Bigg Boss 9 Launch Promo: హౌస్‌లోకి ఎంటర్ కాక ముందే బయటకు - సరికొత్తగా బిగ్ బాస్ 9 హౌస్... ఫస్ట్ డే ట్విస్ట్ మామూలుగా లేదు
Bigg Boss 9: కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఊహించని మలుపులతో సరికొత్తగా బిగ్ బాస్ సీజన్ 9 రెడీ అవుతోంది. ఈసారి రణరంగమే అనేలా రిలీజ్ చేసిన లాంచ్ ప్రోమో అదిరిపోయింది.

Bigg Boss 9 Telugu Season 9 Promo: సస్పెన్స్... సస్పెన్స్... సస్పెన్స్... మరికొద్ది గంటల్లో ఈ సస్పెన్స్‌కు తెర పడనుంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా ది ఫేమస్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈసారి సమరం కాదు రణరంగమే అనేలా ఓవైపు సెలబ్రిటీలు మరోవైపు సామాన్యులు హౌస్‌లోకి సందడి చేయబోతున్నారు. ఆడియన్స్ ఊహకు అందని ట్విస్టులతో డబుల్ హౌస్‌లో డబుల్ డోస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు అంతా సిద్ధమైంది.
నాగ్ ఎంట్రీ అదుర్స్
'ఊహకందని మార్పులు... ఊహించని మలుపులు' అంటూ కింగ్ నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది. ఫస్ట్ సామాన్యులతో ఇంట్రడక్షన్ చేసిన నాగ్ ఫన్ చేశారు. నాగార్జునను చూసిన కామనర్ డాలియా... 'నా హార్ట్ అలా రేజ్ అవుతుంది' అంటూ చెప్పగా బిగ్ బాస్ డాలియా నన్ను చూసేసింది ఇంటికి పంపించేద్దామా? అంటూ ఫన్ చేశారు.
అర్జునుని చూస్తామా?
సరికొత్త బిగ్ బాస్ హౌస్‌లోకి నాగ్ కళ్లకు గంతలు కట్టుకుని వెళ్తుండగా... 'ఇప్పటివరకూ నాలో యుద్ధ భూమిలో శంఖం పూరించే కృష్ణున్ని చూశారు. ఈ సీజన్‌లో రంగంలోకి దిగే అర్జునున్ని చూస్తారు.' అంటూ బిగ్ బాస్ చెప్పగా... 'నేను దేనికైనా సిద్ధమే' అంటూ కళ్లకు గంతలు తీసేసిన నాగ్... న్యూ హౌస్ చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరూ ఒక్కొక్కరూ తమను తాము పరిచయం చేసుకుంటూ హౌస్‌లోకి ఎంటర్ అవుతారు.
Also Read: ఇదేమైనా 9 నుంచి 5 గంటల వరకూ చేసే ఉద్యోగమా? దీపికా పదుకొనే షిఫ్ట్ టైమింగ్స్ వివాదంపై అడివి శేష్!
ఎంటర్ కాక ముందే బయటకు
ఈసారి ఫస్ట్ డేనే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హౌస్‌లోకి ఎంటర్ కాక ముందే ఓ సెలబ్రిటీ బయటకు వచ్చేశారు. ఓ సెలబ్రిటీ హౌస్‌లోకి ఓ చిన్న బాక్స్‌తో వెళ్లాలని బిగ్ బాస్‌ను పర్మిషన్ అడుగుతాడు. 'ఆ బాక్స్ సీక్రెట్ ఏంటి?' అంటూ నాగ్ ప్రశ్నించగా... అది హౌస్‌లో ఉండగానే తెలుస్తుంది అంటూ ఆ సెలబ్రిటీ చెప్తాడు. 'ఇది నా శరీరంలో ఓ భాగం. హౌస్‌లోకి తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వండి.' అంటూ అడగ్గా... అందుకు బిగ్ బాస్ అంగీకరించడు. దీంతో నేను ఇంటికి వెళ్లిపోతాను అంటూ సెలబ్రిటీ చెప్పగా... 'అది మీ ఇష్టం' అంటూ బిగ్ బాస్ చెప్పగా ఆ కంటెస్టెంట్ అక్కడి నుంచి ముందే బయటకు వచ్చేస్తాడు. ఆ వెళ్లిపోయింది టీవీ నటుడు భరణి శంకర్ అని తెలుస్తోంది.
కంటెస్టెంట్స్ వీళ్లే
ఈ సారి 14 మంది హౌస్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 9 మంది సెలబ్రిటీలు కాగా... మిగిలిన ఐదుగురు అగ్నిపరీక్షలో నెగ్గిన సామాన్యులు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరికొంతమంది ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సెలబ్రిటీస్ లిస్ట్‌లో యాంకర్, టీవీ నటి రీతూ చౌదరి, జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, డ్యాన్సర్ రాము రాథోడ్, బుజ్జిగాడు ఫేం సంజనా గల్రానీ, ఆషా షైనీ, భరణి శంకర్, సుమన్ శెట్టి, కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ, అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక కామనర్స్‌గా దమ్ము శ్రీజ, పవన్ కల్యాణ్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ హరీష్ వెళ్లే ఛాన్స్ ఉంది.





















