అన్వేషించండి

Bigg Boss 7 Telugu: అమర్‌ను నామినేట్ చేసి షాకిచ్చిన ప్రియాంక, ఓటింగ్ ప్రక్రియను వివరించిన బిగ్ బాస్

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో అమర్‌దీప్, ప్రియాంక ఒకే గ్రూప్‌గా కలిసి ఆడతారు. అయితే దీనివల్ల వచ్చిన నెగిటివిటీని పోగొట్టుకోవడానికి ప్రియాంక ఒక నిర్ణయం తీసుకుంది.

Telugu Bigg Boss 7: మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షోలో గ్రూప్ గేమ్ జరగడం లేదు అని ఎవరైనా చెప్పినా.. అది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే ఈ రియాలిటీ షోలోకి బయటి నుండే ఫ్రెండ్స్‌గా ఉన్న వ్యక్తులు మాత్రమే కాకుండా.. అక్కడే వచ్చి కనెక్ట్ అయినవారు కూడా ఉంటారు. అలా ఎవరికి నచ్చిన కంటెస్టెంట్‌కు వారు సాయంగా ఉండాలని, సపోర్ట్ చేయాలని అనుకుంటారు. అలాగే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో ‘స్పా’, ‘స్పై’ అని రెండు గ్రూపులు ఉన్నాయి. అయితే ‘స్పా’ గ్రూప్‌లో ఉన్నందుకు గత కొంతకాలంగా ప్రియాంకపై నెగిటివిటీ ఎక్కువయిపోతుంది. అదంతా పోగొట్టుకోవడానికి తాజాగా జరిగిన నామినేషన్స్‌లో అమర్‌దీప్‌ను నామినేట్ చేయాలని నిర్ణయించుకుంది.

నెగిటివిటీని పోగొట్టే ప్రయత్నం..
గతవారం జరిగిన ఫినాలే అస్త్రా రేసులో ఎవరూ ఊహించని విధంగా అర్జున్ విన్నర్ అయ్యాడు. కానీ కంటెస్టెంట్స్ దగ్గర నుండి ఎక్కువ సపోర్ట్ మాత్రం అమర్‌దీప్‌కే లభించింది. ముందుగా శోభా, శివాజీ కలిసి తన పాయింట్స్ మొత్తాన్ని అమర్‌దీప్‌కు ఇవ్వగా.. ప్రియాంక మాత్రం తనను కెప్టెన్ చేశాడనే కృతజ్ఞతతో గౌతమ్‌కు పాయింట్లు ఇచ్చేసింది. అది నచ్చని అమర్.. తనను ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. ఆ మాటలు భరించలేని ప్రియాంక.. గౌతమ్‌తో చెప్పి తన పాయింట్లను తిరిగి అమర్‌కు ఇప్పించింది. ప్రియాంక చేసిన ఈ పని వల్ల తనకు చాలా నెగిటివిటీ ఏర్పడింది. గ్రూప్ గేమ్ ఆడుతుందని, సోలోగా ఆడడం రావడం లేదని ప్రేక్షకులు సైతం విమర్శిస్తున్నారు. దీంతో ఈ విమర్శలకు చెక్ పెట్టాలని ప్రియాంక నిర్ణయించుకుంది.

పదేపదే అనడం నచ్చలేదు..
టాస్క్‌లో అమర్ ఫౌల్ చేశాడని ముందుగా కారణం చెప్పి తనను నామినేట్ చేసింది ప్రియాంక. ఆ తర్వాత ఫినాలే అస్త్రా సమయంలో తనను పదేపదే అలా అనడం నచ్చలేదని బయటపెట్టింది. అయితే అదే సమయంలో యావర్.. ఎవరినీ అడగకుండా ఫ్రెండ్‌గా ప్రశాంత్‌కు సపోర్ట్ చేస్తూ.. తన పాయింట్స్‌ను ప్రశాంత్‌కు ఇచ్చేశాడని, అదే సపోర్ట్‌ను ప్రియాంక నుండి కోరుకున్నానని అమర్ అన్నాడు. సపోర్ట్ కోరుకోవడం తప్పు కాదని, ఒకవైపు తను ఓడిపోయిన బాధలో ఉంటే పదేపదే పాయింట్ల గురించి అనడం తనకు నచ్చలేదని ప్రియాంక చెప్పింది. పదేపదే ఏమీ అనలేదని అమర్ రివర్స్ అయ్యాడు. అయినా నామినేషన్ చేసిన తర్వాత మాట్లాడేది ఏమీ లేదని సైలెంట్ అయిపోయాడు.

వారే విన్నర్..
ఇక బిగ్ బాస్ సీజన్ 7లోని చివరి నామినేషన్స్‌లో అర్జున్ తప్పా మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారు. అర్జున్.. ఫినాలే అస్త్రా గెలవడంతో తను నేరుగా ఫైనల్ వీక్‌కు వెళ్లిపోయాడు. ఈవారం ఎలిమినేషన్ నుండి కూడా విముక్తిపొందాడు. అయితే బిగ్ బాస్ చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా రెండువారాల పాటు విన్నర్ కోసం ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయని బిగ్ బాస్ తెలిపారు. అంటే ఈవారం జరిగే ఓటింగ్స్ కూడా విన్నర్ ఎవరో డిసైడ్ చేయగలవు అని అర్థం. ఈవారం ఓటింగ్ విషయంలో ఎవరు లాస్ట్‌లో ఉంటారో.. వారు ఎలిమినేట్ అవుతారు. కానీ ఇప్పటినుండి కంటెస్టెంట్స్‌కు వచ్చే ఓట్లు వారిలో ఫైనల్ విన్నర్ ఎవరో డిసైడ్ చేస్తాయి అని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు

Also Read: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget