News
News
X

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ నుంచి శ్రీసత్య ఎలిమినేట్ - మిగతావారంతా టాప్ 5 కంటెస్టెంట్లు, ఇక మిగిలింది ఫినాలేనే

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ నుంచి మరో ఎలిమినేషన్ జరిగింది.

FOLLOW US: 
Share:

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ముగింపుకు వచ్చేసింది. ఇంకా ఒక్కరోజులో విజేత ఎవరో తెలిసిపోతుంది. ఈలోపు బిగ్ బాస్ ఇంటి నుంచి మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయారు.గత ఆదివారం నాగార్జున మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రేక్షకులకు చెప్పింది. అయితే ఇంటి కంటెస్టెంట్లకు ఈ విషయం తెలియదు. వారికి అర్థరాత్రి లేపి మరీ ఈ విషయాన్ని తెలియజేశారు. అంతే కాదు ఒకరిని ఎలిమినేట్ చేసి పంపించేశారు. 

ఈరోజ ఎపిసోడ్లో శ్రీహాన్, కీర్తికి ఓట్లు అడిగే అవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్. అయితే వారిద్దరిలో ఎవరు ఓట్లు అడగాలన్నది మిగతా ఇంటి సభ్యులు తమ సపోర్ట్ ద్వారా ఇవ్వాలి. దాదాపు అందరూ శ్రీహాన్ కు సపోర్ట్ చేయడంతో ఓట్లడిగే అవకాశం ఆయనకే దక్కింది. శ్రీహాన్ తాను పశ్చాత్తాపం పడుతున్న కొన్ని విషయాలు చెప్పుకున్నాడు. తన మాటలు, ప్రవర్తన వల్ల కొంతమంది చాలా బాధపడినట్టు తెలిసిందని, అది తాను తెలియక చేసిందని చెప్పుకొచ్చాడు. 

కీర్తికి ఛాన్స్...
ఇవ ఓట్లు రిక్వెస్ట్ చేసే టాస్కు రేవంత్, కీర్తి, ఆదిరెడ్డికి వచ్చింది. ఇందులో హెడ్ బాల్ టాస్కులో కీర్తి, రేవంత్‌ను ఓడించింది. దీంతో ఆమె ఓట్లు రిక్వెస్ట్ చేసే అవకాశం దక్కించుకుంది. ఆమె ప్రేక్షకులను ఓట్లు రిక్వెస్టు చేసింది. తాను ఒకవేళ విన్నర్ అయితే వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం ఓ మంచి పనికి వినియోగిస్తానని హామీ ఇచ్చింది. 

అందరూ రాత్రి పడుకున్నాక మధ్యలోనే వారిని నిద్రలేపాడు బిగ్‌బాస్. అందరినీ గార్డెన్ ఏరియాలో వరుసగా నిల్చోబెట్టి ‘మీ అభిప్రాయం ఎవరు ఇంటి నుంచి బయటికి వెళ్లాలని భావిస్తున్నారు’ అని అడిగారు. దానికి శ్రీహాన్ రోహిత్ పేరు, కీర్తి ఆదిరెడ్డి పేరు, శ్రీసత్య కీర్తి పేరు, రోహిత్ శ్రీహాన్ పేరు, రేవంత్ కీర్తి పేరు, ఆదిరెడ్డి కీర్తి పేరు చెప్పారు. మెజారిటీ కీర్తి పేరే చెప్పారు. అయితే బిగ్ బాస్ మాట్లాడుతూ ‘ఇంటి సభ్యుల్లో ఎక్కువ మంది కీర్తి ఇంటి నుంచి వెళ్లిపోవాలని కోరుకున్నారు. కానీ బిగ్ బాస్ మాత్రం శ్రీసత్య ఇంటి నుంచి వెళ్లిపోవాలని కోరుకుంటున్నారు’ అని చెప్పారు. దీంతో రేవంత్ చాలా బాధపడ్డాడు. శ్రీసత్య, శ్రీహాన్, రేవంత్ హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు. శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ఇంటికి వెళ్లిపోయింది.  

ప్రస్తుతం ఇంట్లో ఉన్న వారిలో నెగిటివిటీ మూటకట్టుకున్న అమ్మాయి శ్రీసత్య. ఇనాయను, కీర్తిని ఆమె వ్యక్తిగతంగా దాడి చేసి బాధపడేలా చేసింది. ముఖ్యంగా ఫిజికల్ గా వెక్కిరించడం, అర్జున్ కళ్యాణ్‌ను ఆట కోసం వాడుకోవడం కూడా చాలా చికాకు పుట్టించింది. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో శ్రీసత్య, ఆదిరెడ్డి ఓటింగ్ లో కింద ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా వారందరికీ వీరి కన్నా ఎక్కువగానే ఓటింగ్ వచ్చిందని సమాచారం. ఆదిరెడ్డికి అంత నెగిటివిటీ లేదు, అందుకే ఆయన్ను ఉంచి శ్రీసత్యను ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది.

Also read: బిగ్‌బాస్ విన్నర్ పేరు చెప్పేసిన గూగుల్ - గతంలో కూడా ఇలానే చెప్పింది

Published at : 17 Dec 2022 07:21 AM (IST) Tags: Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Sri sathya Elimination

సంబంధిత కథనాలు

Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!

Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!

వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం

వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం

Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!

Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!

Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా

Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా

Income Tax Rule: బిగ్‌బాస్‌, లాటరీ విజేతలకు 'పన్ను పోటు' ఎంత! తెలిస్తే షాకవ్వడం ఖాయం!

Income Tax Rule: బిగ్‌బాస్‌, లాటరీ విజేతలకు 'పన్ను పోటు' ఎంత! తెలిస్తే షాకవ్వడం ఖాయం!

టాప్ స్టోరీస్

BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !

BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !

Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు

Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు

Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - తొమ్మిదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!

Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - తొమ్మిదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?