అన్వేషించండి

Bigg Boss 7 Telugu: అదంతా ముష్టి బ్యాచ్, ముష్టినాయాళ్లు - మరోసారి ‘స్పా’ బ్యాచ్ గురించి నోరుజారిన శివాజీ

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7ను చూస్తున్న ప్రేక్షకులు ఇబ్బందిపడుతున్నారని నాగార్జున క్లాస్ పీకినా కూడా శివాజీ మాత్రం తన మాటతీరును మార్చుకోవడం లేదు.

Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంటర్ అయిన అందరు కంటెస్టెంట్స్‌లో టాప్ ఆరుగురు ఫినాలే వీక్‌కు చేరుకున్నారు. అందుకే వారంతా ఇంటి ఫుడ్‌ను మిస్ అవుతున్నారని బిగ్ బాస్ భావించారు. 14 వారాల నుంచి బిగ్ బాస్ హౌజ్‌లోనే ఉండడంతో వారి ఇంటి ఫుడ్ టేస్ట్‌ను మిస్ అవుతున్నారని, అందుకే కంటెస్టెంట్స్ అందరి కోసం వారి ఇంటి నుంచి ఫుడ్ వస్తుందని బిగ్ బాస్ తెలిపారు. కానీ ఆ ఫుడ్‌ను బిగ్ బాస్ అంత ఈజీగా ఇవ్వడుగా..! అక్కడ కూడా ట్విస్ట్ పెట్టాడు. ఇప్పటివరకు బిగ్ బాస్‌లో జరిగిన టాస్కులు రివైండ్ చేస్తూ.. ఒక కంటెస్టెంట్.. మరొక కంటెస్టెంట్ కోసం ఆడి వారి ఫుడ్‌ను గెలిచి వారికి గిఫ్ట్‌గా ఇవ్వాలి. అంతే కాకుండా గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంట్లోకి గ్రహంతరవాసులు వచ్చారు. వారిని ఎంటర్‌టైన్ చేయడానికి కంటెస్టెంట్స్ తిప్పలు పడ్డారు.

మరోసారి నోరుజారిన శివాజీ..
ముందుగా వేరే గ్రహం నుంచి బిగ్ బాస్ హౌజ్‌లోకి ‘హాచీ’ వచ్చింది. ఆ హాచీనే కంటెస్టెంట్స్‌కు ఇంటి ఫుడ్‌ను తీసుకొచ్చింది. ముందుగా అర్జున్‌కు తన భార్య వీడియో మెసేజ్‌తో పాటు తనకు ఇష్టమైన ఫుడ్‌ను పంపింది. అయితే అర్జున్.. ఈ ఫుడ్ తినడానికి అనుమతి పొందాలంటే యావర్.. ఒక టాస్క్ ఆడి గెలవాలి. ఆ టాస్క్ మరేదో కాదు.. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో ఆడిన బాల్స్ టాస్కే. ఇక ఆ టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఆడి అర్జున్‌కు తన ఇంటి ఫుడ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు యావర్. ఆ ఫుడ్‌ను ఇతర హౌజ్‌మేట్స్‌తో పంచుకొని తిన్నాడు అర్జున్.

టాస్క్ అయిపోయిన తర్వాత స్పై బ్యాచ్ అంతా కూర్చొని సీజన్ మొత్తంలో తమరిని ఎక్కువ ఎవరు నామినేట్ చేశారు అనే విషయాన్ని గుర్తుచేసుకున్నారు. సందీప్, ప్రియాంక, శోభా, అమర్.. ఎక్కువగా తనను నామినేట్ చేసేవారని యావర్ చెప్పాడు. ఆ తర్వాత శివాజీని ఎక్కువగా ఎవరు నామినేట్ చేసేవారని అడిగాడు. ‘‘ఈ ముష్టి బ్యాచే. అన్ని ముష్టి పాయింట్లు చెప్తారు వాళ్లు. ఒక్కటి కూడా సరిగ్గా, లాజికల్‌గా మీరు ఇలా తప్పు చేశారు అని చెప్పారు. మీ ఆట నాకు నచ్చలేదు అంటారు. చివరి నామినేషన్‌లో శోభా కూడా అలాగే చెప్పింది. మరి తనదేమైనా ఒలింపిక్ పర్ఫార్మెన్సా. వాళ్లవి అన్నీ అంతే. అమర్ కూడా మీ ఆట నాకు నచ్చలేదు అంటాడు. మరి వాళ్ల ఆట ఏమైనా బాగుందా.. వాళ్లు కూడా ఇంతే ఆడారుగా. ముష్టి పాయింట్లు. ముష్టినాయాళ్లు’’ అని మరోసారి అనవసరంగా ఇతర కంటెస్టెంట్స్ గురించి స్టేట్‌మెంట్ ఇచ్చాడు శివాజీ.

నీళ్లు తాగి కడుపు నింపుకున్నావు..
ఆ తర్వాత శివాజీకి తన ఇంటి ఫుడ్‌తో పాటు తన కొడుకు దగ్గర నుంచి వీడియో మెసేజ్ కూడా వచ్చింది. ‘‘మేము మీకు చికెన్ కర్రీ పంపిస్తున్నాం. పంపించడానికి కారణం ఏంటంటే హైదరాబాద్‌కు వచ్చిన మొదట్లో పార్క్‌లో నిద్రపోయేవాడినని, ఆకలితో నీళ్లు తాగి కడుపు నింపుకున్న రోజులు కూడా ఉన్నాయని చెప్పావు. ఏ ప్రేక్షకులు అయితే నీకు ఆకలి భయం పోగొట్టారో.. అదే ప్రేక్షకుల తరపున నీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ చికెన్ కర్రీ పంపిస్తున్నాం’’ అని శివాజీ కొడుకు వీడియోలో తెలిపాడు.

ఇక ఆ ఫుడ్ కోసం ప్రియాంక విల్లుపై బాల్స్‌ను బ్యాలెన్స్ చేసే టాస్క్ ఆడి గెలిచింది. అమర్ కోసం తన భార్య తేజస్విని రొయ్యల బిర్యానీ పంపించింది. దానికోసం శివాజీ బెలూన్స్‌ను పగలగొట్టే టాస్క్ ఆడాడు. టాస్కులు ఆడడం, గెలవడం వరకు బాగానే ఉంది. కానీ కంటెస్టెంట్స్ అంతా తనకు బోర్ కొట్టిస్తున్నారని హాచీ ఫీల్ అయ్యింది. అందుకే తన తోటి గ్రహంతరవాసులను హౌజ్‌లోకి పంపింది. వారంతా కంటెస్టెంట్స్‌తో కాసేపు ఆడుకున్నారు. కంటెస్టెంట్స్ అంతా ఆ గ్రహంతరవాసులు చెప్పింది చేసి వారిని తృప్తిపరిచారు.

Also Read: మూడు భాగాలుగా 'రామాయణం' - రణ్ బీర్, సాయి పల్లవి షూటింగ్‌లో జాయిన్ అయ్యేది అప్పుడే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Most Ordered Item On Swiggy: కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Starship: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
Embed widget