Priyanka Jain: టేస్టీ తేజకు హార్ట్ ఎటాక్ - హడలిపోయిన ప్రియాంక జైన్, చివరికి..
Priyanka Jain: బిగ్ బాస్ ప్రియాంక జైన్‌ను కలవడానికి వచ్చిన టేస్టీ తేజాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ప్రియాంక హడలిపోయింది. చివరికి..
Tasty Teja Prank on Priyanka: బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన చాలామంది ఈ రియాలిటీ షో పూర్తవ్వగానే తమ కెరీర్లపై ఫోకస్ పెట్టారు. కొందరు మాత్రం తమ యూట్యూబ్ ఛానెళ్లలో బ్యాక్ టు బ్యాక్ వీడియోలో అప్లోడ్ చేయడంలో బిజీ అయిపోయారు. అందులో శోభా శెట్టి, ప్రియాంక, టేస్టీ తేజ, శుభశ్రీ కూడా ఉంటారు. ప్రస్తుతం వీరంతా తమ యూట్యూబ్ కంటెంట్ కోసం కష్టపడుతున్నారు. వీరిలో ప్రియాంకకు మాత్రం ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్ ఏమీ లేదు. తన బాయ్‌ఫ్రెండ్ శివ్‌తో కలిసి వీడియోలు చేస్తుంటుంది. తాజాగా ఆమె ప్రియుడు శివ్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో టేస్టీ తేజాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ప్రియాంక హడలిపోయింది. వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయాలని.. కేకలు పెట్టింది. చివరికి అది.. నిజం కాదని, ప్రాంక్ అని చెప్పడంతో ప్రియాంక ఊపిరి పీల్చుకుంది. అసలు ఏం జరిగిందంటే...
హార్ట్ ఎటాక్ వచ్చినట్టు నటన..
ఇప్పటికే శివ్‌పై ప్రియాంక ఎన్నో ప్రాంక్స్ చేసింది. అయితే రివెంజ్ కోసం ప్రియాంకపై ప్రాంక్ చేయాలని నిర్ణయించుకున్నాడు శివ్. అందుకు తేజను పిలిచాడు. ఈ విషయం చెప్పగానే తేజ.. ముందుగా భయపడ్డాడు. ‘‘మనకు పెద్దగా ధైర్యం లేదు ఆమెతో డీల్ చేయడానికి. మామూలుగా ఉండదు. చూశావుగా బిగ్ బాస్ హౌజ్‌లో’’ అని చెప్తూనే ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఫైనల్‌గా ఏం ప్రాంక్ చేయాలో డిసైడ్ అయ్యారు. వంట చేస్తూ హార్ట్ ఎటాక్ వచ్చినట్టు యాక్ట్ చేయమని తేజతో చెప్పాడు శివ్. అది వినగానే తేజ.. షాకయ్యాడు. ప్రియంక నమ్మదు అని చెప్పాడు. ఇంత భయంకరమైన ఐడియా ఎలా వచ్చిందంటూ శివ్‌ను ప్రశ్నించాడు. అయినా కూడా ఫైనల్‌గా ప్రాంక్ చేయడానికి ఒప్పుకున్నాడు.
శివ్, తేజ కలిసి ప్లాన్..
శివ్, తేజ వెళ్లి ప్రియాంకను కలిశారు. తన అమ్మకు ఆరోగ్యం బాలేదని, బెంగుళూరుకు వెళ్లాల్సి వస్తుందని, అందుకే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరినీ ఎక్కువగా కలవడం లేదని క్లారిటీ ఇచ్చింది ప్రియాంక. చాలారోజుల తర్వాత కలిశాము కాబట్టి ఒక వీడియో చేద్దామని శివ్ అడిగగా.. ప్రియాంక కూడా ఒప్పుకుంది. అలా కాసేపు ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకున్నారు. అదే సమయంలో ప్రియాంక, శివ్‌కు తానే వంట చేసి పెడతానని, అదే వీడియోగా తీసుకుంటానని తేజ చెప్పాడు. దానికి ప్రియాంక కూడా ఒప్పుకుంది. ప్రియాంక, తేజ కిచెన్‌లోకి వెళ్లిపోయిన తర్వాత ప్రాంక్ ప్రారంభం కాబోతుందని వ్యూయర్స్‌కు క్లారిటీ ఇచ్చాడు శివ్.
శివ్‌ను చితకబాదిన ప్రియాంక..
కిచెన్‌లోకి వెళ్లిన తర్వాత తనకు ఇబ్బందిగా ఉందని చెప్పడం మొదలుపెట్టాడు టేస్టీ తేజ. దీంతో ప్రియాంక కాస్త కంగరుపడింది. అదే సమయంలో గుండెలో నొప్పి వస్తుందంటూ కుప్పకూలిపోయాడు తేజ. అది చూసిన ప్రియాంక.. కంగారుతో శివ్‌ను పిలిచి ఆంబులెన్స్‌కు కాల్ చేయమని చెప్పింది. అప్పటికే శివ్.. అందరి ఫోన్స్‌ను దాచిపెట్టాడు. దీంతో ఏం చేయాలో తెలియక అటు, ఇటు పరుగులు తీసింది ప్రియాంక. ‘‘బుద్ధి లేదు, యెదవ’’ అంటూ కంగారులో శివ్‌ను తిట్టడం మొదలుపెట్టింది. అంతలోనే ఫోన్ దొరికిందని ప్రియాంకకు ఇచ్చాడు శివ్. అంబులెన్స్‌ను కాల్ చేయమని శివ్‌ను పక్కకు పంపించగానే తేజ లేచి.. జరిగిందంతా ప్రియాంకతో చెప్పేశాడు. దీంతో శివ్‌ను చితకబాదింది ప్రియాంక. అలా వీరి ప్రాంక్ వీడియో చాలా ఫన్నీగా ఉందంటూ సబ్‌స్క్రైబర్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: స్టేజ్‌పై రణబీర్, తృప్తి హాట్ పెర్ఫార్మన్స్ - స్కూల్ పిల్లల డ్యాన్సులా ఉందంటున్న నెటిజన్స్