Bigg Boss 6 Telugu: ఇనయాను నామినేట్ చేస్తుంటే శ్రీహాన్, శ్రీసత్య వెకిలినవ్వులు - ఇవే తగ్గించుకుంటే మంచిది
Bigg Boss 6 Telugu: గీతూ ఎందుకు ఇంట్లోంచి బయటికి వెళ్లిందో ఇప్పటికీ ఇంటి సభ్యులకు అర్థం కాలేదు.
Bigg Boss 6 Telugu: అతి ఎప్పుడైనా అనర్థమే. అతి నవ్వు, ఏడుపు కూడా చెడు చేస్తాయి. అలాగే అతి వెటకారం కూడా ఎప్పటికైనా దెబ్బతీస్తుంది. ఇనయా నామినేట్ చేస్తున్నా, ఇనయాను ఎవరైనా నామినేట్ చేస్తున్నా... ఆమె అధికంగా వాదిస్తుంది. ఆమె వాదిస్తున్నప్పుడు ఎందుకోగాని శ్రీసత్య, శ్రీహాన్ వెటకారపు నవ్వులు, చేష్టలు చేస్తుంటారు. అలాంటి ‘అతి’ పనులు చేసే గీతూ బయటికి వెళ్లింది. ఇక శ్రీసత్య అతి చేష్టలు తగ్గించుకోకపోతే తరువాతి టార్గెట్ ప్రేక్షకులకు ఆమెనే అవుతుంది. ఆదిరెడ్డి ఇనయాను నామినేట్ చేస్తుంటే వీరిద్దరూ తెగ నవ్వేసుకుంటూ చిరాకు తెప్పించారు. శ్రీసత్య నవ్వాపుకుంటూ ఓవర్ చేసింది. నిజానికి అక్కడ అంత నవ్వాపుకునేంత పాయింట్ ఏమీ లేదు.
ఇక ప్రోమోలో ఏముందంటే నామినేషన్ డే కాబట్టి ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ముఖం మీద ఎరుపు నీళ్లు కొట్టి నామినేట్ చేయాలని చెప్పాడు బిగ్‌బాస్. శ్రీతస్య ఇనయాను నామినేట్ చేసింది. ‘నువ్వు ఒక సెన్సిటివ్ విషయం అన్నావు. శ్రీహాన్‌ను, నన్ను ఉద్దేశించి అన్నావు. శ్రీహాన్ బయట ఒక లైఫ్ ఉంది, నాకూ బయట ఒక లైఫ్ ఉంది’ అని చెప్పింది శ్రీసత్య. దానికి ఇనయా ‘నువ్వు సూర్య గురించి ఇన్ డైరెక్ట్‌గా ఏం ఎత్తలేదా’ అని అడిగింది. దానికి శ్రీసత్య ‘నేను సూర్య గురించి మాట్లాడలేదు, ఫైమా గురించి అన్నాను’ అంది. ఇక కీర్తి - శ్రీహాన్ మధ్య గొడవ ఎప్పట్నించో రాజుకుంది. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అయింది. కీర్తి శ్రీహాన్‌ను నామినేట్ చేస్తూ ‘లాస్ట్ నామినేషన్లో మీరు హ్యుమానిటీ గురించి మాట్లాడారు’ అంది. దానికి శ్రీహాన్ ‘హ్యుమానిటీ గురించి నేను హైలైట్ చేసుకోలేదు, హీరోయిన్లా నువ్వు చెప్పుకున్నావ్ హ్యుమానిటీ అని’ అన్నాడు. దానికి కీర్తి ‘ఇక్కడ ఎవరూ హీరోలు, హీరోయిన్లు లేరు, అదే తగ్గించుకుంటే మంచిది’ అంది. దానికి శ్రీహాన్ ‘తగ్గించుకోను’ అన్నాడు.
రేవంత్ వాసంతిని నామినేట్ చేశాడు. రేవంత్ ఆటలో కోడిపిల్లల్లా ఒక్కొక్కరిని ఎత్తిపడేస్తాడు. కానీ వాసంతిని చెయ్యెత్తి కొట్టడం తప్పు అంటూ నామినేట్ చేశాడు. దానికి వాసంతి అందరూ ఫుటేజీ చూశారు అంది. నువ్వు ఆడకుండా వెనక్కి వెనక్కి వెళ్లిపోతావ్ అంటూ కామెంట్ చేశాడు రేవంత్. ఇక ఆదిరెడ్డి రేవంత్‌ని నామినేట్ చేశాడు. వారి మధ్య కాస్త కోపంగానే నామినేషన్ సాగింది. ఆదిరెడ్డి ‘ఇక రండి అని కోపంగా అంటావ్’ అనగానే రేవంత్ ఫైర్ అయిపోయాడు. ఆయన కోపం తగ్గించుకోవడం అనేది బిగ్ బాస్ ఇంట్లో ఉండగా జరగదు. రేవంత్ ‘నేనంతే, అది నా గేమ్ ప్లాన్. నువ్వు రాలేవా’ అని అడిగాడు. దానికి ఆదిరెడ్డి ‘నువ్వు ఎంత తోపైనా, నేను బక్కపలచుగా ఉన్నా... నేను తగ్గను’ గట్టిగా చెప్పాడు.
శ్రీసత్య కెప్టెన్ కావడంతో ఎవరూ ఆమెను నామినేట్ చేయకూడదు, అలాగే రాజ్, రోహిత్ కూడా ఈసారి నామినేషన్ నుంచి తప్పించుకున్నారు. మిగతావారంతా నామినేషన్లలో ఉన్నారు. ఈ వారం ఎవరూ ఇంట్లోంచి వెళతారో మాత్రం పెద్ద సస్పెన్సే. ఊహకు అందడం కూడా కష్టమే.
Also read: గీతూ తప్పుకు శ్రీహాన్‌కు శిక్ష, ఫుడ్ విషయంలో ఇనయాను తప్పుబట్టిన నాగార్జున