అన్వేషించండి

Bigg Boss Season 7 Telugu: నా రెండో పెళ్లాన్ని కూడా వదిలేసి వచ్చేశా, నువ్వు గెలవాలి - పల్లవి ప్రశాంత్ కోసం శివాజీ త్యాగం

పల్లవి ప్రశాంత్ అంటే శివాజీకి ఎంత ఇష్టమో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయినప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. అయితే మరోసారి ఆ ఇష్టాన్ని నిరూపించుకున్నాడు శివాజీ.

బిగ్ బాస్ సీజన్ 7లోని కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా.. కంటెస్టెంట్స్ అందరికీ వారి కుటుంబ సభ్యుల దగ్గర నుండి లెటర్స్ వచ్చాయి. కానీ కంటెస్టెంట్స్ అంతా జంటలుగా విడిపోయారు కాబట్టి ఆ జంట నుండి ఒక్కరు మాత్రమే లెటర్‌ను చదవగలరు. ఇంకొక కంటెస్టెంట్.. లెటర్‌తో పాటు కెప్టెన్సీ రేసులో ఉండే అవకాశాన్ని కూడా త్యాగం చేయాలి. ముందుగా బిగ్ బాస్.. ఈ టాస్క్ గురించి చెప్పగానే శివాజీ అసలు ఆడనన్నాడు. కానీ బిగ్ బాస్ హౌజ్‌లో ఉంటున్నప్పుడు ఆయన ఇచ్చిన ప్రతీ టాస్క్ తప్పకుండా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తమకు వచ్చిన లెటర్స్‌ను చూడడానికి శివాజీ, పల్లవి ప్రశాంత్.. ఇద్దరూ యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లారు.

అమ్మతో రోజూ మాట్లాడతా..

శివాజీకి తన ఇంటి నుండి లెటర్‌తో పాటు ఒక కాఫీ కూడా అందింది. తనకు కాఫీ అంటే ఎంత ఇష్టమో బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన మొదటిరోజు నుండి చెప్తూనే ఉన్నాడు. తన భార్య పంపిన కాఫీ తాగగానే శివాజీ చాలా హ్యాపీ అయ్యాడు. ఆ తర్వాత ఎవరు త్యాగం చేయాలి అనే విషయంపై డిస్కషన్ మొదలుపెట్టాడు. దానికి పల్లవి ప్రశాంత్ దగ్గర సమాధానం లేదు. ‘‘ఎవరు రాసారు లెటర్ నీకు? అమ్మనా? నాన్ననా?’’ అని ప్రశాంత్‌ను అడిగాడు శివాజీ. దానికి ‘‘అమ్మ రాయదు’’ అని సమాధానమిచ్చాడు ప్రశాంత్. అయితే నీకు మీ నాన్న, నాకు నా భార్య రాశారు అన్నాడు శివాజీ. ‘‘నిజంగా మిస్ అవుతున్నా. ఇన్నిరోజులు ఎప్పుడూ లేను. అమ్మతో రోజూ మాట్లాడతా’’ అంటూ తన గురించి చెప్పుకొచ్చాడు. అయినా కూడా ప్రశాంత్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. 

ప్రపంచంలోనే బెస్ట్ షో..

ఎంతసేపు చూసినా ప్రశాంత్.. ఏమీ మాట్లాడకపోయేసరికి శివాజీనే మళ్లీ డిస్కషన్ మొదలుపెట్టాడు. ‘‘నాకు ఒకటే ఫీలింగ్. ఓపెన్‌గా చెప్తున్నా. మనిద్దరమే ఆడతాం అనుకున్నా. అప్పుడు నీకు డైరెక్ట్‌గా కెప్టెన్సీ ఇచ్చేద్దాం అనుకున్నా. ఒక కామన్ మ్యాన్‌ను ఇక్కడ వరకు తీసుకొచ్చానంటే వాడు గెలవాలి. నీకు ఎప్పుడో చెప్పానుగా గుర్తుందా నువ్వు చాలా దూరం పోవాలి. చాలామందికి ఇన్‌స్పిరేషన్ అవుతావు నువ్వు. కంటెండర్ కంటే కాఫీ ఇచ్చాడు చాలు నాకు. నువ్వు కంటెండర్ అవ్వు. నా కొడుకు మీద పంతంతో వచ్చాను కానీ వెనక్కి వెళ్లడానికి రాలేదు నేను. నువ్వు ఊరి నుండి వచ్చాను అన్నావ్. వచ్చి హగ్ ఇచ్చావ్. ఆ తర్వాత నీతో ఎవరూ మాట్లాడట్లేదు దూరంగా ఉంటున్నారు అన్నావ్. బిడ్డ నేను ఉంటా అని చెప్పాను కదా. ఆడు. దున్ను. కానీ లైన్ దాటొద్దు. నేను వెనక్కి తగ్గుతున్నాను. నువ్వు గెలువాలి కాబట్టి నీ వెనకాల నిలబడతా అని చెప్తున్నా. ఆటలో ఒకడే గెలుస్తాడు. ఇంట్లో పెళ్లాం, పిల్లలను అందరినీ వదిలేసి వచ్చాను. కాఫీని వదిలేసి వచ్చాను. ఇది నా రెండో పెళ్లాం. ప్రపంచంలో ఇంతకు మించిన యూనివర్సిటీ లేదు. మనిషిగా బ్రతకడానికి, నేర్చుకోవడానికి. వీళ్లను పొగడడం లేదు నేను. వీళ్లని పొగడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ప్రపంచంలోనే ఇది బెస్ట్ షో. నీలాంటి వాళ్లని వందల మందిని తీసుకొస్తారు వీళ్ళు బయటికి. నువ్వు ఒకడివి గెలిచి చూపించరా’’ అంటూ పల్లవి ప్రశాంత్‌ను మోటివేట్ చేశాడు శివాజీ. ఆ తర్వాత తాను వయసులో పెద్దవాడిని అని, తన భార్య కూడా తనను అర్థం చేసుకుంటుందని చెప్తూ.. తనకు వచ్చిన లెటర్‌ను చింపేసి బయటికి వెళ్లిపోయాడు.

Also Read: పేనుకు పెత్తనం అప్పజెప్పినట్టుగా ఉంది - జనసేన, టీడీపీ కూటమిపై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Embed widget