BiggBoss 6 Telugu: ఇంట్లోకి బిగ్‌బాస్ ఎక్స్ కంటెస్టెంట్లు - అవినాష్ డ్యాన్సు చూస్తే నవ్వి నవ్వి చచ్చిపోవాల్సిందే
BiggBoss 6 Telugu: బిగ్ బాస్ ఫినాలేకు ఇంకా ఒక్క రోజే ఉంది.
![BiggBoss 6 Telugu: ఇంట్లోకి బిగ్‌బాస్ ఎక్స్ కంటెస్టెంట్లు - అవినాష్ డ్యాన్సు చూస్తే నవ్వి నవ్వి చచ్చిపోవాల్సిందే Previous contestants enter the Bigg Boss house BiggBoss 6 Telugu: ఇంట్లోకి బిగ్‌బాస్ ఎక్స్ కంటెస్టెంట్లు - అవినాష్ డ్యాన్సు చూస్తే నవ్వి నవ్వి చచ్చిపోవాల్సిందే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/339da1be1890a7055b557f6ee56e6c971671267916884248_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
BiggBoss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 ముగిసిపోతోంది. ఇదెప్పుడు అయిపోతుందా అని చూసే వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఇంకా ఒక్కరోజు ఉంటే చాలు విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. సీజన్ 6 దుకాణం మూతపడిపోతుంది. కాగా ఫినాలేకు ముందు రోజు ఆట పాటలతో, కామెడీతో ధూం ధాంగా నిర్వహించారు. ఇందుకుగాను ముందు సీజన్లోని పాత కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపించారు. వారిలో బాగా నవ్వించింది ముక్కు అవినాష్. ఆయన తన డ్యాన్సుతో చాలా నవ్వించాడు. చూస్తే మీరు కూడా నవ్వుతారు.
ఎవరెవరు?
అషూరెడ్డి, మెహబూబ్ ఇంట్లోకి వెళ్లారు. వాళ్లిద్దరూ కలిసి డ్యాన్సులు చేశారు. తరువాత ఇంటి సభ్యుల మధ్య ప్రశ్నలు అడిగే టాస్కు ఇచ్చారు. అయితే కరెక్టు చెప్పకుండా జవాబులు తప్పు చెప్పాలి. ఆదిరెడ్డి ‘లవ్’ స్పెల్లింగ్ చెప్పమని కీర్తిని అడిగారు. కీర్తి తప్పు చెప్పింది. వెంటనే కీర్తి ‘శ్రీహాన్ లవర్ పేరేంటి’ అని అడిగింది. దానకి ఆదిరెడ్డి ‘ఇనాయ’ అని చెప్పాడు. దీంతో అందరూ నవ్వారు. అషూ రెడ్డితో డ్యాన్సు చేశాడు మెహబూబ్.
తరువాత అవినాష్, అరియానా జంటగా వచ్చారు. అవినాష్ సీరియస్‌గా ‘మేం వెళ్తున్నప్పుడు ఒకరిని తీసుకెళ్తున్నాం’ అన్నాడు. దానికి ఆదిరెడ్డి ‘బ్రో, ఎంత మంది ఇదే యాక్టింగ్’ అన్నాడు. దాని తరువాత అవినాష్ డ్యాన్సు మొదలుపెట్టాడు. ‘మామా ఏక్ పెగ్ లా’ పాటకి ఆయన వేసిన డ్యాన్సు చాలా నవ్వొచ్చేలా ఉంది. మిగతావారు అతనిలా వేయలేక నవ్వుతూ నిల్చుండిపోయారు. మధ్యలో నాగిన్ డ్యాన్స్ చేశాడు. తరువాత అందరూ కలిసి ‘పక్కన పడ్డాది లేదో చూడవే పిల్లా నాది నక్లీసు గొలుసు’ అనే పాటకి డ్యాన్సు చేశారు. రోల్ రైడా కూడా మధ్యలో మెరిశాడు.
ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకి విజేత ఎవరో తేలిపోనుంది. షో మాత్రం సాయంత్రం ఆరు గంటలకు మొదలవుతుంది. రేవంత్ లేదా రోహిత్‌లలో ఎవరో ఒకరు విన్నర్ అయ్యే అవకాశం ఉంది.
Also read: రేవంత్ వర్సెస్ రోహిత్ - ఫినాలే వేదికపై వీరిద్దరూ? రేవంత్ విన్నర్?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)