By: Haritha | Updated at : 10 Dec 2022 05:24 PM (IST)
(Image credit: Star maa)
BiggBoss 6 Telugu: సాఫీగా సాగితే బిగ్ బాస్ హౌస్ ఎందుకవుతుంది? అంతా సవ్యంగా ఉంటే కంటెంట్ ఎక్కడ నుంచి వస్తుంది? మొన్నటి వరకు ఫిట్టింగ్ మాస్టర్ బిగ్ బాస్ ఏదో ఒక టాస్కులు, నామినేషన్లు ఇచ్చి ఆడించారు. చివరి రెండు వారాలు పెద్దగా గొడవలు ఉండవు. రేవంత్ లాంటి వాళ్లు ఇద్దరు ఉంటే గొడవలు బాగా అయ్యేవి. కానీ ఒక్కటే ఉన్నాడు. అతను వీలైనంతవరకు గొడవలు బాగానే పడ్డాడు. అవి చాలవన్నట్టు నాగార్జున కూడా ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రోమో చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది.
ప్రోమోలో ఏముందంటే...నాగార్జున పూలరంగడులా రెడీ అయి ‘సై సై సయ్యారే’ పాటతో వేదిక మీదకు వచ్చేశారు. తరువాత అందరినీ కన్ఫెషన్ రూమ్‌కి రమ్మన్నారు. శ్రీసత్య ‘మళ్లీ దయ్యాల టాస్కా?’ అంది. మోస్ట్ ఎంటర్టైనింగ్ సీజన్ ఆఫ్ ద సీజన్ అని ఒక వీడియో వేశారు. అందులో రేవంత్ ‘ఎవరైనా భయపడతారు’ అని దెయ్యాల టాస్కు గురించి అన్నారు. దానికి ఆదిరెడ్డి ‘నేను, శ్రీహాన్ భయపడలేదు’ అని ఓవరాక్షన్ చేశారు. తరువాత దెయ్యాల గదిలోకి వెళ్లాక వారిద్దరూ ఎలా భయపడాలో లోపల చూపించారు. అలాగే శ్రీసత్య, ఇనాయ కూడా భయపడింది చూపించారు. రేవంత్ వీడియో వేయలేదు. దానికి ‘నా వీడియో వేయలేదు సర్’ అన్నాడు. దానికి నాగార్జున ‘నువ్వు భయపడలేదు కదా’ అన్నారు. దానికి రేవంత్ ‘వాంటెడ్లీ భయపడలేం కదా సర్’ అన్నాడు. ఆ వెంటనే నాగార్జున ‘అంటే శ్రీహాన్ కావాలనే భయపడ్డాడని అంటున్నావా’ అని అడిగారు. దానికి రేవంత్ దండం పెట్టేశాడు.
నువ్వు పెద్ద ఫ్లిప్పర్
నాగార్జున ఒక టాస్కు ఇచ్చారు. ప్రతి ఒక్కరు అవతలి వారి కన్నా తామెందుకు బెటరో చెబుతూ క్యాంపెయిన్ చేసుకోవాలని చెప్పారు. రేవంత్ - శ్రీహాన్ తో మొదలుపెట్టారు. ఇద్దరూ తమ తమ పాయింట్లు చెప్పుకున్నారు. మధ్యలో నాగార్జున శ్రీహాన్‌తో ‘రేవంత్ ఫ్లిప్పర్ అన్నావ్ ఆ పాయింట్?’ అని గుర్తు చేశారు. దానికి శ్రీహాన్ అలా అనలేదు సర్ అన్నాడు. దానికి నాగార్జున ‘మొన్న ఆదిరెడ్డితో అన్నావ్ కదా’ అన్నారు. దానికి రేవంత్ ‘నాకు తెలుసు సర్. శ్రీహాన్ నా వెనకాల మాట్లాడతాడని’ అన్నాడు. రేవంత్‌కు కారణం దొరకడమే ఆలస్యం, వెంటనే కోపం వచ్చేస్తుంది. ఫ్లిప్పర్ డైలాగుతో రేవంత్ ముఖం ఎర్రగా మారిపోయింది. ఈ లోపు నాగార్జున ఆదిరెడ్డి నీకు చెప్పాడా లేదా అని అడిగారు. దానికి ఆదిరెడ్డి ‘ఫ్లిప్పర్ అనే మాట గుర్తు లేదు సర్’ అన్నాడు. వెంటనే నాగార్జున ‘నిన్ను మించిన ఫ్లిప్పర్ లేడు ఆదిరెడ్డి’ అన్నారు నాగార్జున. ప్రశాంతంగా ఉన్న ఇంట్లో భలే ఫిట్టింగ్ పెట్టారు నాగార్జున.
కాగా ఈవారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్టు సమాచారం. టాప్ 3 కంటెస్టెంట్ అనుకున్న ఇనాయ బయటికి వెళుతున్నట్టు తెలుస్తోంది.
Also read: బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఇనాయ? ఇది షాకింగ్ ట్విస్టు
BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?
Monkey Selfie With Abijeet: అభిజీత్‌తో కోతి సెల్ఫీ - ఆ ఫొటో కోతే తీసిందట!
Archana Gautam: ప్రియాంక గాంధీ పీఏపై బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు, కేసు నమోదు చేసిన పోలీసులు
Gangavva on Nagarjuna: కల నెరవేర్చుకున్న గంగవ్వ, కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారంటే?
Ashu Reddy : అషు రెడ్డి బికినీ రేటు ఎంతో తెలుసా? - ఆ 'విక్టోరియా సీక్రెట్' కొనొచ్చా?
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్