అన్వేషించండి

Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్ 7 విన్నర్‌‌పై క్లారిటీ - అతడే విజేత, సీరియల్ బ్యాచ్‌కు షాకేనా?

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్‌కు ఇంకా రెండురోజులు ఉన్నా.. అప్పుడే విన్నర్ ఎవరు అనేది సోషల్ మీడియాలో ప్రచారం మొదలయ్యింది.

Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 6 కంటెస్టెంట్స్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఇంకా ఫైనల్ ఎపిసోడ్‌కు రెండే రోజులు ఉండగా.. ఎవరు విన్నర్ అవుతారు అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా ఎవరికి వారు ఏ కంటెస్టెంట్ విన్నర్ అవుతారో అని అంచనాలు కూడా మొదలుపెట్టేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అన్‌ఆఫీషియల్‌గా పోలింగ్ కూడా జరుగుతోంది. దాన్ని బట్టి చూస్తే విన్నర్ సీరియల్ బ్యాచ్ కాకుండా స్పై బ్యాచ్ నుండే ఒకరు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

వారికే ట్రోఫీ..
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయిన కొన్నివారాల తర్వాత శివాజీకే ఎక్కువ సపోర్ట్ లభించింది. వరుసగా నామినేషన్స్‌లో ఉన్నా కూడా ఓటింగ్ శాతం తనకే ఎక్కువగా వచ్చేది. కానీ మెల్లగా తన ప్రవర్తన ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. నెగిటివిటీ మొదలయ్యింది. దీంతో తన శిష్యుడు అయిన పల్లవి ప్రశాంత్.. ఓటింగ్ విషయంలో లీడ్‌లోకి వచ్చాడు. రెండోవారం నామినేషన్స్‌లో పల్లవి ప్రశాంత్‌ను అందరూ టార్గెట్ చేసినట్టుగా మాట్లాడడంతో ప్రేక్షకుల్లో తనపై జాలి ఏర్పడింది. ఇప్పటికీ ఆ జాలి కంటిన్యూ అవ్వడంతో ఓటింగ్ విషయంలో పల్లవి ప్రశాంత్ టాప్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే బిగ్ బాస్ సీజన్ 7కు రైతుబిడ్డ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రశాంత్‌కు పెరిగిన ఫ్యాన్‌బేస్..
టాస్కుల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పల్లవి ప్రశాంత్.. తను ఆడిన ప్రతీ టాస్క్ గెలవాలనే అనుకుంటాడు. పట్టుదలతో ఆడి పవర్ అస్త్రా, ఎవిక్షన్ ఫ్రీ పాసులు గెలిచాడు. కెప్టెన్ కూడా అయ్యాడు. ఫినాలే అస్త్రాలో టాప్ 3 కంటెస్టెంట్‌గా నిలిచినా కూడా లక్ కలిసిరాకపోవడంతో ఆ రేసు నుండి తప్పుకున్నాడు. అయినా కూడా ప్రశాంత్ అమాయకమైన ప్రవర్తన, కష్టపడే గుణం చాలామంది ప్రేక్షకులకు నచ్చిందని వారే స్వచ్ఛందంగా సపోర్ట్ చేయడానికి ముందుకొస్తున్నారు. అందుకే ఓటింగ్ విషయంలో పల్లవి ప్రశాంత్‌ను ఎవరు దాటలేకపోతున్నారని సమాచారం. పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌తో పోటీపడడానికి అమర్‌దీప్ ఫ్యాన్స్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అమర్‌ను ఎలాగైనా విన్నర్ చేయాలని తన ఫ్యాన్స్ అంతా ఓట్లను సీరియస్‌గా తీసుకుంటారు.

చివరిస్థానంలో ఎవరంటే..?
ఒకవేళ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయితే.. రన్నర్‌గా తన గురువు శివాజీ ఉండనున్నట్టు సమాచారం. శివాజీపై ప్రేక్షకుల్లో ఎంత నెగిటివిటీ వచ్చినా.. ఓటింగ్ విషయంలో మాత్రం తను ఇంకా టాప్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. కాకపోతే పల్లవి ప్రశాంత్‌కు పోటీగా శివాజీకి ఓట్లు పడడం కష్టంగా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అందుకే బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్‌గా శివాజీ మిగిలిపోనున్నట్టు తెలుస్తోంది. ఇక అమర్‌దీప్ ఫ్యాన్స్ అంతా ఎంత ప్రయత్నించినా.. అమర్‌కు మూడో స్థానమే ఖాయమని నెటిజన్లు అనుకుంటున్నారు. ఆ తర్వాత స్థానంలో ప్రియాంక ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక అందరితో పోటీపడి ఫినాలే అస్త్రాను సాధించి.. అందరికంటే ముందుగా ఫినాలే అస్త్రాను సాధించుకున్న అర్జున్‌కు 5వ స్థానం దక్కిందని సమాచారం. సీజన్ మొదట్లో బాగా ఆడి.. తర్వాత తన కాన్పిడెన్స్‌ను కోల్పోయిన యావర్‌కు టాప్ 6వ స్థానం దక్కినట్టు తెలుస్తోంది. 

Also Read: పవన్ కళ్యాణ్ మూవీపై బాలయ్య సెటైర్ - బాలాకు చాలా సిగ్గంటూ ఆటపట్టించిన సుహాసిని, ‘అన్‌స్టాపబుల్’ ప్రోమో చూశారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Embed widget