Bigg Boss Telugu 6: ఇనయాతో మళ్లీ శ్రీహాన్ మాటల యుద్ధం, ఆట అంత కోపంగానే ఆడాలా రేవంత్?
Bigg Boss Telugu 6: ఇంటి సభ్యులంతా ఫైర్ మీద ఆడుతున్నారు.
Bigg Boss Telugu 6: రెండు వారాలుగా ఇంటి సభ్యుల ఆటలో మార్పు వచ్చింది. అందరూ చాలా గట్టిగా ఆడుతున్నారు. అయినా ఎందుకో గత సీజన్లతో పోలిస్తే ఇంకా చాలా తక్కువే అనిపిస్తోంది. ఇక నేటి ప్రోమోలో కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు కొనసాగింది. బిగ్ బాస్ రెండు టీమ్‌లకు బ్యాటన్‌తో కొట్టుకునే పోటీ పెట్టారు. ఈ ఆటలో ఓడిపోయిన టీమ్ నుంచి ఒకరిని చంపేయచ్చు. ఇందులో రెడ్ టీమ్ నుంచి శ్రీహాన్, రేవంత్, ఫైమా పోటీ పడగా, బ్లూ టీమ్ నుంచి వాసంతి, మెరీనా, ఇనయా పోటీ పడ్డారు. వీరంతా ఎదురెదురుగా ఉన్న రెండు గోడల మీద నిల్చుని బ్యాటన్లో కొట్టు కోవడం మొదలుపెట్టారు. ఇందులో కూడా రేవంత్ కోపంగా ఆడాడు. ఇక శ్రీహాన్ ఇనయాతో మాటల యుద్ధానికి దిగాడు. ఆమెను ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. నీ గుణం, నీ క్యారెక్టర్ అన్నీ తెలుసులే అన్నాడు. దానికి వెనుకనుంచి ఎవరో క్యారెక్టర్ అనొద్దు అని సర్దిచెప్పారు. దాంతో గుణం మాత్రమే అని అన్నాడు శ్రీహాన్. ఇనయా నాతో ఆడ్డానికి భయపడుతున్నావ్ అంది. దానికి శ్రీహాన్ ‘నామినేషన్లో తప్ప కంటెంట్ లేని దానివి నువ్వు మాట్లాడుతున్నావ్’ అంటూ అరిచాడు. నువ్వు బాగా ఇస్తున్నావులే ఈ మధ్య కంటెంట్ అని ఇనయా అంది. వీరిద్దరూ అలా అరుచుకుంటూనే ఆటాడారు.
చివరికి బ్లూటీమ్ నుంచి మెరీనా, వాసంతి కింద పడిపోయారు. రెడ్ టీమ్ నుంచి రేవంత్ కిందపడిపోయాడు. దీంతో వీరు డిస్ క్వాలిఫై అయ్యారు. ఇనయా ఒక్కతే శ్రీహాన్ - ఫైమాతో పోరాడింది. ఇక రేవంత్ ఎందుకు అలిగాడో తెలియదు కానీ మళ్లీ అలిగాడు. గీతూ, శ్రీహాన్, శ్రీసత్య అతడిని బతిమిలాడుతూ కనిపించారు. రేవంత్ ‘నా గేమ్ ఇలా చేతులు కట్టేసి ఆడడం వల్ల కాదు’ అన్నాడు. దానికి శ్రీహాన్ ‘ఆట ఆడొద్దని చెప్పలేదు, మాట గురించి చెబుతున్నాం, ఆవేశంలో ఏం అంటావో తెలియదు’ అన్నాడు. దానికి రేవంత్ ‘కంట్రోల్ చేసుకుని ఆడేది గేమ్, ఏం గేమో’ అనుకుంటూ కనిపించాడు.
ఈ సీజన్లో ఒక్కరికి కూడా విన్నర్ అయ్యే లక్షణాలు ఇంతవరకు కనిపించలేదు. గత సీజన్లలో అయిదు వారాలు గడవగానే విన్నర్ అయ్యే లక్షణాలు ఎవరికి ఉన్నాయో కనిపించేస్తాయి. కానీ ఇక్కడ మంచి గుణాలు ఉన్న వాళ్లు పెద్దగా ఆడడం లేదు, మంచిగా ఆడేవాళ్లకి మంచిగుణాలు లేవు. ఇష్టమొచ్చినట్టు నోరుపారేసుకునేవాళ్లు కొంతమంది, విపరీతమైన కోపంతో ఊగిపోయేవారు కొంతమంది, ఆటలో పెద్దగా ఇన్వాల్వ్ కాని వాళ్లు కొంతమంది. ఎవరికీ ఓటెయ్యాలో తెలియక ప్రేక్షకులు కూడా డైలమాలో పడుతున్నారు. ఈ సీజన్లో ఎవరికీ ఆర్మీలు ఏర్పడకపోవడం కూడా మైనస్ అనే చెప్పాలి. ఈ వారం బాగా ఆడిన వారు వచ్చే వారం ఆడడం లేదు. ఎవరిలోనూ విన్నర్ లక్షణాలు కనిపించడం లేదు.
Also read: గీతూ మళ్లీ గేమ్‌ని గబ్బు కొట్టించింది, ఎదుటివారి వీక్‌నెస్ మీదే ఆట ఆడింది