News
News
X

Bigg Boss 6 Telugu: పప్పూ నువ్వు కూర్చో - రేవంత్‌కి నాగార్జున చేతిలో మూడినట్టే ఉంది ఈసారి

Bigg Boss 6 Telugu: రేవంత్ కి ఈ వీకెండ్లో నాగార్జున గట్టి క్లాసు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: వీకెండ్ ఎపిసోడ్ కోసమే కాదు, ప్రోమో కోసం కూడా చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. కారణం ఎవరికి నాగార్జున క్లాసు తీసుకుంటారో చూడడం కోసం. ఈ వారం మొత్తమ్మీద ఇంటి సభ్యులు చాలా తప్పులు చేశారు. అందుకే వారికి ఈసారి గట్టి క్లాసు ఉంటుందని అర్థమైపోయింది ప్రేక్షకులకు. అందుకే వీకెండ్ ప్రోమో, ఎపిసోడ్ కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరిగిపోయింది.అయితే ఈ ప్రోమోలో రేవంత్‌కి నాగ్ క్లాసు తీసుకున్నట్ట అర్థమవుతోంది. 

పప్పూ కూర్చో...
ఈ వారం జరిగిన ఓ గేమ్‌లో  రేవంత్ ‘నువ్వుండరా పప్పు’ అని అర్జున్‌ను అన్నాడు. దానికి అర్జున్ ముందు ఏమీ పట్టించుకోలేదు. కానీ శ్రీసత్య ‘నిన్ను ఏమన్నా పట్టించుకోవా, మనిషివి  కావా’ అంటూ కసురుకుంది. దాంతో అర్జున్ రేవంత్ పై  చాలా ఫైర్ అయిపోయాడు. ఇద్దరూ గొడవ పడ్డారు. అదే విషయాన్ని ఈరోజు లేవనెత్తారు నాగార్జున. ప్రోమో మొదలవ్వగానే నాగార్జున సీరియస్‌గా ఉన్నారు. ‘ఏంటి బిగ్‌బాస్ ఈ వారం కొంచెం కోప్పడినట్టు ఉన్నారు’ అని అడిగారు. దానికి శ్రీహాన్ సమాధానం చెబుతుండగా మధ్యలో రేవంత్ లేచాడు. వెంటనే నాగ్ ‘పప్పు పప్పు నువ్వు కూర్చో’ అన్నారు సీరియస్‌గా. దీంతో రేవంత్ చాలా ఫీలైనట్టు కనిపించాడు. తరువాత నాగార్జున శ్రీహాన్ హ్యాపీ బర్త్ డే చెప్పారు. తరువాత ‘నీకోసం కేకు, హార్ట్’ అన్నారు. ఇనయా కేకు తయారు చేసి హార్ట్ సింబల్ వేసిన సంగతి తెలిసిందే. దానికి శ్రీహాన్ ‘ఏదైనా తేడా వస్తే కెమెరాలోంచి చీపుళ్లు, చెప్పులు అన్నీ వచ్చేస్తాయి సర్’ అన్నాడు. 

తప్పు ఎవరిది?
శ్రీసత్యను పప్పు విషయంలో తప్పు ఎవరిది? అని అడిగారు నాగార్జున. దానికి శ్రీసత్య ‘ఫ్రెండ్స్ నలుగురు ఉన్నప్పుడు ఏమనుకున్నా ఫర్వాలేదు సర్, గేమ్ జరుగుతున్నప్పుడు నువ్వుండరా పప్పు అనడం కొంచెం బాగోలేదు’ అంది. నాగార్జున ‘రేవంత్ నువ్వు చేసింది తప్పా, ఒప్పా? చెప్పు పప్పు’ అని అడిగారు. దానికి రేవంత్ ‘ఇన్ని వారాల్లో లేనిది, అప్పుడు ఎప్పుడు చెప్పనిది, ఇప్పుడు పక్కవాళ్లెవరో చెబితే చెప్పడం’ అనగానే అర్జున్ ‘లేదు సర్ చాలా సార్లు చెప్పాను అనొద్దని’ అని చెప్పాడు. ఈ విషయం చివరికి ఏం తేల్చారో ఎపిసోడ్ చూడాలి. 

News Reels

ఫైమా సంచాలకురాలిగా ఎలా చేసిందని అడిగితే రాజ్ ఏదో చెప్పబోయాడు. దానికి నాగార్జున ‘ఇక చాలు’ అంటూ రాజ్ లాగే నటించి చూపించారు. తరువాత చిట్టీల్లో నీ పేరు వచ్చాక మళ్ల ఓటింగ్‌కు ఎందుకు వెళ్లావ్ అని అడిగారు శ్రీసత్యని. దానికి ‘ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదని మీరు తిడతారని మేము ఫిక్సయ్యాం, దానితో పాటూ చిట్టీలాట ఆడామని  మీరు తిడతారేమోనని’ అని సమాధానం చెప్పింది శ్రీసత్య.  దానికి నాగార్జున ‘అంతా నా మీద తోసేశారా?’ అని సీరియస్‌గా అన్నారు. దాంతో ప్రోమో ముగిసింది.  

Also read: ఆడినా కూడా జైలుకెళ్లిన వాసంతి, అందరూ కలిసి టార్గెట్ చేశారుగా

Published at : 22 Oct 2022 10:17 AM (IST) Tags: Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Inaya sulthana Revanth Pappu Dialogue

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Bigg Boss 6 Telugu: ‘ఏకాభిప్రాయం’ అనేది కరెక్టు కాదు - బిగ్‌బాస్‌నే తప్పు పడుతున్న సీజన్ 6 కంటెస్టెంట్లు

Bigg Boss 6 Telugu: ‘ఏకాభిప్రాయం’ అనేది కరెక్టు కాదు - బిగ్‌బాస్‌నే తప్పు పడుతున్న సీజన్ 6 కంటెస్టెంట్లు

Bigg Boss 6 Telugu: ‘టికెట్ టు ఫినాలే’ కోసం కిందా మీద పడి కొట్టుకున్న అమ్మాయిలు

Bigg Boss 6 Telugu: ‘టికెట్ టు ఫినాలే’ కోసం కిందా మీద పడి కొట్టుకున్న అమ్మాయిలు

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

టాప్ స్టోరీస్

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

TRS Fire On Sharimila : భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

TRS Fire On Sharimila :  భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?