(Source: ECI/ABP News/ABP Majha)
Bigg Boss Season 7: దామిని, రతిక, శుభశ్రీకి మరో అవకాశం - ఎక్కువ ఓట్లతో హౌజ్‌లో రీఎంట్రీ ఇచ్చేది ఎవరంటే?
Bigg Boss Season 7: దామిని, రతిక, శుభశ్రీలకు బిగ్ బాస్ మరో అవకాశం ఇచ్చాడు. ఈ ముగ్గురిలో తిరిగి హౌజ్‌లోకి కంటెస్టెంట్‌గా ఎవరు ఎంటర్ అవుతారు అనే నిర్ణయాన్ని మాత్రం హౌజ్‌మేట్స్‌కు వదిలేశాడు.
బిగ్ బాస్ రియాలిటీ షోలో ఒక్కసారి హౌజ్ నుండి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరిగింది. ఇక బిగ్ బాస్ 7 అనేది ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి ఈసారి కూడా అలాంటి ఒక రీఎంట్రీని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఎవరు రీఎంట్రీ ఇవ్వాలి అనే నిర్ణయాన్ని ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న హౌజ్‌మేట్స్ చేతికే వదిలేశారు. రతిక, దామిని, శుభశ్రీ.. ఈ ముగ్గురు బిగ్ బాస్ హౌజ్‌లోకి మళ్లీ రీఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరి రీఎంట్రీ గ్యారెంటీ అనేదానిపై ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చేశారు.
14 మందిలో ఎవరి ఓటు ఎవరికి..
ముందుగా దామిని, ఆ తర్వాత రతిక, తాజాగా శుభశ్రీ.. ఎలిమినేట్ అయిపోయి బిగ్ బాస్ హౌజ్‌ను వదిలేసి వెళ్లారు. అయితే హౌజ్‌లో ఉన్నంతవరకు వీరు ఎంతమంది ఫ్రెండ్స్‌ను క్రియేట్ చేసుకున్నారు అనేదాన్నిబట్టి ఇప్పుడు వీరి రీఎంట్రీ ఉండబోతుంది. శుభశ్రీకి అయితే కచ్చితంగా ఇద్దరు కంటెస్టెంట్స్ ఓట్లు వేసే అవకాశం ఉంది. వారే గౌతమ్, యావర్. దీంతో శుభశ్రీ ఖాతాలో కచ్చితంగా రెండు ఓట్లు వచ్చిపడినట్టే. ఇక దామిని ఖాతాలో కూడా కచ్చితంగా ప్రియాంక, శోభా శెట్టి, సందీప్ ఓట్లు వచ్చి పడతాయి అని కంటెస్టెంట్స్ అంచనా వేస్తున్నారు. ప్రియాంకకు దామిని అంటే చాలా ఇష్టం. కాబట్టి తను దామినికే ఓటు వేస్తే శోభా కూడా తననే ఫాలో అయిపోతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక హౌజ్‌లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్‌లో ఈ అయిదుగురు ఓట్లు ఎవరెవరికి అని కన్ఫర్మ్ అయిపోయింది.
అయోమయంలో రతిక రీఎంట్రీ..
దామిని, శుభశ్రీకి కనీసం కొన్ని కన్ఫర్మ్ ఓట్లు అయినా ఉన్నాయి. కానీ రతిక పరిస్థితి మాత్రం అయోమయంగానే ఉంది. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంతవరకు శివాజీ, పల్లవి ప్రశాంత్ గ్యాంగ్‌లో ఒక మెంబర్‌గా ఉండేది రతిక. కానీ వెళ్లే కొన్నిరోజుల ముందు నుండి వారితో గొడవలు పెట్టుకొని, వారిని దూరం చేసుకుంది. దీంతో ఇప్పుడు శివాజీ, పల్లవి ప్రశాంత్ కూడా రతికకు ఓట్లు వేస్తారో లేదో అనేది డౌట్‌గా మారిపోయింది. ఒకవేళ రతికకు కాకపోతే వారిద్దరి ఓట్లు కూడా కచ్చితంగా శుభశ్రీకే పడతాయి. తేజ విషయానికొస్తే.. దామినితో ఎక్కువగా కలవలేదు, రతికతో ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవాడు కాబట్టి తన ఓటు కూడా శుభశ్రీకే పడే ఛాన్స్ ఉంది. అమర్‌దీప్, శుభశ్రీకి కూడా ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి కాబట్టి తన ఓటు రతికకు పడే ఛాన్స్ ఉంది. కానీ తను వేసిన నామినేషన్ వల్లే శుభ వెళ్లిపోయింది అని ఆలోచిస్తే మాత్రం తన ఓటు శుభకే పడే ఛాన్స్ కూడా ఉంది.
పోటుగాళ్ల ఓట్లు ఎవరికి..
పోటుగాళ్లు విషయానికొస్తే.. రతిక, దామిని, శుభశ్రీలలో ఎవరినీ పోటుగాళ్లు నేరుగా కలవలేదు. కానీ బయట నుండి చూసిన ఆట ప్రకారం వీరి ఓట్లు ఉండబోతున్నాయి. అయితే ఆ ముగ్గురిలో కేవలం శుభశ్రీ మాత్రమే పాజిటివ్‌గా ఉన్నప్పుడే ఎలిమినేట్ అయ్యింది. దామిని, రతికకు మాత్రం బయట చాలా నెగిటివిటీ ఏర్పడిన తర్వాతే వారు ఎలిమినేట్ అయిపోయారు. దీంతో పోటుగాళ్ల ఓట్లు ఎవరికి అనేది కొంచెం అయోమయంగానే ఉంది అనుకుంటున్నారు ప్రేక్షకులు. అర్జున్ మాత్రం రతికకు ఓటు వేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రతిక ఆట తనకు బాగా నచ్చేది అని పలుమార్లు తనే ఇన్‌డైరెక్ట్‌గా ఒప్పుకున్నాడు. ఇక శివాజీ, పల్లవి ప్రశాంత్ ఎవరికి ఓటు వేస్తే భోలే షావలి కూడా వారికే ఓటు వేస్తాడని అంచనా. అశ్విని, నయని పావని ఓట్లు ఎక్కువగా శుభశ్రీకే పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శుభశ్రీ ఎలిమినేట్ అయిపోయిన విషయం తెలిసి వీరిద్దరూ షాక్ అయ్యారు. పూజా విషయానికొస్తే.. ఎవరితో తనకు బయట మంచి పరిచయాలు ఉన్నాయనేది స్పష్టంగా తెలియదు కాబట్టి తన ఓటు గురించి చెప్పడం కొంచెం కష్టమే.
Also Read: బాలీవుడ్లో మోస్ట్ కాంట్రవర్షియల్ బ్రేకప్స్ వీళ్లవే!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial