర సాయికి’ అంటూ పాటందుకున్న రాజ్

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఇంట్లోకి రోహిత్ తల్లి ఎంట్రీ - మళ్లీ ‘వసపత్ర సాయికి’ అంటూ పాటందుకున్న రాజ్

టాప్ స్టోరీస్

Gujarat Riots: అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం "నేరస్థులను విడుదల చేయాలనే కదా" - ఒవైసీ కౌంటర్

Gujarat Riots:  అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం

Telangana News : తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే - డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

Telangana News :  తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే -  డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

America Area 51 : ఏలియన్స్‌ను కిడ్నాప్‌ చేసిన అమెరికా, ఏరియా 51 మిస్టరీ ఏంటి?

America Area 51 : ఏలియన్స్‌ను కిడ్నాప్‌ చేసిన అమెరికా, ఏరియా 51 మిస్టరీ ఏంటి?

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!